'వికసిత భారత్' సంకల్పం తప్పక నెరవేరుతుంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

December 28th, 11:30 am

ఈ ఏడాది చివరి 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, 2025 సంవత్సరంలో జాతీయ భద్రత, క్రీడలు, సైన్స్ ప్రయోగశాలలు మరియు అంతర్జాతీయ వేదికలపై భారతదేశం తనదైన ముద్ర వేసిందని అన్నారు. నవసంకల్పాలతో 2026లో ముందుకు సాగడానికి దేశం సిద్ధంగా ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్, క్విజ్ పోటీ, స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2025 మరియు ఫిట్ ఇండియా ఉద్యమం వంటి యువత కేంద్రీకృత కార్యక్రమాలను కూడా ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం

August 25th, 06:42 pm

ఈ రోజు మీరంతా నిజంగా ఓ అద్భుత వాతావరణాన్ని సృష్టించారు. నేను చాలాసార్లు అనుకుంటాను.. ఈ లక్షలాది ప్రజల ప్రేమాశీస్సులను పొందిన నేను ఎంత అదృష్టవంతుడినో కదా అని! నేను మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు. చూడండీ.. ఓ చిన్న నరేంద్ర అక్కడ నిలబడి ఉన్నాడు!

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 5,400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపనలు చేసి వాటిని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి

August 25th, 06:15 pm

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 5,400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించి.. శంకుస్థాపన చేశారు. అలాగే పలు అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ.. యావత్ దేశం ప్రస్తుతం గణేష్ ఉత్సవాల ఉత్సాహంలో మునిగిపోయిందన్నారు. గణపతి బప్పా ఆశీస్సులతో గుజరాత్ పురోగతికి సంబంధించిన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ఈ రోజు శుభప్రదమైన ప్రారంభం జరిగిందని వ్యాఖ్యానించారు. పలు ప్రాజెక్టులను ప్రజల పాదాలకు అంకితం చేసే అవకాశం తనకు లభించిందన్న ప్రధానమంత్రి ఈ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభ సందర్భంగా పౌరులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

18వ అంతర్జాతీయ ఖగోళ, అంతరిక్ష భౌతిక శాస్త్ర ఒలింపియాడ్‌‌‌లో ప్రధానమంత్రి వీడియో సందేశం

August 12th, 04:34 pm

గౌరవ అతిథులు, విశిష్ట ప్రతినిధులు, ఉపాధ్యాయులు, మార్గనిర్దేశకులు, నా ప్రియమైన, ఉత్సాహవంతులైన యువ స్నేహితులకు, నమస్కారం!

18వ అంతర్జాతీయ ఖగోళ, అంతరిక్ష భౌతిక శాస్త్ర ఒలింపియాడ్‌‌‌‌ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

August 12th, 04:33 pm

18వ అంతర్జాతీయ ఖగోళ, అంతరిక్ష భౌతిక శాస్త్ర ఒలింపియాడ్‌‌‌‌ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న 64 దేశాలకు చెందిన సుమారు 300 మందిని కలుసుకోవడం ఆనందంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. అంతర్జాతీయ ఒలింపియాడ్‌ కోసం భారత్ వచ్చిన వారికి ఆత్మీయ స్వాగతం పలికారు. ‘‘భారత్‌లో సంప్రదాయం ఆవిష్కరణలతో, ఆధ్యాత్మికత శాస్త్రంతో, ఆసక్తి సృజనాత్మకతతో మిళితమవుతాయి. శతాబ్దాలుగా, భారతీయులు ఆకాశాన్ని పరిశీలిస్తున్నారు. పెద్ద ప్రశ్నలు సంధిస్తున్నారు’’ అని శ్రీ మోదీ తెలిపారు. సున్నాను కనుగొన్న, భూమి తన అక్షం చుట్టూ తిరుగుతుందని మొదటిసారిగా చెప్పిన ఆర్యభట్టను ఉదాహరణగా పేర్కొన్నారు. ‘‘ఆయన సున్నా నుంచి ప్రారంభించి చరిత్రను సృష్టించారు!’’ అని ప్రధానమంత్రి చెప్పారు.

పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాని ప్రసంగం

July 21st, 10:30 am

రుతుపవనాలు కొత్తదనానికి, సృష్టికి ప్రతీక. ఇప్పటివరకు అందిన నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా వాతావరణం అనుకూలంగా ఉంది. ఇది వ్యవసాయానికి లాభదాయకమైన సీజన్ అని వార్తలొస్తున్నాయి. మన రైతుల ఆర్థిక స్థితిగతుల్లోనే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థలో, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో, ఇంకా ప్రతి ఇంటి ఆర్థిక స్థితిగతుల్లోనూ వర్షం కీలక పాత్ర పోషిస్తుంది. నాకు అందిన సమాచారం ప్రకారం.. గత పదేళ్లలో నమోదైన నీటి నిల్వ కన్నా ఈ ఏడాది దాదాపు మూడు రెట్లు అధికంగా ఉంది. మున్ముందు దేశ ఆర్థిక వ్యవస్థకు ఇదెంతో ప్రయోజనం చేకూరుస్తుంది.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోదీ

July 21st, 09:54 am

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. తన వ్యాఖ్యలలో, ఆయన భయంకరమైన పహల్గామ్ మారణహోమాన్ని ప్రస్తావించారు మరియు పాకిస్తాన్ పాత్రను బహిర్గతం చేయడంలో భారతదేశ రాజకీయ నాయకత్వం యొక్క ఐక్య స్వరాన్ని ప్రశంసించారు. డిజిటల్ ఇండియా, ముఖ్యంగా యుపిఐ యొక్క ప్రపంచ గుర్తింపును కూడా ప్రధాని గుర్తించారు. నక్సలిజం మరియు మావోయిజం క్షీణిస్తున్నాయని ఆయన ధృవీకరించారు మరియు ఆపరేషన్ సిందూర్ విజయాన్ని కూడా ప్రశంసించారు.

చరిత్రాత్మక అంతరిక్ష యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని భూమికి తిరిగి వచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాకు స్వాగతం పలికిన ప్రధానమంత్రి

July 15th, 03:36 pm

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) చరిత్రాత్మక యాత్ర చేపట్టి, భూమికి తిరిగివచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆత్మీయ స్వాగతం పలికారు. ఐఎస్ఎస్ చేరుకున్న తొలి భారతీయ వ్యోమగామిగా కెప్టెన్ శుక్లా సాధించిన విజయం అసాధారణమైందని, దేశ అంతరిక్ష ప్రయాణంలో ఇదొక కీలక ఘట్టమని ప్రశంసించారు.

29 జూన్ 2025 న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 123 వ భాగంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

June 29th, 11:30 am

నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మీ అందరికీ అభినందనలు. మీరందరూ యోగా శక్తితో, అంతర్జాతీయ యోగా దినోత్సవ జ్ఞాపకాలతో నిండిపోయి ఉండాలి. ఈసారి కూడా జూన్ 21వ తేదీన, మనదేశంతో పాటు ప్రపంచం నలుమూలల నుండి కోట్లాది మంది అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. మీకు గుర్తుందా! ఇది 10 సంవత్సరాల కిందట ప్రారంభమైంది. ఇప్పుడు 10 సంవత్సరాలలో ఈ ధోరణి ప్రతి సంవత్సరం మరింత గొప్పగా మారుతోంది. ఎక్కువ మంది ప్రజలు తమ దైనందిన జీవితంలో యోగాను అవలంబిస్తున్నారని ఇది సూచిస్తుంది. ఈసారి యోగా దినోత్సవ ఆకర్షణీయమైన చిత్రాలను మనం చాలా చూశాం. విశాఖపట్న సముద్ర తీరంలో మూడు లక్షల మంది కలిసి యోగా చేశారు. మరో అద్భుతమైన దృశ్యం కూడా విశాఖపట్నం నుండే వచ్చింది. రెండు వేలకు పైగా గిరిజన విద్యార్థులు 108 నిమిషాల పాటు 108 సూర్య నమస్కారాలు చేసిన దృశ్యమది. ఊహించుకోండి! ఎంత క్రమశిక్షణ, ఎంత అంకితభావం ఉండి ఉంటుందో! మన నావికాదళ నౌకల్లో కూడా గొప్ప యోగా ప్రదర్శన కనిపించింది. తెలంగాణలో మూడు వేల మంది దివ్యాంగులు కలిసి యోగా శిబిరంలో పాల్గొన్నారు. సాధికారతకు యోగా ఎలా మాధ్యమం అవుతుందో వారు నిరూపించారు. ఢిల్లీ ప్రజలు యోగాను పరిశుభ్రమైన యమునా సంకల్పంతో అనుసంధానించి, యమునా నది ఒడ్డుకు వెళ్లి యోగా చేశారు. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన అయిన జమ్మూ కాశ్మీర్‌లోని చీనాబ్ వంతెన వద్ద కూడా ప్రజలు యోగా చేశారు. హిమాలయాల మంచు శిఖరాల్లో ఐటీబీపీ సైనికులు చేసిన యోగా కనిపించింది. సాహసం, సాధన కలిసి సాగాయి. గుజరాత్ ప్రజలు కూడా కొత్త చరిత్రను సృష్టించారు. వడ్ నగర్‌లో 2121 మంది కలిసి భుజంగాసనం వేసి కొత్త రికార్డు సృష్టించారు. న్యూయార్క్, లండన్, టోక్యో, పారిస్ మొదలైన ప్రపంచంలోని ప్రతి పెద్ద నగరం నుండి యోగా చిత్రాలు వచ్చాయి. ప్రతి చిత్రంలో ఒక విషయం ప్రత్యేకంగా ఉంది. శాంతి, స్థిరత్వం, సమతుల్యత ఆ చిత్రాల్లో అంతర్భాగంగా ఉన్నాయి. ఈసారి థీమ్ కూడా చాలా ప్రత్యేకమైంది. యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్.. అంటే 'ఒక భూమి - ఒక ఆరోగ్యం'. ఇది కేవలం నినాదం కాదు. ఇది 'వసుధైవ కుటుంబకం' అని మనల్ని అనుభూతి చెందించే దిశ. ఈ సంవత్సరం యోగా దినోత్సవ గొప్పతనం ఖచ్చితంగా ఎక్కువ మందిని యోగాను స్వీకరించడానికి ప్రేరేపిస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న కెప్టెన్ శుభాంశు శుక్లాతో ముచ్చటించిన ప్రధానమంత్రి

June 28th, 08:24 pm

ఈ రోజు మీరు మీ మాతృభూమి భారత్‌కు దూరంలో ఉన్నా.. భారతీయులందరి హృదయాలకు దగ్గరగా ఉన్నారు. మీ పేరులోనే శుభం ఉంది. అందువల్ల మీ ఈ ప్రయాణం శుభప్రదమైన నవ శకానికి నాంది పలికింది. ఈ సమయంలో మనిద్దరమే ఇలా మాట్లాడుకుంటున్నప్పటికీ మొత్తం 140 కోట్ల మంది భారతీయుల మనోభావాలూ నాతో ఉన్నాయి. నా గొంతు భారతీయులందరి ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తుంది. అంతరిక్షంలో భారత పతాకాన్ని ఎగురవేసినందుకు మీకు నా అభినందనలు. అక్కడ అంతా బాగానే ఉందా? మీరు బాగానే ఉన్నారా?

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) లో ఉన్న గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషణ

June 28th, 08:22 pm

భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. గ్రూప్ కెప్టెన్ శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన మొట్టమొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. శుభాంశు శుక్లా ప్రస్తుతం మాతృభూమికి అత్యంత దూరంలో ఉన్నప్పటికీ, ఆయన భారతీయులందరి హృదయాలకు అత్యంత చేరువలో ఉన్నారని ప్రధానమంత్రి అన్నారు. శుభాంశు పేరు స్వయంగా శుభప్రదమైనదని, ఆయన ప్రయాణం కొత్త శకానికి నాంది పలికిందని పేర్కొన్నారు. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ అయినప్పటికీ, 140 కోట్ల మంది భారతీయుల భావోద్వేగాలు, ఉత్సాహాన్ని ఇది ప్రతిబింబిస్తుందని శ్రీ మోదీ అన్నారు. శుభాంశుతో మాట్లాడుతున్న ఈ స్వరం యావత్ దేశపు సమష్టి ఉత్సాహం, గర్వాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు. అంతరిక్షంలో భారతదేశ జెండాను ఎగురవేసిన శుభాంశుకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. శుభాంశు ఆరోగ్య పరిస్థితి గురించి, అంతరిక్ష కేంద్రంలో అంతా బాగానే ఉందా అని అడిగి తెలుసుకున్నారు.

భారత్, హంగేరీ, పోలాండ్, అమెరికా వ్యోమగాములతో కూడిన స్పేస్ మిషన్ విజయవంత ప్రయోగం పట్ల ప్రధానమంత్రి హర్షం

June 25th, 01:30 pm

భారత్, హంగేరీ, పోలాండ్, అమెరికా వ్యోమగాములతో కూడిన స్పేస్ మిషన్ విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశించడం పట్ల ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు.