మీరు కేవలం పతకాల సంఖ్యను పెంచడమే కాదు, ఒక తరాన్నే తీర్చిదిద్దారు: సీడబ్ల్యూజీ ఛాంపియన్లతో ప్రధాని మోదీ
August 10th, 10:00 am
గత 12 ఏళ్లుగా తాను క్రీడాకారులను క్రమం తప్పకుండా కలుస్తున్నానని హైలైట్ చేస్తూ, ప్రధాని మోదీ భారత సీడబ్ల్యూజీ ఛాంపియన్లతో ముచ్చటించారు. ఛాంపియన్లు తమ సన్నాహాలు, కార్గిల్ విజయ్ దివస్ నాడు పాకిస్థాన్‌ను ఓడించడం మరియు ఖేలో ఇండియా పథకం విజయంతో సహా సీడబ్ల్యూజీలో తమ అనుభవాలను పంచుకున్నారు. జో ఖేలేగా, వో ఖిలేగా (ఎవరు ఆడతారో, వారే గెలుస్తారు) అనే పదబంధంతో ప్రధాని మోదీ ఈ సంభాషణను ముగించారు.కామన్వెల్త్ గేమ్స్ విజేతలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషణ
August 10th, 09:30 am
కామన్వెల్త్ గేమ్స్ విజేతలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముచ్చటించారు. గత దశాబ్ద కాలంగా భారత క్రీడా రంగం మారుతున్న తీరును ప్రస్తావిస్తూ… గత 12-13 ఏళ్ల పదవీ కాలంలో జాతీయ క్రీడాకారులను తన నివాసానికి ఆహ్వానించి, సత్కరించటం సాధారణ, అపూర్వమైన సంప్రదాయంగా మారిందని ప్రధానమంత్రి అన్నారు. సాధారణ ప్రచారాల కన్నా అంకితభావం, నిరంతర కృషితో భారత అథ్లెట్లు సాధించిన విజయాలు... పాఠశాల విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. పాఠశాలలకు వెళ్లి మనం చెప్పిన మాటల కన్నా, మీ పతకాలు వారికి ఎక్కువ స్ఫూర్తిని కలిగిస్తాయి అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.కామన్వెల్త్ గేమ్స్ 2026 పతక విజేతలకు ప్రధానమంత్రి ఆతిథ్యం
August 09th, 10:07 pm
ప్రధాని మోదీ కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారతదేశానికి చెందిన అత్యుత్తమ పతక విజేతలను కలుసుకుని వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఛాంపియన్లు తమ గేమ్స్ అనుభవాలను పంచుకున్నారు. క్రీడాకారుల విజయాలను ప్రధాని ప్రశంసిస్తూ, వారు ఎంతో మంది యువతను క్రీడలను చేపట్టడానికి ప్రేరేపిస్తున్నారని పేర్కొన్నారు.‘వికసిత్ వైబ్రంట్ విలేజ్ కార్యక్రమం-2026’లో పాల్గొన్నవారితో జులై 26న ముచ్చటించనున్న పీఎం
July 25th, 11:10 am
‘వికసిత్ భారత్ వైబ్రంట్ కార్యక్రమం-2026’లో పాల్గొన్నవారితో 2026, జులై 26 సాయంత్రం 4:30 గంటలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటిస్తారు.భారత్-న్యూజిలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం: భవిష్యత్ ప్రణాళిక-2030
July 11th, 08:06 am
భారత్-న్యూజిలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై రెండు దేశాల ప్రధానమంత్రులు సంయుక్త ప్రకటన చేశారు. ఈ మేరకు న్యూజిలాండ్ రాజధాని ఆక్లాండ్‌లో ఇవాళ సమావేశమైన అనంతరం వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ భాగస్వామ్యాన్ని మరో నాలుగేళ్లలో మరింత బలోపేతం చేసే లక్ష్యంతో 2030 దాకా ఒక ఉమ్మడి ప్రణాళిక అమలుకు వారిద్దరూ ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగా ఆరు మూలస్తంభాల ప్రాతిపదికన వివిధ రంగాలలో అనేక కార్యక్రమాలను అమలు చేస్తారు.ఆల్‌స్టామ్ సీఈఓ శ్రీ మార్టిన్ సియోన్‌తో ప్రధానమంత్రి సమావేశం... దేశ యువతతో అంతర్జాతీయ సహకార అవకాశాలపై చర్చ
June 18th, 06:42 pm
ఆల్‌స్టామ్ సీఈఓ శ్రీ మార్టిన్ సియోన్‌తో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫలప్రదమైన చర్చలు జరిపారు.ఎల్‌డిఎఫ్, యుడిఎఫ్‌ల అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు కేరళీయుల సంస్కృతికి, విశ్వాసానికి హాని కలిగిస్తున్నాయి: తిరువల్లలో ప్రధాని మోదీ
April 04th, 08:27 pm
తిరువల్లలో జరిగిన భారీ, ఉత్సాహభరితమైన సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తన మద్దతుదారులలో నూతన ఉత్సాహాన్ని నింపడమే కాకుండా, కేరళ చారిత్రాత్మక రాజకీయ మార్పు అంచున ఉందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల అపూర్వమైన హాజరును ప్రస్తావిస్తూ ప్రధాని ఇలా అన్నారు: తిరువల్లలో ప్రజల భారీ హాజరు, NDAపై మీకున్న నమ్మకం, అలాగే తల్లులు మరియు సోదరీమణులు చూపిన ఆప్యాయత మరియు విశ్వాసం కేరళ ప్రజల మనోభావాలకు అద్దం పడుతున్నాయి. రాష్ట్రం ఒక గొప్ప మార్పు దిశగా పయనిస్తోంది.కేరళలో పెద్ద రాజకీయ మార్పుకు సంకేతంగా నిలిచిన ప్రధాని మోదీ తిరువల్ల సభ
April 04th, 03:35 pm
తిరువల్లలో జరిగిన భారీ, ఉత్సాహభరితమైన సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తన మద్దతుదారులలో నూతన ఉత్సాహాన్ని నింపడమే కాకుండా, కేరళ చారిత్రాత్మక రాజకీయ మార్పు అంచున ఉందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల అపూర్వమైన హాజరును ప్రస్తావిస్తూ ప్రధాని ఇలా అన్నారు: తిరువల్లలో ప్రజల భారీ హాజరు, NDAపై మీకున్న నమ్మకం, అలాగే తల్లులు మరియు సోదరీమణులు చూపిన ఆప్యాయత మరియు విశ్వాసం కేరళ ప్రజల మనోభావాలకు అద్దం పడుతున్నాయి. రాష్ట్రం ఒక గొప్ప మార్పు దిశగా పయనిస్తోంది.కొనసాగుతున్న పశ్చిమాసియా సంఘర్షణ దృష్ట్యా తీసుకుంటున్న చర్యలను సమీక్షించేందుకు పీఎం అధ్యక్షతన సీసీఎస్ సమావేశం
April 01st, 10:04 pm
పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణల నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన లోక కల్యాణ్ మార్గ్, 7లో భద్రతపై క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) సమావేశం జరిగింది. దీనిలో వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలు చేపట్టిన చర్యలను సమీక్షించి, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.A bunch of moments from PM Modi’s Assam visit that stood out
April 01st, 05:39 pm
Prime Minister Narendra Modi visited a tea garden in Assam’s Dibrugarh and interacted with the women working there. Walking through the plantation, he briefly joined them in plucking tea leaves and observed their work up close.భారత్‌లో కెనడా ప్రధానమంత్రి పర్యటన
February 26th, 10:40 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానాన్ని అందుకున్న కెనడా ప్రధాని శ్రీ మార్క్ కార్నీ భారత్‌లో పర్యటనకు రానున్నారు. ఆయన 2026 ఫిబ్రవరి 27 నుంచి మార్చి 2 వరకు భారత్‌లో అధికార పర్యటనలో ఉంటారు. ప్రధాని శ్రీ కార్నీ భారత్‌లో అధికారికంగా పర్యటించడం ఇదే మొదటి సారి.నీతి ఆయోగ్‌లో ప్రముఖ ఆర్థికవేత్తలను కలిసిన ప్రధానమంత్రి
December 30th, 06:33 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం నీతి ఆయోగ్ సమావేశంలో భాగంగా ప్రముఖ ఆర్థికవేత్తలు, నిపుణుల బృందంతో సమావేశమయ్యారు. 'ఆత్మనిర్భరత-నిర్మాణాత్మక పరివర్తన: వికసిత్ భారత్ కోసం కార్యాచరణ ప్రణాళిక' అనే ఇతివృత్తంతో ఈ సమావేశం జరిగింది.Our country is full of talent in every village and town: PM Modi
December 25th, 11:10 am
PM Modi interacted with young sportspersons from across the country during the Sansad Khel Mahotsav, listening to their journeys, aspirations and experiences. Encouraging them to balance sports with education, he lauded their discipline, dedication and confidence. The PM reaffirmed the government’s commitment to nurturing grassroots sporting talent and building a strong sporting ecosystem in India.ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిని సందర్శించి, పేలుడు ఘటన బాధితులను కలిసిన ప్రధానమంత్రి
November 12th, 03:21 pm
ఢిల్లీలో ఇటీవల జరిగిన పేలుడు ఘటన బాధితులను పరామర్శించేందుకు ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందర్శించారు. బాధితులు, వారి కుటుంబసభ్యులతో మాట్లాడారు. వారికి అందిస్తున్న చికిత్స వివరాలు తెలుసుకున్నారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.సైరో మలబార్ చర్చి అధిపతితో ప్రధానమంత్రి భేటీ
November 04th, 09:52 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు సైరో మలబార్ చర్చి అధిపతి, ప్రధాన ఆర్చ్ బిషప్ గౌరవ మోస్ట్ రెవరెండ్ మార్ రాఫెల్ ధాటిల్, ఆర్చ్ బిషప్ డాక్టర్ కురియాకోస్ భరణి కులంగర తదితరులతో సమావేశమయ్యారు.Prime Minister interacts with traders and entrepreneurs in Itanagar
September 22nd, 03:43 pm
PM Modi had an interaction with the traders and entrepreneurs in Itanagar, Arunachal Pradesh. Stating that they expressed their appreciation for the GST reforms and the launch of the GST Bachat Utsav, the PM highlighted how these initiatives will benefit key sectors. He emphasised quality standards and encouraged buying Made in India products.సెమికాన్ ఇండియా- 2025 సందర్భంగా ప్రముఖ సీఈవోలతో ప్రధాని సంభాషణ
September 03rd, 08:38 pm
సెమికాన్ ఇండియా- 2025 సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సెమీకండక్టర్ల రంగంలోని ప్రముఖ సీఈవోలతో సంభాషించారు. ‘‘బలమైన మౌలిక సదుపాయాల ఏర్పాటుతోపాటు నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలకు ప్రాధాన్యమివ్వడం సహా ఈ రంగంలో భారత నిరంతర సంస్కరణల ప్రస్థానం గురించి నేను మాట్లాడాను’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.జపాన్ రాష్ట్రాల గవర్నర్లతో సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం
August 30th, 08:00 am
ఈ సమావేశ మందిరంలో నేను సైతామా నగర వేగాన్నీ, మియాగీ నగర స్థిరత్వాన్నీ, ఫుకోకా నగర చైతన్యాన్నీ, నారా పట్టణపు వారసత్వపు గొప్పతనాన్నీ అనుభూతి చెందుతున్నాను. కుమామోటో నగర వెచ్చదనం, నాగానో నగర తాజాదనం, షిజోకా సౌందర్యం, నాగసాకి ప్రాణనాడిని మీరు కలిగి ఉన్నారు. మీరంతా ఫ్యుజీ పర్వత బలాన్ని, సాకురా పూల మొక్క స్ఫూర్తినీ కలిగి ఉన్నారు. కలిసికట్టుగా మీరు జపాన్‌ను ఎల్లప్పుడూ అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారు.జపాన్ లోని రాష్ట్రాల గవర్నర్లతో ప్రధానమంత్రి భేటీ
August 30th, 07:34 am
జపాన్‌లోని స్థానిక ప్రభుత్వాల గవర్నర్లతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు సమావేశమయ్యారు. 16 మంది గవర్నర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.ప్రధానమంత్రిని కలిసిన 2024 బ్యాచ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ట్రైనీలు
August 19th, 08:34 pm
2024 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) ఆఫీసర్ ట్రైనీలు ఈ రోజు ఉదయం 7- లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాసంలో ఆయనను కలిశారు. ఈ బ్యాచ్‌లో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 33 మంది అధికారులు ఉన్నారు.