2026 వ సంవత్సరం జూన్ 28 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 135 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

June 28th, 11:30 am

ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మరోసారి మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. 2026 సంవత్సరంలో సగం గడిచిపోతోంది. ఈ ఆరు నెలల్లో ‘మన్ కీ బాత్’ లో మన దేశ ప్రజలు సాధించిన ఎన్నో విజయాల గురించి మనం చర్చించుకున్నాం. జూన్ నెలలో కూడా దేశం కొన్ని మైలురాళ్లను సాధించింది. అవి ప్రతి పౌరుడికి గర్వకారణాలు. ఈ విజయాలు దేశ భద్రత, స్వావలంబనకు సంబంధించినవి. కోల్‌కతాలో జరిగిన ఒక నావికాదళ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఇటీవల నాకు లభించింది. అక్కడ ఐఎన్ఎస్ దూనాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రయ్ నౌకలను భారత నావికాదళంలోకి చేర్చారు. ఈ నౌకల రూపకల్పన నుండి తయారీ వరకు ప్రతి పనీ స్వదేశీయులే చేశారు.

యోగాకున్న పరివర్తనాత్మక శక్తిని చెప్పే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

June 22nd, 08:13 am

యోగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజల ఆరోగ్యానికి సాయపడమే కాకుండా, ఆత్మవిశ్వాసంతో సానుకూల జీవితాలను గడపడానికి కూడా స్ఫూర్తిని కలిగిస్తోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం అసాధారణ విజయాన్ని సాధించడమే దీనికి నిదర్శనమని ఆయన అన్నారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026ను ప్రపంచవ్యాప్త వేడుకగా విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధానమంత్రి

June 21st, 10:00 pm

అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026ను నిజమైన ప్రపంచవ్యాప్త వేడుకగా మార్చినందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సేవా తీర్థ్‌లో యోగా

June 21st, 03:51 pm

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని సేవాతీర్థ్‌లో ఈ రోజు యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఐఎన్ఎస్ అగ్రే, ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్ నౌకల త్రివిధ ప్రారంభోత్సవ వేడుకలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

June 21st, 12:51 pm

ఈ రోజు అనేక విధాలుగా ప్రత్యేకమైనది. యావత్ ప్రపంచమూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించుకుంటోంది. ఇలాంటి విశిష్ట సందర్భంలో పవిత్ర బెంగాల్ భూమికి వచ్చే అవకాశం లభించినందుకు నేను సంతోషిస్తున్నాను. భారత దేశ ఆలోచనలకు కొత్త దిశను అందించిన, భారత దేశ పునరుజ్జీవాన్ని వేగవంతం చేసిన, సముద్ర మార్గాల ద్వారా శతాబ్దాలుగా దేశాన్ని ప్రపంచంతో అనుసంధానించిన భూమి ఇది. ఈ రోజు ఇదే మట్టిపై ఆత్మనిర్భర్ భారత్, సురక్షిత భారత్, వికసిత భారత్‌ లక్ష్యాలతో ముడిపడి ఉన్న ఓ ముఖ్యమైన కార్యక్రమం జరుగుతోంది. కొంతసేపటి క్రితమే ఐఎన్ఎస్ అగ్రే, ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్ నౌకలను భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టాం. జూన్ 21ని ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవంగా నిర్వహించుకోవడం యాదృచ్ఛికం. అదే రోజున భారతదేశపు అత్యంత అధునాతన హైడ్రోగ్రఫీ నౌక ఐఎన్ఎస్ సంశోధక్‌ను సముద్ర జలాల్లోకి ప్రవేశపెట్టడం కాకతాళీయం. ఈ సందర్భంగా భారత నౌకాదళానికి, ఈ ప్రాజెక్టులకు పనిచేసిన శాస్త్రవేత్తలకూ, ఇంజనీర్లకూ, కార్మికులకూ, నా ప్రియమైన దేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ఐఎన్ఎస్ దూనగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రే యుద్ధ నౌకలను నావికాదళంలోకి ప్రవేశపెట్టిన ప్రధాని

June 21st, 12:50 pm

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో గల శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ వద్ద జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి, నిర్మించిన మూడు యుద్ధనౌకలను అధికారికంగా నావికాదళంలోకి ప్రవేశపెట్టారు. వీటిలో అత్యాధునిక స్టెల్త్ ఫ్రిగేట్ 'ఐఎన్ఎస్ దూనగిరి', పెద్ద సర్వే నౌక 'ఐఎన్ఎస్ సంశోధక్’, జలాంతర్గామి నిరోధక నౌక 'ఐఎన్ఎస్ అగ్రే'లు ఉన్నాయి. ఈ నౌకల చేరిక భారత కార్యాచరణ సామర్థ్యాలను గణనీయంగా పెంచడమే కాకుండా సముద్రాలపై నిఘాను బలోపేతం చేస్తుంది. అలాగే భౌగోళిక రాజకీయ ముప్పుల నుంచి మన తీరప్రాంత జలాలకు రక్షణను మరింత పటిష్ఠం చేస్తుంది. ఈ మూడు నౌకలను భారత నావికాదళానికి చెందిన 'వార్‌షిప్ డిజైన్ బ్యూరో' రూపొందించగా కోల్‌కతాలోని 'గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్, ఇంజనీర్స్' (జీఆర్ఎస్‌ఈ) సంస్థ నిర్మించింది. వీటి నిర్మాణంలో 200కు పైగా ఎంఎస్ఎంఈలతో కూడిన భారతీయ పరిశ్రమలు విస్తృతంగా భాగస్వామ్యమయ్యాయి. 75 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానం లేదా పరికరాలను కలిగి ఉన్న ఈ నౌకలు 'ఆత్మనిర్భరత' పట్ల భారత్‌కు ఉన్న నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనంగా ఉన్నాయి.

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం: కోల్‌కతా నుండి కొన్ని దృశ్యాలు

June 21st, 06:46 am

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మానవాళికి భారతదేశం అందించిన ఈ కాలాతీత కానుకను వేడుకగా జరుపుకోవడానికి, కోల్‌కతాలోని ప్రసిద్ధ రెడ్ రోడ్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా సమాజంలోని అన్ని వర్గాలకు చెందిన వేలాది మందితో ఆయన కలిశారు. ఈ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, యోగా అనేది సమతుల్యత, శ్రేయస్సు మరియు మానవ ఐక్యతకు మార్గమని ఆయన నొక్కిచెప్పారు. అలాగే ఈ ఏడాది ఇతివృత్తమైన “ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా”ను కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.

కోల్‌కతాలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

June 21st, 06:45 am

గౌరవనీయులైన పశ్చిమబెంగాల్‌ గవర్నర్ శ్రీ ఆర్.ఎన్.రవి, ఉత్సాహవంతులైన ముఖ్యమంత్రి శ్రీ సువేందు అధికారి, కేంద్ర ప్రభుత్వంలో నా సహచరుడు శ్రీ ప్రతాపరావు జాదవ్, వేదికను అలంకరించిన ఇతర ప్రముఖులు, ఈ కార్యక్రమానికి హాజరైన సభికులు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి యోగా వేడుకలో పాలుపంచుకుంటున్న వారు సహా నా ప్రియమైన దేశప్రజలారా... మీకందరికీ నమస్కారం!

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జాతీయ వేడుకలను

June 21st, 06:30 am

ఈ రోజు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కోల్‌కతాలోని రెడ్ రోడ్ వద్ద జాతీయ వేడుకలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. వేలాది యోగా సాధకులతో కలిసి కామన్ యోగా ప్రోటోకాల్ సెషన్‌లో శ్రీ మోదీ పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏడాదిలో పగటి సమయం ఎక్కువగా ఉండే రోజు జూన్ 21 అని శ్రీ మోదీ తెలిపారు. అలాగే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించే అతిపెద్ద సామూహిక వేడుకల్లో ఈ రోజు ఒకటని వివరించారు.

పశ్చిమబెంగాల్‌... తారకేశ్వర్‌లో జరిగిన పశ్చిమబంగ దివస్ వేడుకల్లో పీఎం ప్రసంగం

June 20th, 05:13 pm

గవర్నర్ ఆర్.ఎన్.రవి, ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రి సువేందు అధికారి, వేదికపైనున్న ఇతర విశిష్ట ప్రతినిధులు, బెంగాల్ సోదరీసోదరులారా.. బాబా తారక్‌నాథ్‌ కొలువైన ఈ పవిత్ర భూమిపై పశ్చిమబెంగాల్‌ దినోత్సవం రోజున ఇక్కడ భారీ జన సందోహం... ఎన్నికలు, ప్రమాణస్వీకార కార్యక్రమం తర్వాత ఇలా మీ ముందుకు రావటం నాకెంతో గర్వంగా ఉంది. బెంగాల్‌ గాలిలో తాజాదనం నిండింది. ఇక్కడి ప్రతి అణువూ సరికొత్త పరిమళాన్ని వెదజల్లుతున్నట్లు ఉంది. సంకెళ్ల నుంచి బెంగాల్ విముక్తి పొందినట్లుగా, బెంగాల్ ఆత్మగౌరవం తిరిగి వచ్చినట్లుగా అనిపిస్తోంది. సరికొత్త భవిష్యత్తును నిర్మించుకోవాలనే బెంగాల్ సంకల్పానికి నేటి కార్యక్రమం, ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలే నిదర్శనం. ప్రజల ముఖాల్లోని వెలుగు, ప్రతి గ్రామంలో కనిపిస్తున్న ఆనందం, విశ్వాసం.. మీ సంతోషంలో భాగం పంచుకునేందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఒక ఓటు, ఒక ఎన్నిక ఎంతటి మార్పు తీసుకురాగలదో బెంగాల్‌లో స‌్పష్టంగా తెలుస్తుంది.

‘పశ్చిమబంగ దివస్’ సందర్భంగా హుగ్లీలో నిర్వహించిన వేడుకలకు హాజరైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

June 20th, 05:00 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ‘పశ్చిమబంగ దివస్’ (పశ్చిమ బెంగాల్ దినోత్సవం) వేడుకల్లో పాల్గొన్నారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీతో చారిత్రక సంబంధం గల హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్‌లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది “పశ్చిమ బెంగాల్: వారసత్వం-సామరస్యం-అభివృద్ధి” ఇతివృత్తంగా రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని, సామాజిక ఐక్యతను, ప్రగతిపై ప్రజాకాంక్షలను ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహిస్తున్నారు.

ఒడిశా ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పీఎం ప్రసంగం

June 20th, 01:10 pm

గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, గవర్నర్ శ్రీ హరిబాబు, ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీ, ఉప ముఖ్యమంత్రి శ్రీ కనక్ వర్ధన్ సింగ్ డియో, శ్రీమతి ప్రవతి పరిదా, ఒడిశా మంత్రి శ్రీ గణేశ్ సింగ్ ఖుంటియా, శ్రీ కృష్ణ చంద్ర మోహపాత్ర, పార్లమెంటు సభ్యుడు శ్రీ నబా చరణ్ మాఝీ, శ్రీ మన్మోహన్ సమాల్, శ్రీ బైజయంత్ పాండా, ఇతర ప్రముఖులు, సోదరీసోదరులారా.

ఒడిషాలో బీజేపీ ప్రభుత్వానికి రెండేళ్లు: మయూర్‌భంజ్ జిల్లా రాయ్‌రంగపూర్‌లో ₹47,600 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం.. శంకుస్థాపన

June 20th, 01:00 pm

రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఒడిషాలోని మయూర్‌భంజ్ జిల్లాలోగల పహాడ్‌పూర్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పవిత్ర ‘సంథాలీ’, ‘హో’ గిరిజన తెగల పవిత్ర వృక్షదేవతారాధ్య (జహేరా) ప్రాంతాలలో ప్రార్థనలు చేశారు. అలాగే, అక్కడి నైపుణ్యాభివృద్ధి కేంద్రం, పహాడ్‌పూర్ పాఠశాలను సందర్శించారు. ఒడిషాలో బీజేపీ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో “వికాస్ రా ధార-ఒడిషా సారా” (ఒడిషా రాష్ట్రమంతటా అభివృద్ధి స్రవంతి) ఇతివృత్తంగా మయూర్‌భంజ్ జిల్లాలోని రాయ్‌రంగపూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వారిద్దరూ పాల్గొన్నారు. ఇందులో భాగంగా శ్రీ మోదీ ₹47,600 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు కొన్నిటికి శంకుస్థాపన చేశారు.

‘పశ్చిమబంగ దివస్’ సందర్భంగా హుగ్లీలో నిర్వహించిన వేడుకలకు హాజరైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

June 19th, 11:54 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ‘పశ్చిమబంగ దివస్’ (పశ్చిమ బెంగాల్ దినోత్సవం) వేడుకల్లో పాల్గొన్నారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీతో చారిత్రక సంబంధం గల హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్‌లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది “పశ్చిమ బెంగాల్: వారసత్వం-సామరస్యం-అభివృద్ధి” ఇతివృత్తంగా రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని, సామాజిక ఐక్యతను, ప్రగతిపై ప్రజాకాంక్షలను ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహిస్తున్నారు.

ఇండియన్ కమ్యూనిటీ ఈవెంట్ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

June 18th, 11:41 pm

కాంతులు, రంగులతో కూడిన నగరం పారిస్. ఇది కళలకు, సరికొత్త ఆలోచనలకు, నూతన ఆవిష్కరణలకు స్ఫూర్తి. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన మీరంతా ఈ నగరాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతున్నారు. మీరే దీనికి సరికొత్త, చైతన్యవంతమైన రంగులను అద్దుతున్నారు.

ప్యారిస్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగం

June 18th, 09:30 pm

ఫ్రాన్స్‌లోని వివిధ రంగాల్లో భారతీయ సమాజం చేసిన గణనీయమైన కృషిని ప్రధానమంత్రి కొనియాడారు. భారతీయ ఆవిష్కరణలనూ, ఆలోచనలనూ ప్రపంచ మార్కెట్లతో అనుసంధానించడంలోనూ, ఇండియా-ఫ్రాన్స్ ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలోనూ- వారు పోషిస్తున్న కీలక పాత్రను ఆయన మెచ్చుకున్నారు. ఎక్కువ సంఖ్యలో భారతీయ విద్యార్థులు, నిపుణులు, పర్యాటకులు ఫ్రాన్స్‌ను గమ్యస్థానంగా ఎంచుకోవడంతో రెండు దేశాల మధ్య ప్రజా సంబంధాలు విస్తరించాయని ఆయన తెలియజేశారు. ప్రజల రాకపోకలను సులభతరం చేయడానికి తీసుకున్న చర్యలను ఆయన అభినందించారు. ఫ్రాన్స్‌లో యూపీఐ విస్తరణ గురించి మాట్లాడుతూ.. ఇది రెండు దేశాల మధ్య పర్యాటకానికి ఊతమిస్తుందని వివరించారు.

వరుసగా అత్యధిక కాలం దేశానికి సేవలందించిన ఎన్నికైన ప్రధానిగా రికార్డు సృష్టించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీని అభినందిస్తూ తీర్మానాన్ని ఆమోదించిన కేబినెట్

June 10th, 01:50 pm

భారత ప్రజాస్వామ్య ప్రస్థానంలో 2026 జూన్ 10ని ఒక చరిత్రాత్మక మైలురాయిగా అభివర్ణిస్తూ కేంద్ర క్యాబినెట్ ఈ రోజు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. నిరంతరాయంగా అత్యధిక కాలంపాటు దేశానికి సేవలందించిన ఎన్నికైన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన శ్రీ నరేంద్ర మోదీని ఈ సందర్భంగా కేబినెట్ అభినందించింది. ఎన్నికైన ప్రధానమంత్రిగా వరుసగా 4,399 రోజుల పాటు బాధ్యతలు నిర్వర్తించడం ద్వారా ఆయన సరికొత్త రికార్డును నెలకొల్పారు. 1952 నుంచి 1964 వరకు వరుసగా 4,398 రోజుల పాటు ప్రధానమంత్రిగా పనిచేసిన శ్రీ జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న గత రికార్డును ఆయన అధిగమించారు. దేశమే ప్రథమమన్న సంకల్పంతో ముందుకు సాగుతున్న నాయకుడికి ప్రజలు అందించిన అపూర్వమైన మద్దతుకు ఈ ఘట్టం అద్దం పడుతోందని, భారత ప్రజాస్వామ్య చేతనకు, ప్రజా విశ్వాసానికి, ప్రజా భాగస్వామ్య శక్తికి ఇది ప్రతీక అని ఈ తీర్మానంలో కేబినెట్ పేర్కొన్నది.

Yoga is the best way to maintain a healthy lifestyle with minimal expense: PM Modi at World Yogasana Championship in Ahmedabad

June 04th, 06:41 pm

PM Modi inaugurated the first World Yogasana Championship in Ahmedabad, calling yoga India’s timeless gift to humanity and expressing confidence that Yogasana will gain recognition as a competitive sport in global multi-sport events, including the Olympics. Highlighting yoga’s role in health, wellness and healthy ageing, he urged participants to become ambassadors of the ‘Yoga 365’ campaign and spread yoga’s message worldwide.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో తొలి ప్రపంచ యోగాసన పోటీలకు ప్రధానమంత్రి శ్రీకారం

June 04th, 06:40 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహించే తొలి ‘ప్రపంచ యోగాసన ఛాంపియన్‌షిప్’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- “అంతర్జాతీయ క్రీడా చరిత్రలో అహ్మదాబాద్ గడ్డపై నేడొక కొత్త అధ్యాయం ఆవిష్కృతమవుతోంది” అన్నారు.

న్యూఢిల్లీలో డబ్ల్యూహెచ్‌వో రెండో అంతర్జాతీయ సంప్రదాయ వైద్య సదస్సులో ప్రధాని ప్రసంగం

December 19th, 08:11 pm

డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్, మన తులసీ భాయ్ డాక్టర్ టెడ్రోస్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, నా మంత్రివర్గ సహచరుడు జె.పి. నడ్డా, ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాపరావు జాదవ్, ఈ కార్యక్రమంతో సంబంధమున్న ఇతర దేశాల మంత్రులు, వివిధ దేశాల రాయబారులు, గౌరవ ప్రతినిధులు, సాంప్రదాయ వైద్య రంగంలో కృషి చేస్తున్న గౌరవ నిపుణులు, సోదరీ సోదరులారా..!