ఇథియోపియా ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు చేపట్టిన ప్రధానమంత్రి

December 17th, 12:02 am

పరిమిత, ప్రతినిధి స్థాయి విధానాల్లో జరిగిన చర్చల్లో వారు పాల్గొన్నారు. శతాబ్దాల నాటి నాగరికత పునాదులపై ఏర్పడి, ప్రజాసంబంధాలతో బలోపేతమైన ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించారు. వీటికి ప్రాధాన్యమిస్తూ.. భారత్-ఇథియోపియా సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచడానికి నాయకులిద్దరూ అంగీకరించారు. గ్లోబల్ సౌత్ భాగస్వాములుగా సమ్మిళిత ప్రపంచాన్ని నిర్మించడానికి రెండు దేశాల కృషిని కొనసాగించాలని నిర్ణయించారు. 2023లో జీ20కి అధ్యక్షత వహిస్తున్న సమయంలో ఆఫ్రికన్ యూనియన్‌కు ఈ కూటమిలో సభ్యత్వం ఇవ్వడం భారతదేశానికి దక్కిన గౌరవమని ప్రధానమంత్రి మోదీ స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి సమయంలో భారత్‌కు సంఘీభావం ప్రకటించడంతో పాటు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచం సాగిస్తున్న పోరాటాన్ని బలోపేతం చేసిన ఇథియోపియాకు కృతజ్ఞతలు తెలియజేశారు.

జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశ సందర్భంగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడితో ప్రధానమంత్రి సమావేశం

November 23rd, 02:18 pm

జోహన్నెస్‌బర్గ్‌లో జీ20 శిఖరాగ్ర సమావేశ సందర్భంగా గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు గౌరవనీయ శ్రీ సిరిల్ రామఫోసాను కలిశారు. ఈ శిఖరాగ్ర సమావేశానికి హృదయపూర్వకంగా ఆతిథ్యం ఇచ్చినందుకు... సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు అధ్యక్షుడు రామఫోసాకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. న్యూఢిల్లీ జీ20 శిఖరాగ్ర సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ముందుకు తీసుకెళ్లడానికి, వాటి ఆధారంగా మరింత పురోగతి సాధనకు దక్షిణాఫ్రికా జీ20 చేసిన ప్రయత్నాలనూ ఆయన అభినందించారు.

నమీబియా జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం

July 09th, 08:14 pm

ప్రతి ఒక్కరికి శుభాభినందనలతో నా ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను. ఈ గొప్ప దేశానికి సేవ చేసే అద్భుత అవకాశాన్ని మీకు మీ ప్రజలు కల్పించారు. రాజకీయాల్లో ఇదొక గొప్ప అవకాశమే కాక, పెద్ద సవాలు కూడా! మీ ప్రజల ఆకాంక్షలను పూర్తి చేయగలరని ఆశిస్తున్నాను.

Prime Minister addresses the Namibian Parliament

July 09th, 08:00 pm

PM Modi addressed the Parliament of Namibia and expressed gratitude to the people of Namibia for conferring upon him their highest national honour. Recalling the historic ties and shared struggle for freedom between the two nations, he paid tribute to Dr. Sam Nujoma, the founding father of Namibia. He also called for enhanced people-to-people exchanges between the two countries.

పర్యావరణం, కాప్-30లతో పాటు ప్రపంచ ఆరోగ్యం అంశాలపై బ్రిక్స్ 17వ శిఖరాగ్ర సదస్సు.. ప్రసంగించిన ప్రధానమంత్రి

July 07th, 11:38 pm

పర్యావరణం, కాప్-30, ప్రపంచ ఆరోగ్యసంరక్షణ’’ అంశాలపై సోమవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొని, సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాలతో పాటు పాలుపంచుకోవాల్సిందంటూ ఆహ్వానాన్ని అందుకున్న దేశాలు కూడా పాల్గొన్నాయి. ప్రపంచ భవిష్యత్తును పరిగణనలోకి తీసుకొని ఇలాంటి అధిక ప్రాధాన్యం కలిగిన అంశాలపై కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు బ్రెజిల్‌కు ఆయన తన ధన్యవాదాలు తెలిపారు. వాతావరణ మార్పును ఇంధన సమస్యల పరిష్కారం అనే ఒకే అంశంతో ముడిపెట్టి చూడడం భారతదేశం దృక్పథం కాదని, జీవనానికి ప్రకృతికి మధ్య సమతూకాన్ని ప్రభావితం చేసే అంశం ఇదని తమ దేశం భావిస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. వాతావరణ పరంగా న్యాయాన్ని ఏర్పరచడం అంటే అది ఒక నైతిక బాధ్యత అని, దీనిని తప్పక నిర్వర్తించాల్సిందేనని భారత్ సంకల్పించిందని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. పర్యావరణ సంరక్షణ దిశలో కార్యాచరణను చేపట్టడానికి భారత్ ఎంతో చిత్తశుద్ధితో ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ప్రజానుకూల, భూగ్రహానికి మిత్రపూర్వక ప్రగతిసాధక విధానాలను ప్రోత్సహించడానికి తీసుకొంటున్న వివిధ కార్యక్రమాలను గురించి ఆయన సమగ్రంగా సభకు వివరించారు. ఈ సందర్భంగా మిషన్ లైఫ్ (పర్యావరణ అనుకూల జీవనం), 'ఏక్ పేడ్ మా కే నామ్' (తల్లి పేరు మీద ఒక మొక్కను నాటడం), అంతర్జాతీయ సౌరశక్తి కూటమి, సమర్థవంతమైన విపత్తు సన్నద్ధ కూటమి (కోయలిషన్ ఫర్ డిజాస్టర్ రేజీలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్), హరిత హైడ్రోజన్ మిషన్, ప్రపంచ జీవ ఇంధన వేదిక, పులుల సంరక్షణ కూటమి (బిగ్ క్యాట్స్ అలయన్స్) తదితర కార్యక్రమాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు.

పర్యావరణం, కాప్-30, ప్రపంచ ఆరోగ్య అంశాలపై ఏర్పాటైన బ్రిక్స్ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

July 07th, 11:13 pm

బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతాల్లో భాగంగా పర్యావరణ, ఆరోగ్య భద్రత అంశాలకు బ్రెజిల్ అత్యధిక ప్రాధాన్యతనివ్వడం నాకు సంతోషం కలిగిస్తోంది. ఇవి పరస్పర సంబంధం గల అంశాలే కాక మానవాళి సంక్షేమానికి, ఉజ్జ్వల భవిష్యత్తుకూ ఎంతో ముఖ్యమైనవి.

ఘనా పార్లమెంటునుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం

July 03rd, 03:45 pm

ప్రజాస్వామ్య స్ఫూర్తి, గౌరవం, దృఢత్వంతో తొణికిసలాడే ఘనా దేశాన్ని సందర్శించడం అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నాను. ప్రపంచ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ ప్రతినిధిగా, నా వెంట 1.4 బిలియన్ భారతీయుల శుభాకాంక్షలను తీసుకువచ్చాను.

ఘనా పార్లమెంటులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

July 03rd, 03:40 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఘనా పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తొలి భారత ప్రధానమంత్రిగా ఆయన నిలిచారు. పార్లమెంట్ స్పీకర్ గౌరవనీయ అల్బన్ కింగ్స్‌ఫోర్డ్ సుమనా బాగ్బిన్ నిర్వహించిన ఈ సమావేశానికి పార్లమెంటు సభ్యులు, ప్రభుత్వ అధికారులు, ఇరు దేశాల నుంచి విశిష్ట అతిథులు హాజరయ్యారు. ఈ ప్రసంగం భారత్-ఘనా సంబంధాల్లో ఒక ముఖ్యమైన సందర్భంగా నిలిచింది. ఇది రెండు దేశాలను ఏకం చేసే పరస్పర గౌరవం, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలను ప్రతిబింబించింది.

అంగోలా అధ్యక్షుడితో నేటి సంయుక్త పాత్రికేయ సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటన

May 03rd, 01:00 pm

గౌరవనీయ అధ్యక్షులు లొరెన్సూ సహా ఆయన ప్రతినిధి బృందానికి భారత్‌ తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. ఇదొక చారిత్రక క్షణం... 38 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత అంగోలా అధ్యక్షుడు భారత పర్యటనకు వచ్చారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాలకు కొత్త దిశ, దశలను నిర్దేశించడంతోపాటు మరింత ఊపునిస్తూ భారత్‌-ఆఫ్రికా భాగస్వామ్యాన్ని పటిష్ఠం చేస్తుంది.

నైజీరియా అధ్యక్షునితో అధికారిక చర్చలు జరిపిన ప్రధానమంత్రి

November 17th, 06:41 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 17, 18 తేదీల్లో తన నైజీరియా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబుతో అబుజాలో ఈ రోజు అధికారిక చర్చలు జరిపారు. స్టేట్ హౌస్‌కు చేరుకున్న అనంతరం ప్రధానికి 21 తుపాకులతో గౌరవ వందనంతో లాంఛనంగా స్వాగతం పలికారు.

ప్రపంచ సింహాల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

August 10th, 09:03 am

ప్రపంచ సింహాల దినోత్సవం సందర్భంగా, సింహాల సంరక్షణ & భద్రత కోసం కృషి చేస్తున్న వారందరికీ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలిపారు. గంభీరమైన సింహాల రక్షణ విషయంలో ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ఫిబ్రవరి 2024లో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయాన్ని శ్రీ మోదీ ప్రధానంగా ప్రస్తావించారు. దీని కోసం ప్రపంచవ్యాప్తంగా లభించిన ప్రోత్సాహకర స్పందన పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

'ఇంటర్నేషనల్‌ బిగ్ క్యాట్ అలయన్స్‌' (ఐబీసీఏ) ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

February 29th, 04:31 pm

పులుల సంరక్షణ కోసం భారతదేశం కేంద్రంగా అంతర్జాతీయ కూటమి ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 'ఇంటర్నేషనల్‌ బిగ్ క్యాట్ అలయన్స్‌' (ఐబీసీఏ) కోసం, 2023-24 నుంచి 2027-28 వరకు, ఐదేళ్ల కాలానికి రూ.150 కోట్ల ఏకకాలిక బడ్జెట్‌ కేటాయింపునకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం అంగీకరించింది. ఐబీసీఏ ప్రధాన కార్యాలయాన్ని భారత్‌లో ఏర్పాటు చేస్తారు.

There is continuous progress in bilateral trade, investment between India and Kenya: PM Modi

December 05th, 01:33 pm

Addressing the event during the visit of the President of Kenya to India, PM Modi said, Africa has always been given high priority in India's foreign policy. Over the past decade, we have strengthened our collaboration with Africa in mission mode. I am confident that President Ruto's visit will not only enhance our bilateral relations but also provide new impetus to our engagement with the entire African continent.

We have converted our long-standing partnership to a Strategic Partnership between India & Tanzania: PM Modi

October 09th, 12:00 pm

PM Modi and President Hassan of Tanzania witnessed the signing of MOUs at Hyderabad House. PM Modi said that after the initiation of African Union as a full member of the G20, this is our first meeting with an African country. He added that we are converting our long-standing partnership into a strategic partnership between India and Tanzania

BRICS will be – Breaking barriers, Revitalising economies, Inspiring innovation, Creating opportunities, and Shaping the future: PM Modi

August 23rd, 03:30 pm

PM Modi addressed the BRICS Plenary Session in Johannesburg, South Africa. He elaborated at length the reforms undertaken by the Government in promoting the overall progress and development of India. PM Modi also lauded the initiatives such as the New Development Bank, Contigency Reserve Arrangement among others that have sought to promote stability and prosperity for the countries of the Global South.

ప్రపంచం శీతోష్ణస్థితి సంకటాలతోతంటాలు పడుతుంటే, మనం దారి ని చూపి, లైఫ్ స్టైల్ ఫార్ ఇన్ వైరన్ మంట్ – ‘మిశన్ ఎల్ఐఎఫ్ఇ’కార్యక్రమాన్ని ప్రారంభించామన్న ప్రధాన మంత్రి

August 15th, 05:08 pm

ఈ రోజు న 77వ స్వాతంత్ర్య దినం సందర్భం లో న్యూ ఢిల్లీ లోని చరిత్రాత్మక ఎర్ర కోట బురుజుల మీది నుండి దేశ ప్రజల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, జి20 శిఖర సమ్మేళనం కోసం మనం ‘‘ఒక ప్రపంచం, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు’’ భావన ను ముందుకు తీసుకు వచ్చాం మరి ఆ దిశ లో పాటుపడుతున్నాం’’ అన్నారు. ప్రపంచం శీతోష్ణ స్థితి సంబంధి సంకటాల తో తంటాలు పడుతూ ఉంటే, మనం ఉపాయాన్ని ఇచ్చి లైఫ్ స్టయిల్ ఫార్ ఇన్ వైరన్ మంట్ – మిశన్ లైఫ్ కార్యక్రమాన్ని ప్రారంభించాం అని ఆయన చెప్పారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2023 సందర్భంగా ప్రధాన మంత్రి వీడియో సందేశం

June 05th, 03:00 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ, మన దేశానికి, ప్రపంచానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిర్మూలించాలన్నదే ఈ ఏడాది పర్యావరణ దినోత్సవ ఇతివృత్తం. గత 4-5 సంవత్సరాలుగా, ప్రపంచ చొరవ కంటే ముందే భారతదేశం ఈ సమస్యపై స్థిరంగా పనిచేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిర్మూలించడానికి 2018లోనే భారత్ రెండు స్థాయిల్లో చర్యలు ప్రారంభించింది. ఒకవైపు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం విధిస్తూనే మరోవైపు ప్లాస్టిక్ వ్యర్థాల ప్రాసెసింగ్ ను తప్పనిసరి చేశాం. ఫలితంగా భారత్ లో దాదాపు 30 లక్షల టన్నుల ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ను తప్పనిసరిగా రీసైక్లింగ్ చేస్తున్నారు. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం వార్షిక ప్లాస్టిక్ వ్యర్థాలలో ఇది 75 శాతం. నేడు, సుమారు 10,000 మంది ఉత్పత్తిదారులు, దిగుమతిదారులు , బ్రాండ్ యజమానులు ఈ ప్రయత్నంలో చురుకుగా పాల్గొంటున్నారు.

ప్రపంచ పర్యావరణ దినం అంశం పై ఏర్పాటైన సమావేశాన్నిఉద్దేశించి వీడియో సందేశం మాధ్యం ద్వారా ప్రసంగించిన ప్రధాన మంత్రి

June 05th, 02:29 pm

ప్రపంచ పర్యావరణ దినం అంశం పై ఏర్పాటు చేసిన ఒక సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో సందేశం మాధ్యం ద్వారా ప్రసంగించారు.