
Cabinet approves construction of 4-Lane Paramakudi - Ramanathapuram Section (NH-87) in Tamilnadu worth Rs.1853 crore
July 01st, 03:13 pm
The Union Cabinet has approved the construction of 4-Lane Paramakudi - Ramanathapuram Section (46.7 km) in Tamilnadu. The project worth Rs.1,853 crore will decongest the existing corridor, improve safety, and cater to the mobility needs of the surrounding towns. It will play a pivotal role in regional economic growth, strengthening connectivity and boosting tourism.
PM chairs 48th PRAGATI meeting
June 25th, 09:11 pm
Prime Minister Shri Narendra Modi chaired the 48th meeting of PRAGATI, the ICT-enabled, multi-modal platform aimed at fostering Pro-Active Governance and Timely Implementation, by seamlessly integrating efforts of the Central and State governments, at South Block, earlier today.
Cabinet approves Pune Metro Rail Project Phase-2
June 25th, 03:08 pm
The Union Cabinet chaired by PM Modi has approved the Pune Metro Rail Project Phase-2 project worth Rs.3626.24 crore. This project will serve key IT hubs, commercial areas, educational institutions, and residential pockets, increasing the share of public transport and ridership across the network. It is poised to unlock Pune’s economic potential.జూన్ 20-21 తేదీల్లో ప్రధానమంత్రి బీహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పర్యటన
June 19th, 05:48 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూన్ 20-21 తేదీల్లో బీహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. జూన్ 20న మధ్యాహ్నం 12 గంటల సమయంలో బీహార్‌లోని శివాన్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం ప్రధానమంత్రి బహిరంగ సభలో ప్రసంగిస్తారు.క్రొయేషియా రిపబ్లిక్ ప్రధానమంత్రితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ
June 18th, 11:40 pm
క్రొయేషియా రిపబ్లిక్ ప్రధానమంత్రి శ్రీ ఆంద్రెజ్ ప్లెంకోవిచ్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జాగ్రెబ్‌లో సమావేశమయ్యారు. భారతదేశ ప్రధానమంత్రి క్రొయేషియాలో అధికారికంగా పర్యటించడం ఇదే ప్రథమం. ఈ కారణంగా, భారత్-క్రొయేషియా సంబంధాల చరిత్రలో ఈ పర్యటనకు గొప్ప చారిత్రక ప్రాముఖ్యం ఏర్పడింది. చరిత్రాత్మక బేన్‌స్కీ డవోరీ మహలుకు ప్రధానమంత్రి శ్రీ మోదీ చేరుకొన్న వేళ.. క్రొయేషియా ప్రధానమంత్రి శ్రీ ప్లెంకోవిచ్ ఆయనకు ఆహ్వానం పలకడంతో పాటుగా సాంప్రదాయక స్వాగత ఏర్పాట్లను కూడా చేశారు. దీని కన్నా ముందు, జాగ్రెబ్ విమానాశ్రయంలో ప్రధానమంత్రి శ్రీ మోదీని ప్రధానమంత్రి శ్రీ ప్లెంకోవిచ్ విశేషమైన, స్నేహపూర్వక రీతిన స్వాగతించారు.జీ7 శిఖరాగ్ర సమావేశంలో ఇంధన భద్రతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
June 18th, 11:15 am
జీ-7 శిఖరాగ్ర సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించి.. అపూర్వ స్వాగతం పలికిన ప్రధానమంత్రి కార్నీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జీ-7 కూటమి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న చారిత్రాత్మక సందర్భంలో మా మిత్రులందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను.Prime Minister Narendra Modi addresses the G7 Outreach Session
June 18th, 11:13 am
PM Modi participated in the Outreach Session of the G7 Summit in Kananaskis and addressed a Session on 'Energy Security.' The PM highlighted that energy security was among the leading challenges facing future generations. While elaborating on India's commitment to inclusive growth, he noted that availability, accessibility, affordability and acceptability were the principles that underpinned India's approach to energy security.భారతీయ రైల్వేల్లో రెండు మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు మంత్రిమండలి ఆమోదం... ఝార్ఖండ్, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్‌లలో ఏడు జిల్లాలకు ఈ ప్రాజెక్టులతో మేలు... సుమారు 318 కి.మీ. మేర పెరగనున్న ప్రస్తుత రైల్వే నెట్‌వర్క్
June 11th, 03:05 pm
రైల్వే మంత్రిత్వ శాఖ రూ.6,405 కోట్ల మొత్తం వ్యయంతో ప్రతిపాదించిన రెండు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన గల ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులు:-భారత్‌లో మౌలిక సదుపాయాల కల్పనలో 11 ఏళ్లుగా గొప్ప మార్పు: ప్రధానమంత్రి
June 11th, 10:17 am
భారత్ వృద్ధి ప్రస్థానంలో ఒక ముఖ్య ఘట్టాన్ని గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు...11 సంవత్సరాలుగా మౌలిక సదుపాయాల కల్పనలో ఓ క్రాంతి చోటుచేసుకుందని ఆయన అన్నారు. దశాబ్ది కాలానికి పైగా గణనీయ మార్పును ఆవిష్కరించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి మన దేశాన్ని ముందుకు తీసుకువెళ్లిందని శ్రీ మోదీ అభివర్ణించారు. మౌలిక సదుపాయాల కల్పనలో... అంటే రైల్వేలు, హైవేలు, ఓడరేవులతో పాటు విమానాశ్రయాల ఏర్పాటులో... భారత్ సాధించిన విశేష ప్రగతిని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. దీంతో సంధానం (కనెక్టివిటీ) పెరిగిందని, ఆర్థిక వ్యవస్థ విస్తరించిందని, జీవన సౌలభ్యం మెరుగవడంతో పాటు పౌరులకు సమృద్ధి కూడా ఇనుమడించిందన్నారు.చినాబ్ రైలు వంతెన నిర్మాణంలో పాలుపంచుకున్న వారితో ప్రధానమంత్రి సంభాషణ
June 06th, 03:01 pm
చినాబ్ రైలు వంతెన నిర్మాణంలో పాలుపంచుకున్న వారిలో కొందరితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు భేటీ అయ్యారు. దేశ ప్రజలకు ఆధునిక మౌలిక సదుపాయాలను నిర్మించడంలో తిరుగులేని నిబద్ధతను కనబరిచారంటూ వారిపై శ్రీ మోదీ ప్రశంసలు కురిపించారు.కరుణతో నిండిన ప్రభుత్వం, పేదల సంక్షేమానికి అంకితం : పీఎం
June 05th, 09:45 am
పీఎం ఆవాస యోజన, పీఎం ఉజ్వల యోజన, జనధన్ యోజన, ఆయుష్మాన్ భారత్ లాంటి మార్పులకు శ్రీకారం చుట్టిన పథకాలు తీసుకొచ్చిన ప్రభావం గురించి ప్రధానమంత్రి వివరించారు. ఈ పథకాలు గృహనిర్మాణం, స్వచ్ఛమైన వంట ఇంధనం, బ్యాంకింగ్, ఆరోగ్య సేవలను అందించినట్లు ప్రధాని తెలియజేశారు. ప్రయోజనాలను పారదర్శకంగా, సమర్థంగా అందించడంలో ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ), డిజిటల్ సమ్మిళితత్వం, గ్రామీణ మౌలిక వసతుల ప్రాధాన్యాన్ని వివరించారు.జమ్మూ కాశ్మీర్‌లో జూన్ 6న ప్రధానమంత్రి పర్యటన
June 04th, 12:37 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం (జూన్ 6న) జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఆ ప్రాంతంలో రైల్వే మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సంధానానికి పెద్ద పీట వేయాలన్న తన నిబద్ధతకు అనుగుణంగా, ప్రధాని చినాబ్ వంతెనను ఉదయం 11 గంటలకు ప్రారంభించడమే కాకుండా వంతెనను చూడబోతున్నారు. ఆ తరువాత, ఆయన అంజీ బ్రిడ్జిని సందర్శించడంతో పాటు ఆ వంతెనను కూడా ప్రారంభిస్తారు. మధ్యాహ్నం సుమారు 12 గంటలకు ఆయన వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తారు. అనంతరం, రూ. 46,000 కోట్లకు పైగా ఖర్చయ్యే అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు కట్‌రాలో ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయడంతో పాటు వాటిని జాతికి అంకితమిస్తారు.న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన వరల్డ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్టు సమ్మిట్ ప్లీనరీ సమావేశంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
June 02nd, 05:34 pm
మంత్రివర్గంలో నా సహచరులు రామ్మోహన్ నాయుడు, మురళీధర్ మొహోల్, ఐఏటీఏ బోర్డు ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ పీటర్ ఎల్బర్స్, ఐఏటీఏ డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్ష్, ఇండిగో డైరెక్టర్ రాహుల్ భాటియా, అతిథులు, ఆహూతులందరికీ!ఐఏటీఏ 81వ వార్షిక సర్వసభ్య సమావేశం.. వరల్డ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సమిట్ ప్లీనరీ సమావేశంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
June 02nd, 05:00 pm
విమానయాన రంగంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, కనెక్టివిటీని మెరుగుపరచడం పట్ల తన నిబద్ధతకు అనుగుణంగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) 81వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీమ్).. వరల్డ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సమిట్ (డబ్ల్యూఏటీఎస్) ప్లీనరీ సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, ఈ సమావేశానికి విచ్చేసిన అతిథులను స్వాగతించారు. నాలుగు దశాబ్దాల అనంతరం మళ్లీ ఈ కార్యక్రమాన్ని భారత్‌లో నిర్వహించడంలోని ప్రాముఖ్యతను ఆయన వివరించారు. ఈ కాలంలో భారత్‌లో చోటుచేసుకున్న సానుకూల మార్పులను ప్రధానంగా ప్రస్తావించిన ప్రధానమంత్రి, నేటి భారత్ ఎప్పుడూ లేనంత విశ్వాసంతో ఉందని పేర్కొన్నారు. ప్రపంచ వైమానిక రంగంలో భారత పాత్రను ప్రస్తావిస్తూ, విస్తారమైన మార్కెట్‌గా మాత్రమే కాకుండా విధానపరమైన నాయకత్వం, ఆవిష్కరణలు, సమగ్ర అభివృద్ధికి చిహ్నంగా భారత్ నిలిచిందన్నారు. నేడు, అంతరిక్ష-విమానయాన రంగాల్లో భారత్ ప్రపంచంలో అగ్రగామిగా ఎదుగుతోంది అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. గత దశాబ్దంలో పౌర విమానయాన రంగం సాధించిన చారిత్రాత్మక పురోగతిని ప్రపంచమంతా చూస్తోందన్నారు.పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్‌దువార్‌లో నగర గ్యాస్ సరఫరా ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
May 29th, 01:30 pm
ఈ చారిత్రాత్మక అలీపుర్‌దువార్ గడ్డ నుంచి బెంగాల్ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను!పశ్చిమ బెంగాల్‌లోని అలీపూర్‌దౌర్‌లో రూ.1010 కోట్లకుపైగా విలువైన ‘సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టు’కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన
May 29th, 01:20 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పశ్చిమ బెంగాల్‌లోని అలీపూర్‌దౌర్‌లో నగర గ్యాస్ సరఫరా (సిజిడి) ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. దేశవ్యాప్తంగా నగర గ్యాస్ సరఫరా (సిజిడి) నెట్‌వర్క్ విస్తరణలో ఇదొక కీలక ముందడుగు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో- చారిత్రక అలీపూర్‌దౌర్ గడ్డమీదినుంచి రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంత సుసంపన్న సాంస్కృతిక ప్రాధాన్యాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- దీని సరిహద్దులే కాకుండా ఇక్కడి ప్రాచీన సంప్రదాయాలు, సంబంధాలు కూడా ఈ అంశాన్ని స్పష్టంగా నిర్వచిస్తాయని చెప్పారు. మన పొరుగు దేశం భూటాన్‌తో అలీపూర్‌దౌర్ సరిహద్దును పంచుకుంటుండగా, దీనికి సరసనేగల అస్సాం ఈ ప్రాంతాన్ని అక్కున చేర్చుకుంటుందన్నారు. మరోవైపు జల్పాయ్‌గురి ప్రకృతి సౌందర్యం, కూచ్బెహార్ ప్రతిష్ఠ ఈ ప్రాంతంలో అంతర్భాగాలని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. బెంగాల్ వారసత్వం, ఐక్యతలోనూ విశిష్ట పాత్రగల ఈ సుసంపన్న అలీపూర్‌దౌర్ నేలను సందర్శించడం తనకు దక్కిన గౌరవమని ఆయన హర్షం ప్రకటించారు.ప్రగతి సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధానమంత్రి
May 28th, 09:10 pm
క్రియాశీలక పాలన, నిర్ణీత సమయానికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన ప్రాజెక్టులను అమలు చేసే లక్ష్యంగా ఏర్పడిన ఐసీటీ ఆధారిత బహుముఖీన వేదిక- ప్రగతి. ఈరోజు జరిగిన ప్రగతి సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.ఆంధ్రప్రదేశ్‌లోని జాతీయ రహదారి ఎన్‌హెచ్-67లోని బద్వేల్-గోపవరం గ్రామం నుంచి ఎన్‌హెచ్-16లోని గురువిందపూడి వరకు 4 లేన్ల బద్వేల్-నెల్లూరు రహదారిని డిజైన్-బిల్డ్-ఫైనాన్స్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ (డీబీఎఫ్ఓటీ) పద్ధతిలో చేపట్టేందుకు ఆమోదం తెలిపిన కేబినెట్
May 28th, 03:53 pm
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ. 3653.10 కోట్ల వ్యయంతో ఎన్‌హెచ్ 67లో 108.134 కి.మీ పొడవున 4 లేన్ల బద్వేల్-నెల్లూరు కారిడార్ నిర్మించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. దీనిని డిజైన్-బిల్డ్-ఫైనాన్స్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ (డీబీఎఫ్ఓటీ) పద్ధతిలో చేపట్టనున్నారు.2025-26 లో సవరించిన వడ్డీ రాయితీ పథకం (ఎంఐఎస్ఎస్) కొనసాగింపునకు కేబినెట్ ఆమోదం: ప్రస్తుత వడ్డీ రాయితీ 1.5% యథాతథం
May 28th, 03:45 pm
2025-26 ఆర్థిక సంవత్సరానికి సవరించిన వడ్డీ రాయితీ పథకం (ఎంఐఎస్ఎస్) కింద వడ్డీ రాయితీ (ఐఎస్) కొనసాగింపునకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన నిధులు సమకూర్చేందుకూ ఆమోదం తెలిపింది.మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్‌లలో భారతీయ రైల్వేల మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు మంత్రిమండలి ఆమోదం
May 28th, 03:43 pm
రైలు మార్గ సామర్థ్యాన్ని పెంచడం కోసం, భారతీయ రైల్వేల్లో రెండు బహుళ ట్రాకుల ప్రాజెక్టుల అమలుకు ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సీసీఈఏ) ఈ రోజు ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సీసీఈఏ సమావేశానికి అధ్యక్షత వహించారు.