భారత్-ఫిజీ సంయుక్త ప్రకటన: పరస్పర స్నేహభావం స్పూర్తిగా భాగస్వామ్యం
August 25th, 01:52 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు.. ఫిజీ రిపబ్లిక్ ప్రధానమంత్రి శ్రీ సితివేని రబుకా భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ నెల 24 నుంచి 26 వరకు ఫిజీ ప్రధాని అధికారిక పర్యటన భారత్‌లో కొనసాగనుంది. ప్రధాని హోదాలో తొలిసారిగా భారత్‌లో పర్యటిస్తున్న శ్రీ రబుకా వెంట ఆయన సతీమణి, ఫిజీ వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ ఆంటోనియో లాలాబలావు, ఫిజీ రిపబ్లిక్ ప్రభుత్వ సీనియర్ అధికారుల ప్రతినిధి బృందం ఉన్నారు.