మత్తుమందుల దుర్వినియోగం, అక్రమ రాక పోకల కు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినం నాడు ప్రధాన మంత్రి ఇచ్చిన సందేశం
June 26th, 11:37 am
ఈ రోజు న, మత్తుమందుల దుర్వినియోగం, అక్రమ రాక పోకల కు వ్యతిరేకం గా అంతర్జాతీయ దినాన్ని మానవాళి పాటిస్తున్న సందర్భం లో, మన సమాజం నుంచి మత్తు మందుల కంటకభూతాన్ని నిర్మూలించడానికి క్షేత్ర స్థాయి లో పనిచేస్తున్న వారందరికీ ఇవే నా ప్రశంస లు. ప్రాణాల ను కాపాడేందుకు చేసే ప్రతి ఒక్క ప్రయాస మహత్వపూర్ణమైందే. ఏది ఏమైనా, మాదకద్రవ్యాలు వాటి తో చీకటి ని, వినాశాన్ని, సర్వనాశనాన్నే వెంటబెట్టుకు తీసుకువస్తాయి మరి.