ఐఎన్ఎస్‌వీ కౌండిన్య నావిక సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

December 31st, 11:30 pm

నౌకాయానం చేస్తున్న ఐఎన్ఎస్‌వీ కౌండిన్య జట్టు ఓ చిత్రాన్ని పంపించినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. సిబ్బంది ఉత్సాహాన్ని ఆయన మెచ్చుకున్నారు. 2026వ సంవత్సరంలోకి దేశ ప్రజలు అడుగుపెడుతున్న సందర్భంలో... కౌండిన్య సిబ్బందికి ప్రధానమంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

పురాతన భారతీయ 'స్టిచ్డ్-షిప్' పద్ధతిలో నిర్మించిన ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య పోర్‌బందర్ నుంచి ఒమన్‌లోని మస్కట్‌కు తొలి ప్రయాణాన్ని ప్రారంభించడంపై ప్రధానమంత్రి ప్రశంస

December 29th, 05:57 pm

ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య నౌకను అద్భుతంగా తీర్చిదిద్ది, ప్రాణం పోసిన రూపకర్తలు, కళాకారులు, నౌకా నిర్మాణ నిపుణులు, భారత నావికాదళం అంకితభావంతో చేసిన కృషిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ నౌక గుజరాత్‌లోని పోర్‌బందర్ నుంచి ఒమన్‌లోని మస్కట్ వరకు తొలి ప్రయాణాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రశంసలు కురిపించారు. పురాతన భారతీయ 'స్టిచ్డ్-షిప్' సాంకేతికతతో నిర్మించిన ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య, భారతదేశపు సుసంపన్నమైన సముద్రయాన సంప్రదాయాలను ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 'గల్ఫ్ ప్రాంతంతో, ఇతర దేశాలతో మనకున్న చారిత్రక సంబంధాలను పునరుద్ధరిస్తూ సాగుతున్న ఈ నౌకా సిబ్బందికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. వారి ప్రయాణం సురక్షితంగా, ఎప్పటికీ గుర్తుండిపోయేలా సాగాలని కోరుకుంటున్నాను' అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.