President’s address on the eve of 80th Independence Day reflects the nation’s strength and inspires renewed determination for a Viksit Bharat: PM

August 14th, 08:44 pm

Prime Minister Shri Narendra Modi today lauded the address delivered by President of India, Smt. Droupadi Murmu, on the eve of 80th Independence Day noting that it was motivating and thoughtful.

మీరు కేవలం పతకాల సంఖ్యను పెంచడమే కాదు, ఒక తరాన్నే తీర్చిదిద్దారు: సీడబ్ల్యూజీ ఛాంపియన్లతో ప్రధాని మోదీ

August 10th, 10:00 am

గత 12 ఏళ్లుగా తాను క్రీడాకారులను క్రమం తప్పకుండా కలుస్తున్నానని హైలైట్ చేస్తూ, ప్రధాని మోదీ భారత సీడబ్ల్యూజీ ఛాంపియన్లతో ముచ్చటించారు. ఛాంపియన్లు తమ సన్నాహాలు, కార్గిల్ విజయ్ దివస్ నాడు పాకిస్థాన్‌ను ఓడించడం మరియు ఖేలో ఇండియా పథకం విజయంతో సహా సీడబ్ల్యూజీలో తమ అనుభవాలను పంచుకున్నారు. జో ఖేలేగా, వో ఖిలేగా (ఎవరు ఆడతారో, వారే గెలుస్తారు) అనే పదబంధంతో ప్రధాని మోదీ ఈ సంభాషణను ముగించారు.

కామన్వెల్త్ గేమ్స్ విజేతలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషణ

August 10th, 09:30 am

కామన్వెల్త్ గేమ్స్ విజేతలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముచ్చటించారు. గత దశాబ్ద కాలంగా భారత క్రీడా రంగం మారుతున్న తీరును ప్రస్తావిస్తూ… గత 12-13 ఏళ్ల పదవీ కాలంలో జాతీయ క్రీడాకారులను తన నివాసానికి ఆహ్వానించి, సత్కరించటం సాధారణ, అపూర్వమైన సంప్రదాయంగా మారిందని ప్రధానమంత్రి అన్నారు. సాధారణ ప్రచారాల కన్నా అంకితభావం, నిరంతర కృషితో భారత అథ్లెట్లు సాధించిన విజయాలు... పాఠశాల విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. పాఠశాలలకు వెళ్లి మనం చెప్పిన మాటల కన్నా, మీ పతకాలు వారికి ఎక్కువ స్ఫూర్తిని కలిగిస్తాయి అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

2026 కామన్వెల్త్ గేమ్స్ పతక విజేతలతో సమావేశమైన ప్రధానమంత్రి

August 09th, 10:07 pm

2026 కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన భారత విజేతలతో 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. అథ్లెట్లతో మాట్లాడి, వారి అనుభవాల గురించి తెలుసుకున్నారు.

హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో పాల్గొనాలని ప్రజలకు ప్రధానమంత్రి పిలుపు

August 09th, 07:20 pm

హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొనాలనీ, వికసిత్ భారత్ నిర్మాణానికి తోడ్పడాలన్న ఉమ్మడి సంకల్పంతో ముందుకు రావాలనీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. భారతదేశ ప్రతిష్ఠకు త్రివర్ణ పతాకం చిహ్నమనీ, దేశం కోసం తమ వంతు కృషి చేయడానికి ప్రతి పౌరునికీ నిరంతరం స్ఫూర్తినిస్తుందనీ శ్రీ మోదీ అన్నారు.

స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ పింగళి వెంకయ్య150 వ జయంతి సందర్భంగా ప్రధాని నివాళి

August 02nd, 08:38 pm

స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

నిస్వార్థ త్యాగ వారసత్వం చిరస్థాయిగా నిలుస్తుందని చెప్పే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

July 06th, 12:41 pm

ఇతరుల సంక్షేమాన్ని కోరి త్యాగం చేసే వారు అమరత్వాన్ని పొందుతారని చెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

బంకిం చంద్ర చటోపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి నివాళులు

June 26th, 12:50 pm

మహనీయుడైన బంకిం చంద్ర ఛటోపాధ్యాయ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఆయన రచనలు తరతరాల భారతీయ ప్రజల్లో దేశభక్తిని, సాంస్కృతిక గర్వాన్ని రగిలించాయని అన్నారు. ఒక మహోన్నత సాహిత్యవేత్తగా ఆయనను ప్రధానమంత్రి స్మరించుకున్నారు.

హజ్రత్ ఇమామ్ హుస్సేన్‌కు ప్రధానమంత్రి నివాళులు

June 26th, 12:30 pm

హజ్రత్ ఇమామ్ హుస్సేన్ (ఏఎస్‌) కాలాతీత త్యాగాన్ని.. సత్యం, న్యాయం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధతను స్మరించుకుంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఇమామ్ హుస్సేన్ జీవితం, ఆయన వీరమరణం... ధైర్యం, దృఢ సంకల్పాల శాశ్వత శక్తికి నిదర్శనంగా నిలుస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

ఉమ్మడి ఉత్సాహంతో చేసే పనులు దేశ ప్రగతికి తోడ్పడతాయని చెప్పే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

June 24th, 03:34 pm

అందరి అంకిత భావంతో, కృషితో దేశ ప్రగతి దృఢతరంగా మారుతుందని స్పష్టం చేస్తున్న సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు. సమాజంలో కొత్త శక్తిని నింపి, అభివృద్ధికి సంబంధించిన సంకల్పాల్ని నెరవేర్చుకోవడానికి బాట వేసేది ఈ భావనేనని ఆయన అన్నారు.

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవం సందర్భంగా నివాళులు అర్పించిన ప్రధానమంత్రి... సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధాని

June 23rd, 03:39 pm

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. దేశ నిర్మాణానికి డాక్టర్ ముఖర్జీ అందించిన అపార సేవలను ప్రధాని స్మరించుకున్నారు.

ఒడిశా ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పీఎం ప్రసంగం

June 20th, 01:10 pm

గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, గవర్నర్ శ్రీ హరిబాబు, ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీ, ఉప ముఖ్యమంత్రి శ్రీ కనక్ వర్ధన్ సింగ్ డియో, శ్రీమతి ప్రవతి పరిదా, ఒడిశా మంత్రి శ్రీ గణేశ్ సింగ్ ఖుంటియా, శ్రీ కృష్ణ చంద్ర మోహపాత్ర, పార్లమెంటు సభ్యుడు శ్రీ నబా చరణ్ మాఝీ, శ్రీ మన్మోహన్ సమాల్, శ్రీ బైజయంత్ పాండా, ఇతర ప్రముఖులు, సోదరీసోదరులారా.

ఒడిషాలో బీజేపీ ప్రభుత్వానికి రెండేళ్లు: మయూర్‌భంజ్ జిల్లా రాయ్‌రంగపూర్‌లో ₹47,600 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం.. శంకుస్థాపన

June 20th, 01:00 pm

రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఒడిషాలోని మయూర్‌భంజ్ జిల్లాలోగల పహాడ్‌పూర్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పవిత్ర ‘సంథాలీ’, ‘హో’ గిరిజన తెగల పవిత్ర వృక్షదేవతారాధ్య (జహేరా) ప్రాంతాలలో ప్రార్థనలు చేశారు. అలాగే, అక్కడి నైపుణ్యాభివృద్ధి కేంద్రం, పహాడ్‌పూర్ పాఠశాలను సందర్శించారు. ఒడిషాలో బీజేపీ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో “వికాస్ రా ధార-ఒడిషా సారా” (ఒడిషా రాష్ట్రమంతటా అభివృద్ధి స్రవంతి) ఇతివృత్తంగా మయూర్‌భంజ్ జిల్లాలోని రాయ్‌రంగపూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వారిద్దరూ పాల్గొన్నారు. ఇందులో భాగంగా శ్రీ మోదీ ₹47,600 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు కొన్నిటికి శంకుస్థాపన చేశారు.

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

June 20th, 08:32 am

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

ప‌శ్చిమబంగ దివ‌స్ సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్ష‌లు... డాక్టర్‌ శ్యామ ప్రసాద్ ముఖర్జీ సేవలను స్మరించుకున్న శ్రీ మోదీ

June 20th, 08:30 am

పశ్చిమబంగ దివస్ (పశ్చిమ బెంగాల్ దినోత్సవం) సందర్భంగా పశ్చిమ బెంగాల్ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

సత్యం, సేవ, జ్ఞానం, కర్మ.. ఈ సుగుణాలను చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

June 18th, 09:23 am

సత్యానికి కట్టుబడి ఉంటే సంపద, నిస్వార్థంగా సేవలను అందిస్తే కీర్తి, నిరంతర అభ్యాసం ద్వారా జ్ఞానం, కర్మలతో వివేకం లభిస్తాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ సుగుణాలు మనిషి స్వభావాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్రను పోషించడంతో పాటు, సమాజ పురోగతిలో కూడా కీలక పాత్రను పోషిస్తాయని ఆయన తెలిపారు.

గౌరవం, ప్రశంసల ప్రాధాన్యాన్ని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

June 17th, 09:05 am

స్నేహపూర్వక గౌరవం, అంగీకార భావన మనుషులను గొప్పతనం కలవారుగా, గౌరవశాలురుగా, సంతృప్తి చెందిన వారుగా తీర్చిదిద్దుతాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. అలాంటి గుర్తింపును తెచ్చుకొంటే వ్యక్తుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందనీ, ఒక కొత్త శక్తీ, ఉత్సాహం నిండుతాయనీ ఆయన తెలిపారు.

వివేకానికీ, ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవడానికీ ఉన్న ప్రాధాన్యాన్ని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

June 16th, 08:53 am

ధైర్యం, వివేకం, దూరదృష్టి కలిగి ఉంటూ చేసే పనులతో సంతోషం, సౌభాగ్యం సిద్ధిస్తాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ప్రతి నిర్ణయాన్నీ ఎంతో ఆలోచించి తీసుకోవాలనీ, ముందువెనుక ఆలోచించి చేసే పనులే విజయాన్ని అందిస్తాయనీ ఆయన తెలిపారు.

ఫ్రాన్స్‌లో జరుగుతున్న భారత్ ఇన్నోవేట్స్-2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం

June 14th, 04:36 pm

ఈ బంధం ఆధారంగానే గడచిన కొన్నేళ్లుగా మేం సంయుక్తంగా కొత్త కార్యక్రమాలను ప్రారంభించాం. కొత్త ఆలోచనలకు మార్గనిర్దేశం చేశాం. అలాగే ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాలను కనుగొనేందుకు సాధ్యమైనంత మేర కృషి చేస్తున్నాం.

ఫ్రాన్స్‌లో ‘భారత్ ఇన్నొవేట్స్-2026’కు శ్రీకారం

June 14th, 03:00 pm

ఫ్రాన్స్‌లోని నైస్‌ నగరంలోగల విశాల ఎగ్జిబిషన్‌ కేంద్రం (పాలైస్ డెస్ ఎక్స్‌పొజిషన్స్‌)లో ఇవాళ “భారత్ ఇన్నొవేట్స్-2026”ను సంయుక్తంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు గౌరవనీయ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సంయుక్తంగా ప్రారంభించారు. ప్రపంచ ఆవిష్కరణ పెట్టుబడి సంస్థలు, అవకాశాల దిశగా భారత డీప్-టెక్ అంకుర సంస్థలు, ఆవిష్కర్తలు, పరిశోధకులు, పెట్టుబడిదారులను ఈ మూడు రోజుల కార్యక్రమం ఒక వేదికపైకి తెస్తుంది. అంతర్జాతీయ ప్రాధాన్యంగల 13 కీలక సాంకేతిక రంగాల్లో 120కి పైగా వినూత్న అంకుర సంస్థలను, 20కి పైగా అగ్రశ్రేణి నైపుణ్య సంస్థలు సహా భారత అగ్రశ్రేణి డీప్ టెక్నాలజీని ప్రపంచానికి ఈ వేదిక చాటిచెబుతుంది. ప్రపంచంలోని 350 మందికి పైగా అగ్రశ్రేణి పెట్టుబడిదారులు, వెంచర్ కేపిటలిస్టులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటారు.