ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ ట్రస్టీలతో సమావేశమైన ప్రధానమంత్రి

March 19th, 10:13 pm

భారతదేశ వైవిధ్యభరితమైన సంస్కృతిని మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ (ఐజీఎన్సీఏ) ట్రస్టీలతో సమావేశమయ్యారు.