'మన్ కీ బాత్'లో భారతదేశ రక్షణ సామర్థ్యం, ఆవిష్కరణలు మరియు సమిష్టి కృషిని ప్రస్తావించిన ప్రధాని మోదీ
July 26th, 11:30 am
Prime Minister Narendra Modi addressed the nation through Mann Ki Baat. In his speech, he highlighted important topics such as Kargil Vijay Diwas, Catch the Rain campaign, India's space sector prowess, Science Olympiads, Environmental conservation, Khadi and more. He called upon the citizens to share their ideas and suggestions for Independence Day through MyGov.హర్యానాలోని జింద్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
July 17th, 12:00 pm
హర్యానా గవర్నర్ శ్రీ అసిమ్ ఘోష్ గారు... అత్యంత ప్రజాదరణ కలిగిన, ఉత్సాహవంతులైన ముఖ్యమంత్రి శ్రీ నాయబ్ సింగ్ సైనీ గారు... కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారు... హాజరైన ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజలకు, సాంకేతిక మాధ్యామాల ద్వారా అనేక ప్రదేశాల నుంచి ఈ కార్యక్రమంతో అనుసంధానమైన హర్యానాలోని నా ప్రియమైన సోదరీ సోదరులందరికీ నమస్కారం!హర్యానాలోని జింద్‌లో సుమారు రూ.14,700 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, జాతికి అంకితమిచ్చిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
July 17th, 11:30 am
హర్యానాలోని జింద్‌లో సుమారు రూ.14,700 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదదీ ఈ రోజు శంకుస్థాపన చేశారు, జాతికి అంకితం చేశారు. ఈ ప్రాంతానికి రావడం పట్ల ప్రధానమంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. శక్తి పీఠం మాతా జయంతి ఆశీస్సులు పొందిన ఈ ప్రాంతానికి ఉన్న గొప్ప చారిత్రక, సైనిక, ఆధ్యాత్మిక వారసత్వం గురించి వివరించారు. దశాబ్దాల క్రితం సంస్థాగత కార్యక్రమాల నిమిత్తం ఈ ప్రాంతానికి వచ్చిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఆయనకు లభించిన ఆప్యాయతను, ముర్రా గేదె పాలు, దేశీ బురా, ఘేవార్ లాంటి స్థానిక వంటకాలను గుర్తు చేసుకున్నారు. ‘‘ఇది సాధారణ ప్రదేశం కాదు. ఇది చరిత్ర, ధైర్యం, మతం, అపారమైన గర్వానికి ప్రతీకగా నిలిచే భూమి’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.ఆస్ట్రేలియా గవర్నర్ జనరల్‌తో ప్రధానమంత్రి భేటీ
July 09th, 01:55 pm
మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా గవర్నర్ జనరల్ శ్రీమతి సామ్ మోస్టిన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు సమావేశమయ్యారు.యునెస్కో వారసత్వ గుర్తింపు పొందిన ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని సందర్శించిన ప్రధానమంత్రి
July 08th, 01:46 pm
యునెస్కో వారసత్వ గుర్తింపు పొందిన ప్రసిద్ధ ప్రదేశం, యోగ్యకర్తలోని ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందర్శించారు. గౌరవ సూచకంగా ప్రధానమంత్రితో కలిసి ఇండోనేషియా అధ్యక్షుడు గౌరవ శ్రీ ప్రబోవో సుబియాంటో ఆలయ సందర్శనకు వెళ్లారు. ఈ ఆలయ సముదాయంలో భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) చేపట్టనున్న పరిరక్షణ, పునరుద్ధరణ ప్రాజెక్టు ప్రారంభానికి గుర్తుగా ఇరుదేశాల నాయకులు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.India and Indonesia are connected not only by our history but also by a shared future: PM Modi at community programme in Jakarta
July 07th, 11:47 pm
Addressing the Indian community in Jakarta, PM Modi thanked the diaspora for their warm welcome and praised their contribution to Indonesia's progress and their role as a living bridge between the two nations. He spoke about India's rapid transformation and called upon the community to contribute towards the shared aspirations of Viksit Bharat 2047 and Indonesia Emas 2045.జకార్తాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధానమంత్రి
July 07th, 05:30 pm
ఈ సందర్భంగా ఆహూతులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధానమంత్రి.. తమకు లభించిన ఉత్సాహభరిత స్వాగతానికి గాను భారతీయ సమాజానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధ్యక్షుడు ప్రబోవోకు ప్రధాని కృతజ్ఞతలు చెబుతూ... ఆయనను ఒక గొప్ప నాయకుడుగా, భారత దేశానికి నిజమైన మిత్రుడిగా అభివర్ణించారు. ఇండోనేషియా పురోగతి, శ్రేయస్సులో ప్రవాస భారతీయులు అందిస్తున్న సహకారాన్ని ఇరు దేశాల మధ్య మైత్రికి ప్రతీకగా అభివర్ణించారు. పరస్పర విశ్వాసం, భాగస్వామ్య వారసత్వం, సముద్ర అనుబంధాల ఆధారంగా ఇండోనేషియాతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఇరు దేశాల మధ్య ఉన్న ప్రాచీన నాగరికత సంబంధాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. బాలి యాత్ర, వైశాఖ పూర్ణిమ తీర్థయాత్ర వంటి సంప్రదాయాలతో పాటు ప్రస్తుత నలంద విశ్వవిద్యాలయం ద్వారా కొనసాగుతున్న ఆధునిక అనుసంధానాలు ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న వైవిధ్యభరిత, ఉత్సాహభరిత సంబంధాలను నిరంతరం పెంపొందిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.India-Indonesia Joint Statement on the State Visit by Prime Minister of India to Indonesia
July 07th, 05:15 pm
At the invitation of Indonesian President Prabowo Subianto, PM Modi is on a State Visit to Indonesia from 6-8 July 2026. PM Modi's visit reflects the shared commitment of the two leaders to achieve a substantial upward trajectory in the India-Indonesia Comprehensive Strategic Partnership. The two leaders held discussions at Istana Merdeka in Jakarta, covering the full spectrum of bilateral relations.భారత ప్రధానమంత్రికి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం ‘బింటాంగ్ ఆదిపూర్ణ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా’... స్వయంగా ప్రదానం చేసిన ఇండోనేషియా అధ్యక్షుడు
July 07th, 03:27 pm
భారత ప్రధానమంత్రికి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారమైన ‘బింటాంగ్ ఆదిపూర్ణ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా’ గౌరవ పురస్కారాన్ని ఆ దేశ అధ్యక్షుడు శ్రీ ప్రబోవో సుబియాంటో నేడు ప్రదానం చేశారు. ఈ అవార్డు ఇండోనేషియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, అత్యున్నతమైన పౌర పురస్కారం కావడం విశేషం. భారత్-ఇండోనేషియా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చూపిన అద్భుతమైన నాయకత్వానికి, ఆయన అందించిన విశేషమైన సహకారానికి గుర్తింపుగా ఈ అత్యున్నత గౌరవాన్ని అందజేశారు. ఈ అవార్డును భారత్, ఇండోనేషియా దేశాల ప్రజలకు, ఉభయ దేశాల మధ్య చిరకాలంగా కొనసాగుతున్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలకు అంకితం ఇస్తున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు.ఇండోనేషియా పార్లమెంటులో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
July 07th, 03:15 pm
ఇండోనేషియా ప్రజలు – చిన్నారులు, యువత, మహిళలు - ఈ రోజును నా జీవితంలో మరచిపోలేని రోజుల్లో ఒకటిగా మార్చారు. ఈ ఉదయం ఇండోనేషియా ప్రజల నుంచి నాకు దక్కిన ఆత్మీయత, అనురాగం, సాదర స్వాగతాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఈ ఉదయం అధ్యక్షులు ప్రబోవో కాపీరైట్ గురించి మాట్లాడారు. ప్రేమ, ఆత్మీయత, స్నేహం, పరస్పర గౌరవంపై ఎవరూ కాపీరైట్‌ను క్లెయిము చేయలేరని చెప్పాను. అధ్యక్షులు ప్రబోవోతో నా స్నేహం కాపీరైట్‌కి సంబంధించిన అన్ని హద్దులను అధిగమించింది.ఇండోనేషియా పార్లమెంటును ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
July 07th, 03:00 pm
ఈ సందర్భంగా ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. సమావేశానికి విచ్చేసిన ఇండోనేషియా అధ్యక్షుడు శ్రీ ప్రభోవో సుబియాంటోకు ధన్యవాదాలు తెలిపారు. తనకు సాదర ఆహ్వానం పలకడమే కాకుండా భారత్-ఇండోనేషియా భాగస్వామ్యానికి ఎంతో కృషి చేస్తున్న పార్లమెంటు స్పీకర్ శ్రీమతి పువాన్ మహారాణికి కృతజ్ఞతలు తెలియజేశారు. 140 కోట్ల మంది భారత ప్రజల తరపున అక్కడి ఎంపీలకు శుభాకాంక్షలు అందజేశారు. ప్రజాస్వామ్యానికి పట్టునిల్లు అయినటువంటి భారత్.. ఇండోనేషియాతో ఉన్న ప్రజాస్వామ్య బంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఆకాంక్షిస్తోందని పేర్కొన్నారు. ఉభయ దేశాల మధ్య ఉన్న లోతైన చారిత్రక, నౌకా వాణిజ్య సంబంధాలను ఆయన ప్రస్తావించారు. రెండు వేల సంవత్సరాలకు పైగా పరస్పర భావాలు, వాణిజ్యం, సంస్కృతి, విశ్వాసాల ద్వారా భారత్, ఇండోనేషియాలను హిందూ మహాసముద్రం అనుసంధానిస్తోందని ప్రధానమంత్రి శ్రీ మోదీ తెలిపారు. భారత్‌కు చెందిన వసుధైక కుటుంబం, ఇండోనేషియాకు చెందిన భిన్నేక తుంగల్ ఇక (భిన్నత్వంలో ఏకత్వం) వంటి ఉమ్మడి ఆదర్శాలను ప్రధాని ప్రస్తావించారు. ఈ విలువలే రెండు దేశాల భాగస్వామ్యానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని చెప్పారు. ఉమ్మడి చారిత్రక నేపథ్యం, సవాళ్లు, ఇరు దేశాల ప్రజల ఆకాంక్షలు భారత్, ఇండోనేషియాలను సహజసిద్ధమైన, నమ్మకమైన భాగస్వాములుగా మార్చాయని పేర్కొన్నారు.ఇండోనేషియా అధ్యక్షునితో ప్రధానమంత్రి అధికారిక చర్చలు
July 07th, 02:51 pm
నాయకులిద్దరూ నియంత్రిత, ప్రతినిధి స్థాయి విధానాల్లో జరిగిన అధికారిక చర్చల్లో పాల్గొన్నారు. వాణిజ్యం-పెట్టుబడులు, రక్షణ-భద్రత, సముద్ర రక్షణ సహకారం, డిజిటల్-ఆర్థిక సాంకేతికతలు, ఇంధనం, ఆరోగ్య సేవలు, ఫార్మాసూటికల్స్, అంతరిక్షం, కీలకమైన ఖనిజాలు, అరుదైన మూలకాలు, సంస్కృతి, పర్యాటకం, వ్యవసాయం, ప్రజా సంబంధాలతో సహా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన అన్ని అంశాలను వారు సమీక్షించారు. భారత్‌లోని ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ) ఆధారంగా ఇండోనేషియా ఓపెన్ నెట్వర్క్ (ఐవోఎన్) ప్రారంభం కావడాన్ని నాయకులిద్దరూ స్వాగతించారు. 2027 నాటికి గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఇండోనేషియాలో పర్యటించి వందేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఠాగూర్–దేవంతర సాంస్కృతిక, విద్యా దౌత్య సంవత్సరాన్ని రెండు దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తాయని ప్రధానమంత్రి మోదీ ప్రకటించారు.ఒప్పందాల జాబితా: ఇండోనేషియాలో ప్రధానమంత్రి పర్యటన
July 07th, 01:03 pm
శాంతియుత ప్రయోజనాల కోసం అంతరిక్ష అన్వేషణ, వినియోగంలో సహకారంపై విధానపరమైన ఒప్పందం పొడిగింపుఇండోనేషియా అధ్యక్షుడితో కలిసి సంయుక్త ప్రకటన నేపథ్యంలో ప్రధానమంత్రి ప్రకటన
July 07th, 11:21 am
మన మధ్య 2018లో ఏర్పడిన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం నేడు నూతన శిఖరాలకు చేరుకుంటోంది. అభివృద్ధి, భద్రత, సాంకేతికత, సంస్కృతి, విద్యతో సహా ప్రతి సహకార రంగంలోనూ గణనీయమైన పురోగతిని సాధిస్తున్నాం.జకార్తా చేరుకున్న ప్రధాని మోదీ
July 06th, 05:03 pm
ప్రధాని మోదీ ఇండోనేషియాలోని జకార్తా చేరుకున్నారు. ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంటో విమానాశ్రయంలో ప్రధాని మోదీకి సాదర స్వాగతం పలికారు.ఇండొనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల పర్యటనకు ముందు ప్రధానమంత్రి ప్రకటన
July 06th, 09:00 am
ఇండొనేషియా అధ్యక్షుడు శ్రీ ప్రబొవొ సుబియాంతొ ఆహ్వానించడంతో, నేను ఈ నెల 6 నుంచి 8 వరకూ ఇండొనేషియాలో పర్యటిస్తాను. 2018లో నేను మొదటిసారి ఇండొనేషియా పర్యటనకు వెళ్లినప్పుడు భారత్, ఇండొనేషియా తమ ద్వైపాక్షిక సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంపొందింపచేసుకున్నాయి. ద్వైపాక్షిక సంబంధాల స్థాయి పెరిగిన తరువాత ఇదే నేను చేపట్టబోయే మొదటి ద్వైపాక్షిక పర్యటన. అధ్యక్షుడు శ్రీ ప్రబొవొ అధికార పర్యటన అనంతరం నా ఈ పర్యటన చోటుచేసుకోనుంది. అప్పట్లో అంటే.. 2025 జనవరి 26న ఆయన మన గణతంత్ర దినోత్సానికి ముఖ్య అతిథిగా వచ్చారు. భారత్, ఇండొనేషియా మధ్య బలమైన నాగరికత సంబంధమైన ప్రజా సంబంధాలు నెలకొన్నాయి. నా ఈ పర్యటన మన బహుముఖీన భాగస్వామ్యానికి చెందిన అన్ని అంశాలనూ మరింత దృఢతరంగా మారుస్తుంది. నా పర్యటన కాలంలో, నేను ఇండొనేషియాలో నివసిస్తున్న ప్రవాసీ భారతీయులతోనూ సమావేశమవుతాను. అధ్యక్షుడు శ్రీ ప్రబొవొతో కలిసి యోగ్యకర్తలోని ప్రంబానన్ దేవాలయ పరిసరాలను సందర్శిస్తాను. ఆ దేవాలయం మన సన్నిహిత సాంస్కృతిక సంబంధాలకు మరొక అద్భుత నిదర్శనంగా నిలుస్తుంది.ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ప్రధానమంత్రి పర్యటన
July 03rd, 08:42 pm
ఇండోనేషియా అధ్యక్షులు శ్రీ ప్రబోవో సుబియాంటో ఆహ్వానం మేరకు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 జూలై 6 నుంచి 8 వరకు ఇండోనేషియాలో పర్యటించనున్నారు. మే 2018లో భారత్-ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదిగిన తర్వాత, ప్రధానమంత్రి ఇండోనేషియాలో పర్యటించడం ఇది నాలుగోసారి కాగా... ఇది ఆయన తొలి ద్వైపాక్షిక పర్యటన. ఈ పర్యటన సందర్భంగా, ఇండేనేషియా అధ్యక్షులు శ్రీ ప్రబోవోతో ప్రధానమంత్రి ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. ఇరు దేశాల భాగస్వామ్యంలో సాధించిన పురోగతిని సమీక్షిస్తారు. జకార్తాలో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసే భారీ సభనుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. భారత్, ఇండోనేషియా దేశాల ప్రజల మధ్య చరిత్రాత్మక, ఆత్మీయ సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రత్యేక సంబంధాలకు అనుగుణంగా... ఇండోనేషియాలోని ప్రముఖ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన యోగ్యకార్తాలోని ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని ప్రధానమంత్రి సందర్శిస్తారు.అనువాదం: ఐఎన్ఎస్ విక్రాంత్‌లో సాయుధ దళాల మధ్య దీపావళి వేడుకలు చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
October 20th, 10:30 am
ఈ రోజు అద్భుతమైనది… ఈ క్షణం మరపురానిది.. ఈ దృశ్యం అసాధారణమైనది. నాకు ఒకవైపు విశాలమైన అనంత సముద్రం ఉంది.. మరొక వైపు భారత మాత ధీర సైనికుల అపారమైన సామర్థ్యం ఉంది. నాకు ఒక దిక్కు అనంతమైన విశ్వం, అంతులేని ఆకాశం ఉన్నాయి.. మరో దిక్కు అనంతమైన శక్తిని కలిగి ఉన్న అద్భుత ఐఎన్ఎస్ విక్రాంత్ ఉంది. సముద్రపు నీటిపై పడ్డ సూర్యకాంతి మెరుపు.. ఒక విధంగా మన వీర సైనికులు వెలిగించే దీపావళి దీపాల మాదిరిగా ఉంది. మన దివ్యమైన వెలుగుల మాలికలు ఇవి. ఈసారి నేను మన నావికాదళ యోధుల మధ్య దీపావళి పండుగను చేసుకోవటం నాకు కలిగిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను.ఐఎన్ఎస్ విక్రాంత్ కేవలం యుద్ధనౌక కాదు... 21వ శతాబ్దంలో భారత కృషి, ప్రతిభ, ప్రభావం, నిబద్ధతలకు ఇది నిదర్శనం
October 20th, 10:00 am
ఈ రోజు ఐఎన్ఎస్ విక్రాంత్‌లో దీపావళి వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాయుధ దళాల సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ రోజు ఒక అద్భుతమైన రోజు... ఒక అద్భుతమైన క్షణం... ఇది ఒక అద్భుతమైన దృశ్యం అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఒక వైపు విశాలమైన సముద్రం... మరోవైపు ధైర్యవంతులైన భరతమాత సైనికుల అపారమైన బలం ఇక్కడ ఉందన్నారు. ఒక దిశ అనంతమైన ఆలోచనా పరిధిని... హద్దులులేని ఆకాశాన్ని ప్రదర్శిస్తుండగా, మరొక దిశలో అనంతమైన శక్తి గల ఐఎన్ఎస్ విక్రాంత్ అపార శక్తి ప్రదర్శితమవుతోందని ఆయన పేర్కొన్నారు. సముద్రంపై నుంచి కనిపిస్తున్న సూర్యకాంతి మెరుపులు ధైర్యవంతులైన మన సైనికులు వెలిగించిన దీపాల మాదిరిగా ప్రకాశిస్తూ.. దివ్య దీప మాలను తలపిస్తున్నాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ధైర్యసాహసాలకు మారుపేరైన భారత నావికాదళ సిబ్బందితో కలిసి ఈ దీపావళిని జరుపుకోవడం తనకు దక్కిన గౌరవమని ఆయన ఉద్ఘాటించారు.సెప్టెంబర్ 25న ఢిల్లీలోని భారత్ మండపంలో జరగనున్న వరల్డ్ ఫుడ్ ఇండియా-2025లో పాల్గొననున్న ప్రధానమంత్రి
September 24th, 06:33 pm
సెప్టెంబర్ 25న సాయంత్రం 6:15 గంటలకు ఢిల్లీలోని భారత్ మండపంలో జరగనున్న వరల్డ్ ఫుడ్ ఇండియా 2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమంత్రి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.