2026 వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్‌లో చారిత్రాత్మక విజయం సాధించిన అనాహత్ సింగ్‌ను అభినందించిన ప్రధాని

July 26th, 03:28 pm

2026 వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్‌లో చారిత్రాత్మక విజయం నమోదవటం పట్ల ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. గోల్డ్ మెడల్ గెలుచుకొని వరల్డ్ జూనియర్ ఛాంపియన్‌షిప్ టైటిల్ సాధించిన తొలి భారతీయ స్క్వాష్ క్రీడాకారిణిగా నిలిచిన అనాహత్ సింగ్‌ను ఆయన అభినందించారు. ఈ విజయం.. యువతలో స్క్వాష్ క్రీడను మరింత ప్రాచుర్యంలోకి తెస్తుందని ప్రధాని పేర్కొన్నారు.

స్క్వాష్ ప్రపంచ కప్‌లో విజయం సాధించిన భారత బృందానికి ప్రధాని శుభాకాంక్షలు

December 15th, 10:16 am

ఎస్‌డీఏటీ స్క్వాష్ ప్రపంచ కప్ - 2025లో మొదటిసారి ప్రపంచ కప్ సాధించి చరిత్ర సృష్టించిన భారత స్క్వాష్ బృందాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.