Cabinet approves a road upgradation project in Bihar at a total capital cost of Rs.3590.73 crore
August 19th, 03:22 pm
The Cabinet Committee on Economic Affairs, chaired by PM Modi, has approved the upgradation of the Muzaffarpur-Sitamarhi-Sonbarsa section of NH-22 to four-lane standard in Bihar. At a total capital cost of Rs 3,590.73 crore, the project will enable faster and safer movement of passengers and freight, improve travel efficiency and strengthen regional connectivity, including to important cultural and religious destinations.80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాంగణం నుండి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు
August 15th, 04:44 pm
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఈరోజు ఎర్రకోట ప్రాంగణం నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. తన ప్రసంగంలో, గత 12 సంవత్సరాలుగా తయారీ రంగం, డిజిటల్ వృద్ధి మరియు పౌర సేవల రంగాలలో భారతదేశం సాధించిన ప్రగతికి సంబంధించిన వివరణాత్మక నివేదికను ఆయన సమర్పించారు. జాతీయ ఆశయాలను సాధించడం కోసం ఏడు కీలక రంగాలతో కూడిన పరివర్తనాత్మక సప్తధారను కూడా ఆయన ఆవిష్కరించారు.12 ఏళ్ల పరివర్తన: స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో భారత ప్రగతిని ప్రముఖంగా ప్రస్తావించిన ప్రధానమంత్రి
August 15th, 01:18 pm
స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గత 12 ఏళ్లలో భారత్ సాధించిన పరివర్తనను ప్రముఖంగా ప్రస్తావించారు. తయారీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ప్రాథమిక సదుపాయాలు, ఇంధన భద్రత, యువత సాధికారత, ఆవిష్కరణలు, సామాజిక భద్రత, ఇతర కీలక రంగాల్లో దేశం సాధించిన పురోగతిని వివరించారు.80వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం: వికసిత్ భారత్ దిశగా తదుపరి దశ కోసం ప్రధాని పిలుపు
August 15th, 12:51 pm
2047 నాటికి వికసిత్ భాతర్ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా ప్రయాణాన్ని వేగవంతం చేయడమే లక్ష్యంగా ఎర్రకోట బురుజుల నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. దేశ పనితీరు, ఆలోచన విధానం, ఆశయాల పరిధిలో మార్పు రావాలని కోరుతూ.. ప్రజలు, ప్రభుత్వాలు, పరిశ్రమలు, రైతులు, యువత, సమాజంలోని ఇతర వర్గాలు కలసి కట్టుగా కృషి చేయాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి వివరించారు.జీవితంలో మీ ఉత్సుకతను సజీవంగా ఉంచుకోండి: ఐఐటి ఢిల్లీ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ
August 08th, 11:15 am
ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, పట్టభద్రులైన విద్యార్థులను అభినందించారు. వేగంగా మారుతున్న ప్రపంచాన్ని ఉత్సుకత, ధైర్యం మరియు నూతన ఆవిష్కరణ స్ఫూర్తితో స్వీకరించాలని వారిని కోరారు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని, పరిశోధనలు కొనసాగించాలని, వికసిత భారత్ దిశగా భారతదేశ ప్రయాణానికి దోహదపడాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు.ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం
August 08th, 11:00 am
ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, పట్టభద్రులైన విద్యార్థులను అభినందించారు. వేగంగా మారుతున్న ప్రపంచాన్ని జిజ్ఞాస, ధైర్యం, నూతన ఆవిష్కరణల స్ఫూర్తితో స్వీకరించాలని వారిని కోరారు. యువత నూతన అవకాశాలను అందిపుచ్చుకోవాలని, పరిశోధనలు కొనసాగించాలని, వికసిత భారత్ దిశగా భారతదేశ ప్రయాణానికి దోహదపడాలని ఆయన పిలుపునిచ్చారు.Prime Minister Narendra Modi Chairs Second High-Level Meeting with Secretaries of Government of India
July 28th, 08:48 pm
PM Modi chaired the second high-level meeting with Secretaries to the Government of India. The sectors discussed included Finance and Economy, Commerce and Industry and Technology. He stressed the need to reform processes, improve work culture and strengthen institutional efficiency, while also calling for greater participation of young innovators and entrepreneurs in the cybersecurity ecosystem.Cabinet approves scheme of Chemical Parks “Bharat Audyogik Vikas Yojana Rasayan (BHAVYA Rasayan)
July 24th, 04:12 pm
The Union Cabinet, chaired by PM Modi, has approved the BHAVYA - Rasayan Scheme for establishing three dedicated Chemical Parks at a cost of ₹3,030 crore. The scheme, which will run for five years from FY 2026-27 to FY 2030-31, will lead to a cascading effect through enhanced development of downstream sectors of the economy, thereby generating higher employment and promoting greater economic growth, helping achieve the goal of Viksit Bharat @ 2047.Eminent industry leader Shri Ravi Kant meets the Prime Minister
July 18th, 10:25 pm
Eminent industry leader Shri Ravi Kant met Prime Minister, Shri Narendra Modi earlier today and presented a copy of his book 'Leading from the Back - To Achieve the Impossible'.జూలై 17న హర్యానా, చండీగఢ్, పంజాబ్‌లో పీఎం పర్యటన
July 15th, 06:40 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూలై 17న హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఉదయం సుమారు 11 గంటలకు జింద్ రైల్వేస్టేషన్‌లో జింద్-సోనిపట్ మధ్య నడిచే భారతదేశపు తొలి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఉదయం 11:30 గంటలకు జింద్‌లోని ఏకలవ్య స్టేడియంలో దాదాపు రూ.14,700 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తారు.అధికారిక విందు కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
July 11th, 12:32 pm
గతేడాది భారత్‌లో ప్రధాని లక్సన్ చేపట్టిన పర్యటన.. మన ద్వైపాక్షిక సంబంధాల్లోని అన్ని అంశాల్లోనూ కొత్త శక్తిని నింపింది. ఆయన నాయకత్వమూ, స్పష్టమైన దార్శనికతా, దృఢమైన అంకితభావమూ.. భారత్, న్యూజిలాండ్ మధ్య ఉన్న స్నేహానికి కొత్త వేగాన్నీ, నూతన దిశనూ అందించాయి. గత నలభై ఏళ్లలో భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. నాకంటే ముందు వచ్చిన వారు నా కోసం ఎన్నో మంచి పనులను వదిలి వెళ్లారు. వాటిని పూర్తి చేసే భాగ్యం నాకు దక్కిందని నేను తరచూ చెబుతూ ఉంటాను. మిత్రులారా, ఇది మన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతోంది.''భారత్-న్యూజిలాండ్: ఒక విజయవంతమైన భాగస్వామ్యం'' ఇతివృత్తంతో న్యూజిలాండ్ ప్రధాని నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన ప్రధానమంత్రి
July 11th, 12:30 pm
భారత్-న్యూజిలాండ్: ఒక విజయవంతమైన భాగస్వామ్యం ఇతివృత్తంతో న్యూజిలాండ్ ప్రధానమంత్రి గౌరవ క్రిస్టోఫర్ నిర్వహించిన ప్రత్యేక విందు కార్యక్రమానికి ప్రధానమంత్రి శ్రీ మోదీ హాజరయ్యారు. రాజకీయ, వ్యాపార, పారిశ్రామిక, విద్యా, సాంకేతిక, క్రీడా, కళా రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఇండోనేషియా అధ్యక్షుడితో కలిసి సంయుక్త ప్రకటన నేపథ్యంలో ప్రధానమంత్రి ప్రకటన
July 07th, 11:21 am
మన మధ్య 2018లో ఏర్పడిన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం నేడు నూతన శిఖరాలకు చేరుకుంటోంది. అభివృద్ధి, భద్రత, సాంకేతికత, సంస్కృతి, విద్యతో సహా ప్రతి సహకార రంగంలోనూ గణనీయమైన పురోగతిని సాధిస్తున్నాం.డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా పీఎం ప్రసంగానికి తెలుగు అనువాదం
July 06th, 06:47 pm
కేంద్ర క్యాబినెట్లో సహ మంత్రులు అమిత్ భాయ్ షా, గజేంద్ర సింగ్ షెకావత్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి, బీజేపీ సీనియర్ సభ్యులు, నాలాంటి లక్షలాది మంది కార్యకర్తలకు స్ఫూర్తిగా నిలిచే శ్రీ మఖన్‌లాల్ జీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శమిక్ భట్టాచార్య, గౌరవ ప్రజా ప్రతినిధులు, విశిష్ట అతిథులు, సోదరీ సోదరులారా!డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
July 06th, 06:17 pm
డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిని పురస్కరించుకుని ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో సందేశం ద్వారా సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ముందుగా నిర్ణయించిన ప్రయాణాల కారణంగా స్వయంగా హాజరుకాలేకపోతున్నట్లు చెప్పిన ఆయన.. ఇలాంటి ఒక చరిత్రాత్మక సందర్భంలో భౌగోళిక అడ్డంకులను అధిగమించటంలో డిజిటల్ అనుసంధానత అద్భుతమైన పాత్ర పోషిస్తోందని అన్నారు. సాంకేతికత సహాయంతో నేను ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో మీతో భాగస్వామిని అవుతున్నాను అని ఆయన పేర్కొన్నారు.గుజరాత్‌లోని సనంద్‌లో ‘సీజీ సెమీ ఓశాట్’ కేంద్రం ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
July 04th, 05:15 pm
ఎలా ఉన్నారు మీరందరూ? అంతా క్షేమమేనా? విశేష ప్రజాదరణ గల గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు శ్రీ అశ్వనీ వైష్ణవ్, ఉత్సాహవంతులైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ హర్ష్ సంఘవి, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ‘సీజీ పవర్’ సంస్థ చైర్మన్ శ్రీ వేలయన్ సుబ్బయ్య, ‘రెనెసాస్ ఎలక్ట్రానిక్స్’ ప్రెసిడెంట్ కుమారి మాలిని, ‘సీజీ సెమీ’ సంస్థ చైర్మన్ శ్రీ గిరీష్ సహా ఈ కార్యక్రమానికి హాజరైన ఇతర పారిశ్రామిక ప్రముఖులు, సోదరీసోదరులారా!గుజరాత్‌లోని సనంద్‌లో సీజీ సెమీ అవుట్‌సోర్స్డ్
July 04th, 05:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్‌లోని సనంద్‌లో సీజీ సెమీ అవుట్‌సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్' (ఓఎస్ఏటీ) కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భం ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, దేశం తన లక్ష్యాల పట్ల కలిగి ఉన్న అచంచలమైన నిబద్ధతకు ఈ ప్రారంభోత్సవం ఒక నిదర్శనమని ప్రధానమంత్రి అభివర్ణించారు. దేశం తాను అనుకున్న బలమైన సంకల్పాలను ఎటువంటి సంకోచం లేకుండా నిరంతరం వాస్తవరూపంలోకి మారుస్తుందని ఆయన స్పష్టం చేశారు. భారతదేశం ఏదైనా చేయాలని సంకల్పిస్తే, దానిని కచ్చితంగా సాధిస్తుందనడానికి నేటి ఈ కార్యక్రమమే నిదర్శనం అని శ్రీ మోదీ అన్నారు.కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో సహకారంపై భారత్ - జపాన్ సంయుక్త ప్రకటన
July 02nd, 10:14 pm
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు, సమాజాలు, శాస్త్ర సాంకేతిక రంగాలు, పరిశ్రమలూ - వ్యాపారాలూ, పాలన, భద్రతా రంగాల్లో విప్లవాత్మక మార్పులను తెస్తూ.. సర్వోపయోగకర సాంకేతికతగా నేటి కాలాన్ని కృత్రిమ మేధ (ఏఐ) శాసిస్తోందని భారత్, జపాన్ ప్రధానమంత్రులు వ్యాఖ్యానించారు. ఏఐ రూపకల్పన, అభివృద్ధి, విస్తరణ, పాలన అంశాల్లో నేడు మనం తీసుకునే నిర్ణయాలు.. భవిష్యత్తులో ఆవిష్కరణలు, సామాజిక సంక్షేమం, ఆర్థిక భద్రత, ప్రపంచ క్రమంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయని వారు అంగీకరించారు. ఈ అవగాహనే ప్రాతిపదికగా.. ఇరుదేశాల్లో ఆవిష్కరణలనూ, వృద్ధినీ పెంపొందించుకోవడంతోపాటు ఏఐ రంగంలో సామర్థ్యాన్నీ, పోటీతత్వాన్నీ పరస్పరం మెరుగుపరచుకునే దిశగా సహకారాన్ని ముందుకు తీసుకెళ్లాలని వారు ఏకాభిప్రాయానికి వచ్చారు. తద్వారా సురక్షితమైన, భద్రమైన, విశ్వసనీయ, సమ్మిళిత, మానవుడే కేంద్రంగా ఉండే, సుస్థిరమైన, జవాబుదారీతనంతో కూడిన ఏఐ వ్యవస్థను నిర్మించాలని వారు సంకల్పించారు.సుస్థిర ఇంధన సామర్థ్యంపై భారత్-జపాన్ సంయుక్త ప్రకటన
July 02nd, 10:04 pm
జపాన్ ప్రధానమంత్రి గౌరవ సనాయే తకాయిచితో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితి దృష్ట్యా... ఆసియాలో బాధ్యతాయుత శక్తులుగా, ప్రధాన ఇంధన వినియోగ దేశాలుగా కలిసి పనిచేయడం ద్వారా సుస్థిర ఇంధన సామర్థ్యాన్ని సంయుక్తంగా బలోపేతం చేసుకోవాలనే తమ ఉమ్మడి ఉద్దేశాన్ని వారు స్పష్టం చేశారు.న్యూఢిల్లీలో 'ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన' ప్రోత్సాహకాల పంపిణీ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
June 19th, 05:15 pm
నా మంత్రివర్గ సహచరులు శ్రీ మన్‌సుఖ్ మాండవీయ గారు, సోదరి శోభ గారు, దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు, సాంకేతికతతో అనుసంధానమైన ప్రముఖులందరికీ, నిర్వాహకులకు, ప్రస్తుతం 200 ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమంతో అనుసంధానమైన సుమారు రెండు లక్షల మందికి... నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పారిశ్రామిక రంగానికి చెందిన అనేకమంది ప్రముఖులు ఈ రోజు ఇక్కడ ఉండటం నాకు కనిపిస్తోంది. ఇంత పెద్ద సంఖ్యలో హాజరైన యువ మిత్రుల ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది.