అంతర్జాతీయ చిరుత దినోత్సవం సందర్భంగా వన్యప్రాణి ప్రేమికులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

December 04th, 09:43 am

ఇవాళ అంతర్జాతీయ చిరుత దినోత్సవం సందర్భంగా, చిరుత పులుల రక్షణకు అంకితమైన వన్యప్రాణి ప్రేమికులకు, సంరక్షకులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. చిరుతలను సంరక్షించటానికి, అవి వృద్ధి చెందగలిగే పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించాలన్న లక్ష్యంతో మూడేళ్ల కిందట మా ప్రభుత్వం ప్రాజెక్టు చీతాను ప్రారంభించింది. కోల్పోయిన పర్యావరణ వారసత్వాన్ని, జీవవైవిధ్యాన్ని బలోపేతం చేసేందుకు చేసిన ప్రయత్నమిది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.