ఐఎన్ఎస్ అగ్రే, ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్ నౌకల త్రివిధ ప్రారంభోత్సవ వేడుకలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

June 21st, 12:51 pm

ఈ రోజు అనేక విధాలుగా ప్రత్యేకమైనది. యావత్ ప్రపంచమూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించుకుంటోంది. ఇలాంటి విశిష్ట సందర్భంలో పవిత్ర బెంగాల్ భూమికి వచ్చే అవకాశం లభించినందుకు నేను సంతోషిస్తున్నాను. భారత దేశ ఆలోచనలకు కొత్త దిశను అందించిన, భారత దేశ పునరుజ్జీవాన్ని వేగవంతం చేసిన, సముద్ర మార్గాల ద్వారా శతాబ్దాలుగా దేశాన్ని ప్రపంచంతో అనుసంధానించిన భూమి ఇది. ఈ రోజు ఇదే మట్టిపై ఆత్మనిర్భర్ భారత్, సురక్షిత భారత్, వికసిత భారత్‌ లక్ష్యాలతో ముడిపడి ఉన్న ఓ ముఖ్యమైన కార్యక్రమం జరుగుతోంది. కొంతసేపటి క్రితమే ఐఎన్ఎస్ అగ్రే, ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్ నౌకలను భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టాం. జూన్ 21ని ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవంగా నిర్వహించుకోవడం యాదృచ్ఛికం. అదే రోజున భారతదేశపు అత్యంత అధునాతన హైడ్రోగ్రఫీ నౌక ఐఎన్ఎస్ సంశోధక్‌ను సముద్ర జలాల్లోకి ప్రవేశపెట్టడం కాకతాళీయం. ఈ సందర్భంగా భారత నౌకాదళానికి, ఈ ప్రాజెక్టులకు పనిచేసిన శాస్త్రవేత్తలకూ, ఇంజనీర్లకూ, కార్మికులకూ, నా ప్రియమైన దేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ఐఎన్ఎస్ దూనగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రే యుద్ధ నౌకలను నావికాదళంలోకి ప్రవేశపెట్టిన ప్రధాని

June 21st, 12:50 pm

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో గల శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ వద్ద జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి, నిర్మించిన మూడు యుద్ధనౌకలను అధికారికంగా నావికాదళంలోకి ప్రవేశపెట్టారు. వీటిలో అత్యాధునిక స్టెల్త్ ఫ్రిగేట్ 'ఐఎన్ఎస్ దూనగిరి', పెద్ద సర్వే నౌక 'ఐఎన్ఎస్ సంశోధక్’, జలాంతర్గామి నిరోధక నౌక 'ఐఎన్ఎస్ అగ్రే'లు ఉన్నాయి. ఈ నౌకల చేరిక భారత కార్యాచరణ సామర్థ్యాలను గణనీయంగా పెంచడమే కాకుండా సముద్రాలపై నిఘాను బలోపేతం చేస్తుంది. అలాగే భౌగోళిక రాజకీయ ముప్పుల నుంచి మన తీరప్రాంత జలాలకు రక్షణను మరింత పటిష్ఠం చేస్తుంది. ఈ మూడు నౌకలను భారత నావికాదళానికి చెందిన 'వార్‌షిప్ డిజైన్ బ్యూరో' రూపొందించగా కోల్‌కతాలోని 'గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్, ఇంజనీర్స్' (జీఆర్ఎస్‌ఈ) సంస్థ నిర్మించింది. వీటి నిర్మాణంలో 200కు పైగా ఎంఎస్ఎంఈలతో కూడిన భారతీయ పరిశ్రమలు విస్తృతంగా భాగస్వామ్యమయ్యాయి. 75 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానం లేదా పరికరాలను కలిగి ఉన్న ఈ నౌకలు 'ఆత్మనిర్భరత' పట్ల భారత్‌కు ఉన్న నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనంగా ఉన్నాయి.

వికసిత భారత్ ప్రయాణంలో వార్తాపత్రికల పాత్ర కీలకం: ముంబైలోని ఐఎన్ఎస్ టవర్స్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ

July 13th, 09:33 pm

ముంబైలోని ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ సెక్రటేరియట్‌లో ఐఎన్‌ఎస్ టవర్స్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రజాస్వామ్యం మరియు సామాజిక మార్పులో మీడియా యొక్క కీలక పాత్రను ఆయన నొక్కిచెప్పారు, పర్యాటకాన్ని ప్రోత్సహించాలని, ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని మరియు డిజిటల్ ఎడిషన్‌లను ప్రభావితం చేయాలని వార్తాపత్రికలను కోరారు. భారతదేశం యొక్క గ్లోబల్ ఇమేజ్ మరియు పురోగతిని పెంపొందించడానికి సమిష్టి కృషికి పిలుపునిస్తూ, జాతీయ ఉద్యమాలు మరియు డిజిటల్ కార్యక్రమాలపై మీడియా ప్రభావాన్ని ప్రధాని మోదీ హైలైట్ చేశారు.

ముంబాయిలో ఇండియన్ న్యూస్‌పేప‌ర్ సొసైటీ ( ఐఎన్ ఎస్ ) ట‌వ‌ర్స్ ను ప్రారంభించిన ప్ర‌ధాని

July 13th, 07:30 pm

ముంబాయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జి బ్లాక్ లోని భార‌తీయ వార్తాప‌త్రిక‌ల సంఘం కార్యాల‌యాన్ని సంద‌ర్శించిన ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ ఐఎన్ ఎస్ ట‌వ‌ర్స్‌ను ప్రారంభించారు. నూత‌న భ‌వ‌నం ముంబాయిలో త‌గినంత స్థ‌లంలో ఆధునిక కార్యాల‌యాన్ని క‌లిగివుంద‌ని ఇది ఐఎన్ ఎస్ స‌భ్యుల అవ‌స‌రాల‌ను తీరుస్తుంద‌ని ప్ర‌ధాని స్ప‌ష్టం చేశారు. ముంబాయిలోని వార్తాప‌త్రిక‌ల ప‌రిశ్ర‌మ‌కు ఇది కీల‌క‌మైన కేంద్రంగా వుంటుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

ఈ నెల 13న ముంబైలో ప్రధానమంత్రి పర్యటన

July 12th, 05:23 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 జూలై 13వ తేదీన ముంబై నగరంలో పర్యటిస్తారు. ఆ రోజున సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో ముంబైలోని గోరెగాఁవ్‌లో నెస్కో ఎగ్జిబిషన్ సెంటర్‌కు ఆయన చేరుకుంటారు. అక్కడ రహదారులు, రైల్వేలు, ఓడరేవుల రంగాలకు సంబంధించి రూ.29,400 కోట్లకుపైగా విలువైన పలు ప్రాజెక్టుల ప్రారంభం, జాతికి అంకితం, శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత రాత్రి 7:00 గంటల ప్రాంతంలో ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోగల జి-బ్లాక్‌లో ఇండియన్ న్యూస్ సర్వీస్ (ఐఎన్ఎస్) సెక్రటేరియట్‌కు వెళ్లి, ‘ఐఎన్ఎస్’ టవర్లను ప్రారంభిస్తారు.