58వ అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్‌లో స్వర్ణ పతకాలు సాధించిన భారతీయ విద్యార్థులను అభినందించిన ప్రధానమంత్రి

July 19th, 07:09 pm

ప్రతిష్ఠాత్మక 58వ అంతర్జాతీయ రసాయన శాస్త్ర ఒలింపియాడ్‌లో భారత బృందం నాలుగు స్వర్ణ పతకాలను సాధించింది. ఈ ప్రపంచస్థాయి పోటీలో భారత్ తరపున అత్యుత్తమ ప్రదర్శన చేసిన దేబదత్త ప్రియదర్శి, హర్షిత్ సింఘాల్, కబీర్ చిల్లర్, సందీప్ కుచిలతో కూడిన భారత బృందాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు. ఈ బృందం ప్రతిభ, అంకితభావం, విజ్ఞానశాస్త్రం పట్ల ఉన్న వారి అభిరుచి యావత్ దేశానికి గర్వకారణమన్నారు. ఇది అనేక మంది యువత రసాయన శాస్త్రాన్ని అభ్యసించి, అందులో రాణించడానికి స్ఫూర్తినిస్తుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

2047లో అభివృద్ధి చెందిన భారతదేశానికి మార్గం స్వావలంబన ద్వారానే సాగుతుంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

July 27th, 11:30 am

నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మళ్ళీ ఒకసారి మన దేశ సాఫల్యాల గురించి, మన ప్రజల విజయాల గురించి మాట్లాడుకుందాం. గత కొన్ని వారాల్లో – క్రీడలలోనైనా, శాస్త్రవిజ్ఞానంలోనైనా, సంస్కృతిలోనైనా – ఎన్నో గొప్ప సంఘటనలు జరిగాయి. ప్రతి భారతీయుడినీ గర్వపడేలా చేసిన విషయాలివి. శుభాంశు శుక్లా అంతరిక్ష ప్రయాణాన్ని ముగించుకొని భూమిపైకి ఇటీవల విజయవంతంగా తిరిగివచ్చిన సందర్భాన్ని దేశం యావత్తూ ఎంతో ఉత్సాహంగా గమనించింది. ఆయన భూమి పైకి తిరిగివచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా సంతోషాల వెల్లువ పెల్లుబికింది. ప్రతి హృదయంలో ఆనంద తరంగాలు పుట్టుకొచ్చాయి. దేశం అంతా గర్వంతో ఉప్పొంగిపోయింది. నాకు గుర్తుంది.... 2023 ఆగస్టులో చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రునిపై ల్యాండింగ్ అయిన తర్వాత దేశంలో శాస్త్రవిజ్ఞానం పట్ల, అంతరిక్ష పరిశోధన పట్ల ఒక కొత్త ఆసక్తి పిల్లల్లో ఏర్పడింది. తాము కూడా అంతరిక్ష యాత్ర చేస్తామని, చంద్రునిపై దిగుతామని, అంతరిక్ష శాస్త్రవేత్తలం అవుతామని ఇప్పుడు చిన్నారులు కూడా చెప్తున్నారు.