భారత్-న్యూజిలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం: భవిష్యత్ ప్రణాళిక-2030
July 11th, 08:06 am
భారత్-న్యూజిలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై రెండు దేశాల ప్రధానమంత్రులు సంయుక్త ప్రకటన చేశారు. ఈ మేరకు న్యూజిలాండ్ రాజధాని ఆక్లాండ్‌లో ఇవాళ సమావేశమైన అనంతరం వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ భాగస్వామ్యాన్ని మరో నాలుగేళ్లలో మరింత బలోపేతం చేసే లక్ష్యంతో 2030 దాకా ఒక ఉమ్మడి ప్రణాళిక అమలుకు వారిద్దరూ ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగా ఆరు మూలస్తంభాల ప్రాతిపదికన వివిధ రంగాలలో అనేక కార్యక్రమాలను అమలు చేస్తారు.అనువాదం: భారత - న్యూజిలాండ్ ప్రతినిధుల స్థాయి చర్చల ప్రారంభ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
July 11th, 07:00 am
రాత్రంతా మీ మంత్రి గారు నాతోనే ఉన్నందుకు ధన్యవాదాలు. దాదాపు 40 సంవత్సరాల తర్వాత ఒక భారత ప్రధాని న్యూజిలాండ్‌ను సందర్శించడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. మీ ఆర్థిక రాజధానిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా భారత్-న్యూజిలాండ్ సంబంధాలకు సరికొత్త ఉత్తేజాన్ని ఇచ్చే అవకాశాన్ని మీరు కల్పించారు. దీనికి నేను మీకు మనఃపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.భారత్-నెదర్లాండ్స్ వ్యూహాత్మక భాగస్వామ్య ప్రణాళిక [2026-2030]
May 17th, 03:15 am
2026 మే 16న హేగ్ నగరంలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, నెదర్లాండ్స్ ప్రధానమంత్రి శ్రీ రాబ్ జెట్టెన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిర్దిష్ట లక్ష్యాలు, కాలపరిమితితో కూడిన కార్యక్రమాలు, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికల ద్వారా భారత్-నెదర్లాండ్స్ ద్వైపాక్షిక సంబంధాలను 'వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి పెంచేందుకు ఇరు దేశాల ప్రధానులు అంగీకరించారు. ఈ లక్ష్య సాధన కోసం రాబోయే 5 సంవత్సరాల కాలానికి (2026-2030) ‘భారత్-నెదర్లాండ్స్ వ్యూహాత్మక భాగస్వామ్య ప్రణాళిక’ను ఇరు దేశాలు ఆమోదించాయి.ఫిజీ ప్రధాని శ్రీ సిటీవేనీ రాబుకా భారత్ పర్యటన... ఈ సందర్భంగా కుదిరిన ఒప్పందాలు
August 25th, 01:58 pm
ఫిజీలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి రూపకల్పన, నిర్మాణం, కార్యకలాపాల ప్రారంభం, నిర్వహణ, మరమ్మతుల కోసం భారత్ ప్రభుత్వానికీ, ఫిజీ ప్రభుత్వానికీ మధ్య అవగాహన ఒప్పంద పత్రం.