గుజరాత్‌లోని సనంద్‌లో ‘సీజీ సెమీ ఓశాట్’ కేంద్రం ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
July 04th, 05:15 pm
ఎలా ఉన్నారు మీరందరూ? అంతా క్షేమమేనా? విశేష ప్రజాదరణ గల గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు శ్రీ అశ్వనీ వైష్ణవ్, ఉత్సాహవంతులైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ హర్ష్ సంఘవి, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ‘సీజీ పవర్’ సంస్థ చైర్మన్ శ్రీ వేలయన్ సుబ్బయ్య, ‘రెనెసాస్ ఎలక్ట్రానిక్స్’ ప్రెసిడెంట్ కుమారి మాలిని, ‘సీజీ సెమీ’ సంస్థ చైర్మన్ శ్రీ గిరీష్ సహా ఈ కార్యక్రమానికి హాజరైన ఇతర పారిశ్రామిక ప్రముఖులు, సోదరీసోదరులారా!గుజరాత్‌లోని సనంద్‌లో సీజీ సెమీ అవుట్‌సోర్స్డ్
July 04th, 05:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్‌లోని సనంద్‌లో సీజీ సెమీ అవుట్‌సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్' (ఓఎస్ఏటీ) కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భం ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, దేశం తన లక్ష్యాల పట్ల కలిగి ఉన్న అచంచలమైన నిబద్ధతకు ఈ ప్రారంభోత్సవం ఒక నిదర్శనమని ప్రధానమంత్రి అభివర్ణించారు. దేశం తాను అనుకున్న బలమైన సంకల్పాలను ఎటువంటి సంకోచం లేకుండా నిరంతరం వాస్తవరూపంలోకి మారుస్తుందని ఆయన స్పష్టం చేశారు. భారతదేశం ఏదైనా చేయాలని సంకల్పిస్తే, దానిని కచ్చితంగా సాధిస్తుందనడానికి నేటి ఈ కార్యక్రమమే నిదర్శనం అని శ్రీ మోదీ అన్నారు.డామన్‌లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన...జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
June 05th, 07:20 pm
మీరంతా ఇక్కడకు ఎలాగైతే వచ్చారో అలాగే లక్షద్వీప్‌లో కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనతో అనుసంధానమయ్యారు. ఈరోజు లక్షద్వీప్‌లో అభివృద్ధికి ఒక కొత్త ఆరంభం జరిగింది. లక్షద్వీప్ ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే ఒక కొత్త ప్రాజెక్టును ఈరోజు ప్రారంభించడంతో పాటు కొన్ని పథకాలకు శంకుస్థాపనలు కూడా చేశాం.డామన్‌లో సుమారు రూ. 2,970 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులు... ప్రారంభం, శంకుస్థాపన, జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
June 05th, 07:15 pm
డామన్‌లో సుమారు రూ.2,970 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడం, శంకుస్థాపన, జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తన గత పర్యటనను గుర్తుచేసుకుంటూ, తాను గతంలో చేసిన పరిశీలన ఇప్పుడు వాస్తవరూపం దాల్చిందన్నారు. ఈ ప్రాంతం ఇప్పుడు వైవిధ్యభరితమైన, చైతన్యవంతమైన మన దేశ ప్రతిష్ఠకు ప్రతీకగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ నివసించే వివిధ ప్రాంతాల ప్రజలతో యావత్ దేశపు అందమైన దృశ్యాన్ని అందిస్తూ, మినీ ఇండియాకు సజీవ ఉదాహరణగా డామన్ నిలుస్తోంది అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.మయన్మార్ అధ్యక్షుడి భారతదేశ అధికారిక పర్యటన సందర్భంగా భారత్-మయన్మార్ సంయుక్త ప్రకటన
June 01st, 07:16 pm
భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు మయన్మార్ అధ్యక్షుడు యు మిన్ ఆంగ్ హలైన్. 2026 మే 30 నుంచి జూన్ 3 వరకు భారతదేశంలో తన మొదటి అధికారిక పర్యటనను చేపట్టారు.టీఎంసీ అండతో తలదాచుకున్న నేరస్తులకు శిక్ష తప్పదు: పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్‌లో ప్రధాని మోదీ
April 24th, 11:45 am
పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తూ, ప్రధాని మోదీ మొదటి దశ పోలింగ్‌లో ప్రజల భారీ భాగస్వామ్యాన్ని ప్రస్తావించారు. మొదటి దశలో టీఎంసీ (TMC) కనీసం ఖాతా కూడా తెరిచే అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు; అలాగే, అభివృద్ధి చెందిన బెంగాల్ కోసం బీజేపీకి నిర్ణయాత్మక తీర్పునివ్వాలని రెండో దశ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన జాదవ్‌పూర్ యూనివర్సిటీ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు, ప్రజలను ప్రభావితం చేస్తున్న స్థానిక సమస్యల గురించి కూడా ప్రస్తావించారు.టీఎంసీ పాలనలో బెంగాల్ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు నాశనమయ్యాయి: డమ్ డమ్‌లో ప్రధాని మోదీ
April 24th, 11:35 am
పశ్చిమ బెంగాల్‌లోని డమ్ డమ్‌లో ఈరోజు జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఆయన చేసిన ఉత్సాహభరితమైన ప్రసంగం బెంగాల్ ప్రజల మదిలో బలంగా నాటుకుపోయింది. స్పష్టంగా కనిపిస్తున్న మార్పు పవనానికి ఆయన పౌరులను అభినందించారు. మొదటి దశ పోలింగ్ ఇప్పటికే రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో నిర్ణయాత్మక మార్పుకు సంకేతాలు ఇచ్చిందని ఆయన నొక్కి చెప్పారు.డమ్ డమ్ మరియు జాదవ్‌పూర్‌లలో ప్రధాని మోదీ ఉద్వేగభరిత ప్రసంగాలు
April 24th, 11:30 am
పశ్చిమ బెంగాల్‌లోని దు డమ్ డమ్ మరియు జాదవ్‌పూర్‌లలో జరిగిన భారీ బహిరంగ సభలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రసంగించారు; ఆయన చేసిన ఉత్సాహభరితమైన ప్రసంగాలు అక్కడి ప్రజలలో బలమైన స్పందనను కలిగించాయి. రాష్ట్రంలో కనిపిస్తున్న మార్పు గాలిని చూసి ప్రజలను అభినందించిన ఆయన, మొదటి దశ పోలింగ్ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో ఒక నిర్ణయాత్మక మార్పుకు సంకేతంగా నిలిచిందని నొక్కి చెప్పారు.న్యూఢిల్లీలోని కరియప్ప మైదానంలో ఎన్‌సీసీ ర్యాలీలో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
January 28th, 04:00 pm
కేంద్ర క్యాబినెట్లో నా సహ మంత్రి, రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్‌జీ, వేదికపై ఉన్న అతిథులు, దేశం నలుమూలల నుంచి వచ్చిన ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు, శకటాల కళాకారులు, రాష్ట్రీయ రంగశాల ఉద్యోగులు, నా యువ మిత్రులు.. మీ అందరి కృషి ఇక్కడ కనిపిస్తోంది. మంచి సమన్వయంతో మీరు చక్కటి ప్రదర్శన ఇచ్చారు.ఢిల్లీలో జరిగిన వార్షిక ఎన్‌సీసీ పీఎం ర్యాలీలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
January 28th, 03:30 pm
ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో ఈ రోజు నిర్వహించిన వార్షిక ‘ఎన్‌సీసీ పీఎం ర్యాలీ’ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఎన్‌సీసీ దినోత్సవం సందర్భంగా సభికులనుద్దేశించి ప్రసంగిస్తూ, ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్ కేడెట్లు, నాటక కళాకారులు, జాతీయ రంగశాల కళాకారులు, దేశంలోని వివిధ ప్రాంతాల యువ ప్రతినిధుల కృషి.. సమన్వయంతో కూడిన ఈ ప్రదర్శనలో స్పష్టంగా కనిపిస్తోందని ప్రశంసించారు. నేటి ఉదయం మహారాష్ట్రలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ అజిత్ పవార్ గారితోపాటు కొందరు సహచరులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రధానమంత్రి శ్రీ మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన దేశానికి ఎంతో శోకాన్ని మిగిల్చిందని ఆవేదన చెందారు. మహారాష్ట్రతోపాటు దేశాభివృద్ధిలో అజిత్ దాదా విశేష కృషి చేశారని ప్రధానమంత్రి కొనియాడారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి నిరంతరం శ్రమించారని గుర్తుచేశారు. అజిత్ పవార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబాలకు దేశమంతా అండగా ఉంటుందని ప్రధానమంత్రి భరోసా ఇచ్చారు. ఈ విషాద సమయంలోనూ, అక్కడకు వచ్చిన ఎన్‌సీసీ క్యాడెట్లకు, ముఖ్యంగా మిత్ర దేశాల నుంచి వచ్చిన వారికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది బాలికల భాగస్వామ్యం పెరగడంపై హర్షం వ్యక్తం చేశారు.న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఇండియా-ఈయూ బిజినెస్ ఫోరమ్‌లో ప్రధానమంతి ప్రసంగానికి తెలుగు అనువాదం
January 27th, 04:32 pm
ఇండియన్-యూరోపియన్ యూనియన్ బిజినెస్ ఫోరమ్‌లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. భారత్‌లో యూరోపియన్ యూనియన్ మండలి, కమిషన్ అధ్యక్షుల పర్యటన సాధారణ దౌత్య పర్యటన కాదు. ఇది భారత్-యూరోపియన్ యూనియన్ సంబంధాల్లో కొత్త శకానికి నాంది పలికింది. భారత గణతంత్ర దినోత్సవాల్లో యూరోపియన్ యూనియన్ నాయకులు ముఖ్య అతిధులుగా పాల్గొనడం ఇదే తొలిసారి. భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య కుదరిన ఒప్పందం దేశ చరిత్రలోనే అతి పెద్ద ఎఫ్‌టీఏ. ఈ రోజు ఇండియా-యూరోపియన్ యూనియన్ బిజినెస్ ఫోరమ్‌లో పెద్ద సంఖ్యలో సీఈవోలు పాల్గొన్నారు. ఈ విజయాలన్నీ ప్రపంచంలోనే రెండు అతి పెద్ద ప్రజాస్వామ్య శక్తుల మధ్య ఏర్పడిన అపూర్వమైన సమన్వయానికి చిహ్నాలుగా నిలుస్తున్నాయి.న్యూఢిల్లీలో జరిగిన ఇండియా-ఈయూ బిజినెస్ ఫోరంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
January 27th, 04:30 pm
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన భారత్-యూరోపియన్ యూనియన్ బిజినెస్ ఫోరంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఇండియా-యూరోపియన్ యూనియన్ (ఈయూ) బిజినెస్ ఫోరంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. భారత్‌లో యూరోపియన్ యూనియన్ కౌన్సిల్, కమిషన్ల అధ్యక్షుల పర్యటన సాధారణ దౌత్య సందర్శన కాదని, అది భారత్-ఈయూ సంబంధాల్లో నూతన శక ప్రారంభాన్ని సూచిస్తుందన్నారు. భారత గణతంత్ర దినోత్సవాల్లో ఈయూ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొనడం ఇదే తొలిసారని శ్రీ మోదీ వెల్లడించారు. దేశ చరిత్రలో అతి పెద్ద స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాన్ని భారత్, యూరోపియన్ యూనియన్ కుదుర్చుకున్నాయని తెలియజేశారు. అనేక మంది సీఈవోలతో పెద్ద స్థాయిలో భారత్-యూరోపియన్ యూనియన్ వ్యాపార వేదికను నిర్వహించామన్నారు. ఈ విజయాలన్నీ ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య శక్తుల మధ్య ఏర్పడిన అపూర్వమైన సమన్వయాన్ని సూచిస్తున్నాయని వివరించారు.ఒప్పందాల జాబితా: భారత్‌లో ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ ఛాన్సలర్ పర్యటన (2026, జనవరి 12-13)
January 12th, 03:47 pm
ద్వైపాక్షిక రక్షణ పారిశ్రామిక సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఉమ్మడి ప్రకటనఅహ్మదాబాద్లో ‘భారత్-జర్మనీ సీఈఓ ఫోరమ్’ సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
January 12th, 01:35 pm
భారత్-జర్మనీ ‘సీఈఓ’ల ఫోరం సమావేశంలో పాలుపంచుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. మన దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు నిండగా, ఉభయ పక్షాల వ్యూహాత్మక భాగస్వామ్యానికి 25 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో అటు వజ్రోత్సవం (ప్లాటినం జూబ్లీ), ఇటు రజతోత్సవం (సిల్వర్ జూబ్లీ) కూడా నిర్వహించుకుంటున్నాం. ఈ జంట విశేషాల కీలక సందర్భంలో ఏర్పాటైన ఈ సమావేశం ప్లాటినం మెరుపులకు వెండి అంచు తొడిగినట్టుగా ఉంది.ప్రధానమంత్రి అధ్యక్షతన భారతీయ ఏఐ అంకుర సంస్థల రౌండ్ టేబుల్ సమావేశం
January 08th, 02:48 pm
లోక కల్యాణ్ మార్గ్, 7 లోని తన నివాసంలో ఈ రోజు జరిగిన ఏఐ అంకుర సంస్థల రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.హాషెమైట్ కింగ్డమ్ ఆఫ్ జోర్డాన్‌కు భారత్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటనలో సంయుక్త పత్రికా ప్రకటన
December 16th, 03:56 pm
హేషమైట్ కింగ్డమ్ ఆఫ్ జోర్డాన్ రాజు అబ్దుల్లా II ఇబ్న్ అల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 డిసెంబర్ 15, 16 తేదీల్లో ఆ దేశంలో పర్యటించారు.List of Outcomes Visit of Prime Minister to Jordan
December 15th, 11:52 pm
During the meeting between PM Modi and HM King Abdullah II of Jordan, several MoUs were signed. These include agreements on New and Renewable Energy, Water Resources Management & Development, Cultural Exchange and Digital Technology.మంగోలియా అధ్యక్షునితో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పత్రికా ప్రకటన పాఠం
October 14th, 01:15 pm
ఆరేళ్ల అనంతరం మంగోలియా అధ్యక్షుడు భారత్ లో పర్యటించడం చాలా ప్రత్యేకమైన సందర్భం. భారత్, మంగోలియాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 సంవత్సరాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం నెలకొని 10 సంవత్సరాలైన వేళ ఈ పర్యటన చోటుచేసుకొంది. ఈ సందర్భంగా ఈ రోజున మేం ఒక సంయుక్త తపాలా బిళ్లను విడుదల చేశాం.. ఇది మన ఉమ్మడి వారసత్వం, వైవిధ్యం, నాగరికత పరమైన సంబంధాలకు ప్రతీకగా నిలిచింది.సెప్టెంబర్ 25న ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లో పర్యటించనున్న ప్రధానమంత్రి
September 24th, 06:25 pm
అనంతరం ప్రధానమంత్రి రాజస్థాన్‌ను సందర్శించి రూ.1,22,100 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, కొన్నింటిని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1:45 గంటలకు బన్స్ వారాలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అదే సమయంలో పీఎం కుసుం పథకం లబ్ధిదారులతో ముచ్చటిస్తారు.79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు
August 15th, 03:52 pm
79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగం 103 నిమిషాల పాటు కొనసాగింది. ఆయన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాల్లో ఇదే సుదీర్ఘమైనది. ఇందులో భాగంగా పలు నిర్ణయాత్మక ప్రకటనలు చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్‌ను సాధించటంపై ఒక సాహసోపేతమైన రోడ్ మ్యాప్‌ను ఇచ్చారు. ప్రధానమంత్రి ప్రసంగం స్వావలంబన, ఆవిష్కరణ, ప్రజల సాధికారతపై దృష్టి సారించింది. ఇతరులపై ఆధారపడే స్థాయి నుంచి ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయమైన, సాంకేతికతపరంగా అభివృద్ధి చెందిన, ఆర్థికంగా ధృడమైన దేశంగా మారిన భారత్ ప్రయాణాన్ని ప్రధానంగా పేర్కొన్నారు.