ఒప్పందాల జాబితా: న్యూజిలాండ్‌లో ప్రధానమంత్రి అధికారిక పర్యటన
July 11th, 08:03 am
చర్చలు, సమన్వయం, సమాచారాన్ని పంచుకోవడం, ఉమ్మడి కార్యకలాపాల ద్వారా ఇండో-పసిఫిక్‌లో మెరుగైన నౌకా వాణిజ్య సహకారం కోసం ఒక విధాన ప్రణాళికను ఏర్పాటు చేస్తుంది.భారత్-న్యూజిలాండ్ సంయుక్త ప్రకటన
July 11th, 07:59 am
న్యూజిలాండ్ ప్రధానమంత్రి గౌరవనీయ క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 జులై 10, 11 తేదీల్లో న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో అధికారికంగా పర్యటిస్తున్నారు. గత 40 ఏళ్లలో భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ చరిత్రాత్మక ఘట్టం రెండు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహం, సహకారంలో ఒక కొత్త దిశకు మార్గనిర్దేశం చేస్తోంది.ఆస్ట్రేలియా-భారత్ ప్రధానమంత్రుల సంయుక్త విలేకరుల సమావేశంలో శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
July 09th, 11:15 am
అంతర్జాతీయ దృక్పథం, ప్రగాఢ పరస్పర విశ్వాసంతో రెండు దేశాలూ సంయుక్తంగా ముందడుగు వేయడంలో ఈ ఉమ్మడి విశిష్టతలే మనకెంతో స్ఫూర్తినిస్తాయి. మన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం కొన్నేళ్లుగా అద్భుత ప్రగతి సాధించిన నేపథ్యంలో నేటి మూడో వార్షిక శిఖరాగ్ర సమావేశం రెండు దేశాల మధ్య సహకార పరిధిని మరింత విస్తృతం చేసింది.రక్షణ, భద్రతా రంగాల్లో సహకారంపై ఇండియా-ఆస్ట్రేలియా సంయుక్త ప్రకటన
July 09th, 10:55 am
భారత్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రులమైన మేం.. మా మధ్య బలపడుతున్న ద్వైపాక్షిక సంబంధాల ద్వారా ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలనే సంకల్పంతో ఏకమై.. ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని స్వేచ్ఛా, శాంతియుత, స్థిరమైన, సుసంపన్నమైన ప్రాంతంగా మార్చాలన్న ఉమ్మడి ఆశయంతో రక్షణ, భద్రతా సహకారంపై సంయుక్త ప్రకటనకు కట్టబడి ఉంటామని తెలియజేస్తున్నాం.ఇండోనేషియా పార్లమెంటులో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
July 07th, 03:15 pm
ఇండోనేషియా ప్రజలు – చిన్నారులు, యువత, మహిళలు - ఈ రోజును నా జీవితంలో మరచిపోలేని రోజుల్లో ఒకటిగా మార్చారు. ఈ ఉదయం ఇండోనేషియా ప్రజల నుంచి నాకు దక్కిన ఆత్మీయత, అనురాగం, సాదర స్వాగతాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఈ ఉదయం అధ్యక్షులు ప్రబోవో కాపీరైట్ గురించి మాట్లాడారు. ప్రేమ, ఆత్మీయత, స్నేహం, పరస్పర గౌరవంపై ఎవరూ కాపీరైట్‌ను క్లెయిము చేయలేరని చెప్పాను. అధ్యక్షులు ప్రబోవోతో నా స్నేహం కాపీరైట్‌కి సంబంధించిన అన్ని హద్దులను అధిగమించింది.ఇండోనేషియా పార్లమెంటును ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
July 07th, 03:00 pm
ఈ సందర్భంగా ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. సమావేశానికి విచ్చేసిన ఇండోనేషియా అధ్యక్షుడు శ్రీ ప్రభోవో సుబియాంటోకు ధన్యవాదాలు తెలిపారు. తనకు సాదర ఆహ్వానం పలకడమే కాకుండా భారత్-ఇండోనేషియా భాగస్వామ్యానికి ఎంతో కృషి చేస్తున్న పార్లమెంటు స్పీకర్ శ్రీమతి పువాన్ మహారాణికి కృతజ్ఞతలు తెలియజేశారు. 140 కోట్ల మంది భారత ప్రజల తరపున అక్కడి ఎంపీలకు శుభాకాంక్షలు అందజేశారు. ప్రజాస్వామ్యానికి పట్టునిల్లు అయినటువంటి భారత్.. ఇండోనేషియాతో ఉన్న ప్రజాస్వామ్య బంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఆకాంక్షిస్తోందని పేర్కొన్నారు. ఉభయ దేశాల మధ్య ఉన్న లోతైన చారిత్రక, నౌకా వాణిజ్య సంబంధాలను ఆయన ప్రస్తావించారు. రెండు వేల సంవత్సరాలకు పైగా పరస్పర భావాలు, వాణిజ్యం, సంస్కృతి, విశ్వాసాల ద్వారా భారత్, ఇండోనేషియాలను హిందూ మహాసముద్రం అనుసంధానిస్తోందని ప్రధానమంత్రి శ్రీ మోదీ తెలిపారు. భారత్‌కు చెందిన వసుధైక కుటుంబం, ఇండోనేషియాకు చెందిన భిన్నేక తుంగల్ ఇక (భిన్నత్వంలో ఏకత్వం) వంటి ఉమ్మడి ఆదర్శాలను ప్రధాని ప్రస్తావించారు. ఈ విలువలే రెండు దేశాల భాగస్వామ్యానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని చెప్పారు. ఉమ్మడి చారిత్రక నేపథ్యం, సవాళ్లు, ఇరు దేశాల ప్రజల ఆకాంక్షలు భారత్, ఇండోనేషియాలను సహజసిద్ధమైన, నమ్మకమైన భాగస్వాములుగా మార్చాయని పేర్కొన్నారు.ఇండొనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల పర్యటనకు ముందు ప్రధానమంత్రి ప్రకటన
July 06th, 09:00 am
ఇండొనేషియా అధ్యక్షుడు శ్రీ ప్రబొవొ సుబియాంతొ ఆహ్వానించడంతో, నేను ఈ నెల 6 నుంచి 8 వరకూ ఇండొనేషియాలో పర్యటిస్తాను. 2018లో నేను మొదటిసారి ఇండొనేషియా పర్యటనకు వెళ్లినప్పుడు భారత్, ఇండొనేషియా తమ ద్వైపాక్షిక సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంపొందింపచేసుకున్నాయి. ద్వైపాక్షిక సంబంధాల స్థాయి పెరిగిన తరువాత ఇదే నేను చేపట్టబోయే మొదటి ద్వైపాక్షిక పర్యటన. అధ్యక్షుడు శ్రీ ప్రబొవొ అధికార పర్యటన అనంతరం నా ఈ పర్యటన చోటుచేసుకోనుంది. అప్పట్లో అంటే.. 2025 జనవరి 26న ఆయన మన గణతంత్ర దినోత్సానికి ముఖ్య అతిథిగా వచ్చారు. భారత్, ఇండొనేషియా మధ్య బలమైన నాగరికత సంబంధమైన ప్రజా సంబంధాలు నెలకొన్నాయి. నా ఈ పర్యటన మన బహుముఖీన భాగస్వామ్యానికి చెందిన అన్ని అంశాలనూ మరింత దృఢతరంగా మారుస్తుంది. నా పర్యటన కాలంలో, నేను ఇండొనేషియాలో నివసిస్తున్న ప్రవాసీ భారతీయులతోనూ సమావేశమవుతాను. అధ్యక్షుడు శ్రీ ప్రబొవొతో కలిసి యోగ్యకర్తలోని ప్రంబానన్ దేవాలయ పరిసరాలను సందర్శిస్తాను. ఆ దేవాలయం మన సన్నిహిత సాంస్కృతిక సంబంధాలకు మరొక అద్భుత నిదర్శనంగా నిలుస్తుంది.జపాన్ ప్రధానమంత్రితో సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
July 02nd, 01:30 pm
ఆటోమొబైల్స్ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకూ అన్ని రంగాల్లోనూ భారత్ వృద్ధి పయనంలో గత అనేక దశాబ్దాలుగా జపాన్ కీలక ఓ భాగస్వామి. పరస్పర విశ్వాసం, స్నేహబంధానికి ఇదొక అమూల్య పెన్నిధి.భారత్ - స్లొవేకియా సంయుక్త ప్రకటన
June 15th, 05:32 pm
గౌరవ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆహ్వానం మేరకు.. గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 జూన్ 15న అధికారికంగా ఆ దేశంలో పర్యటించారు.మయన్మార్ అధ్యక్షుడు యు మిన్ ఆంగ్ హలైన్‌తో ప్రధానమంత్రి చర్చలు
June 01st, 08:09 pm
మయన్మార్ అధ్యక్షుడు శ్రీ యు మిన్ ఆంగ్ హలైన్‌తో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఫలప్రదమైన చర్చలు జరిపారు.సైప్రస్ దేశాధ్యక్షుడి అధికారిక పర్యటన సందర్భంగా ఇరుదేశాల ఉమ్మడి ప్రకటన
May 22nd, 09:31 pm
భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు సైప్రస్ దేశాధ్యక్షుడు శ్రీ నికోస్ క్రిస్టోడౌలిడెస్ 2026 మే 20 నుంచి 23 వరకు భారతదేశంలో అధికారిక పర్యటన చేపట్టారు. ఐరోపా సమాఖ్య కౌన్సిల్‌కు సైప్రస్ అధ్యక్షత వహిస్తున్న తరుణంలో ఈ పర్యటన జరగడంతో ఇది మరింత ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.నార్వే ప్రధానమంత్రితో భారత ప్రధానమంత్రి ద్వైపాక్షిక చర్చలు
May 18th, 08:21 pm
నార్వే రాజధాని ఓస్లోలో ఆ దేశ ప్రధానమంత్రి శ్రీ జోనాస్ గర్ స్టోరెతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అంతకుముందు ఉదయం ఓస్లో విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని శ్రీ మోదీకి నార్వే ప్రధానమంత్రి స్టోరె స్వయంగా విచ్చేసి ఘనస్వాగతం పలికారు. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలకు అద్దం పట్టింది.నార్వే ప్రధానమంత్రితో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా భారత ప్రధానమంత్రి పత్రికా ప్రకటన
May 18th, 04:44 pm
గతేడాదే నేను నార్వేలో పర్యటించాల్సి ఉంది. అయితే, పహల్గాంలో ఉగ్రవాద దాడి కారణంగా ఆ పర్యటనను వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ క్లిష్ట సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌కు నార్వే అండగా నిలిచింది. మన స్నేహబంధం శక్తికి ఇది నిదర్శనం. ఆ మద్దతు, సంఘీభావం పట్ల ఈ రోజు నార్వే పర్యటన సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.మెరుగైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై భారత్, వియత్నాం దేశాల సంయుక్త ప్రకటన
May 06th, 05:24 pm
భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి, వియత్నాం దేశాధ్యక్షుడు శ్రీ తో లామ్ 2026 మే 05 నుంచి మే 07 వరకు భారతదేశంలో అధికారిక పర్యటన చేశారు. ఈయనతో పాటు ఒక ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం వచ్చింది. వీరితో పాటు వ్యాపార ప్రతినిధుల బృందం కూడా పర్యటనలో పాల్గొంది.వియత్నాం అధ్యక్షుడి అధికారిక భారత పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందాలు
May 06th, 03:44 pm
ఐఆర్ఈఎల్ (భారత్), వియత్నాంకు చెందిన రేడియోధార్మిక - అరుదైన మూలకాల సాంకేతిక సంస్థ (ఐటీఆర్ఆర్ఈ) మధ్య పరస్పర సహకారంపై అవగాహన ఒప్పందంవియత్నాం కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, వియత్నాం అధ్యక్షుడితో ఉమ్మడి మీడియా సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి ప్రకటన
May 06th, 01:00 pm
భారత్-వియత్నాం భాగస్వామ్యంలో వారసత్వం, అభివృద్ధి రెండూ కీలకమే. గతేడాది భారత్ నుంచి బుద్ధుని పవిత్ర అవశేషాలను వియత్నాంకు తీసుకువెళ్లినప్పుడు అక్కడి జనాభాలో సుమారు పదిహేను శాతం మంది అంటే.. పదిహేను మిలియన్లకు పైగా ప్రజలు వాటిని దర్శించుకున్నారు. మన ఉమ్మడి వారసత్వాన్ని పరిరక్షించేందుకు, వియత్నాంలోని మై సన్, న్హాన్ టవర్స్ వద్ద ప్రాచీన చాం నాగరికత దేవాలయాల పునరుద్ధరణను మేం చేపడుతున్నాం. చాం నాగరికతకు సంబంధించిన రాతప్రతులను కూడా డిజిటలైజ్ చేసి, ఈ అమూల్యమైన వారసత్వాన్ని భవిష్యత్ తరాల కోసం భద్రపరుస్తున్నాం.ఇంధన వనరుల భద్రతపై భారత్, కొరియా సంయుక్త ప్రకటన
April 20th, 10:56 pm
బహిరంగ, సమ్మిళిత, సంపన్న ఇండో-పసిఫిక్ ప్రాంతం కోసం ఉమ్మడి దార్శనికత కలిగిన ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వాములు భారత్, కొరియా.సుస్థిరాభివృద్ధిలో సహకారానికి భారత్- రిపబ్లిక్ ఆఫ్ కొరియా సంయుక్త ప్రకటన
April 20th, 10:55 pm
వాతావరణ మార్పులు, సముద్ర, ఆర్కిటిక్ అంశాల్లో ఆచరణాత్మక సహకారం ద్వారా ప్రపంచ సుస్థిరాభివృద్ధి సవాళ్ల పరిష్కారానికి ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని భారత్- రిపబ్లిక్ ఆఫ్ కొరియా సంయుక్తంగా ప్రకటించారు.భారత్-దక్షిణ కొరియా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంపై సంయుక్త కార్యాచరణ ప్రణాళిక
April 20th, 10:53 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు, దక్షిణ కొరియా (ఆర్‌ఓకే) అధ్యక్షులు గౌరవనీయ లీ ఈ మయంగ్ ఈ నెల 19 నుంచి 21 వరకు భారత్ పర్యటనకు వచ్చారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే ఆయన తొలి విదేశీ సందర్శనలో భాగంగా భారత్ రావడం విశేషం. ఆయన వెంట కొరియా ప్రభుత్వ మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రసిద్ధ కంపెనీల సీఈఓలు సహా ఒక ఉన్నత స్థాయి బృందం కూడా వచ్చింది.ఫిన్లాండ్ అధ్యక్షుడి పర్యటన నేపథ్యంలో భారత్-ఫిన్లాండ్ సంయుక్త ప్రకటన
March 05th, 08:03 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఈ నెల 4వ తేదీన ఢిల్లీ చేరుకున్న ఫిన్లాండ్ అధ్యక్షుడు గౌరవనీయ డాక్టర్ అలెగ్జాండర్ స్టూబ్ 7వ తేదీవరకూ భారత్‌లో పర్యటిస్తారు. ప్రస్తుత హోదాలో తొలిసారి మన దేశానికి వచ్చిన ఆయన ప్రధానంగా న్యూఢిల్లీ, ముంబయి నగరాలను సందర్శిస్తారు. ఆయనతోపాటు ఫిన్లాండ్ వాతావరణ-పర్యావరణ శాఖ మంత్రి శ్రీమతి సారీ ముల్తాలా, ఉపాధి శాఖ మంత్రి శ్రీ మాటియస్ మార్టినెన్ సహా ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తలతో కూడిన ప్రతినిధి బృందం కూడా ఈ పర్యటనలో పాల్గొంటోంది. ఈ నేపథ్యంలో 5వ తేదీన న్యూఢిల్లీలో 11వ దఫా రైసినా చర్చలను ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు స్టూబ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రధానోపన్యాసం చేశారు. భారత్ గత నెల ఢిల్లీలో నిర్వహించిన ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో ఫిన్లాండ్ ప్రధానమంత్రి శ్రీ పెట్టేరి ఓర్పో పాల్గొన్న నేపథ్యంలో అధ్యక్షుడు స్టూబ్ ఇప్పుడు పర్యటిస్తున్నారు.