తమిళనాడులోని తిరుచిరాపల్లిలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
March 11th, 05:45 pm
తమిళనాడు భవిష్యత్తుకు నేటి కార్యక్రమం చాలా ముఖ్యమైనది. ఇది ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు సంబంధించినది. ఈ ప్రాజెక్టులు: స్వచ్ఛ ఇంధనం కోసం మౌలిక సదుపాయాలు, పెట్రోలియం సంబంధిత తయారీ రంగాలు, రహదారులు, రైల్వేలు, గ్రామీణ రోడ్లకు సంబంధించినవి. ఇవి ఇంధన లభ్యతను, అనుసంధానాన్ని పెంచుతాయి తమిళనాడు యువతకు వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తాయి.తమిళనాడులోని తిరుచిరాపల్లిలో దాదాపు ₹5,650 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం.. జాతికి అంకితం.. శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 11th, 05:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తమిళనాడులోని చారిత్రక నగరం తిరుచ్చిలో అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతోపాటు ఆర్థిక వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా పరిణామాత్మక అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ మేరకు రూ.5600 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా కాలుష్య రహిత ఇంధనం, పెట్రోలియం సంబంధిత తయారీ, హైవే-రైల్వే, గ్రామీణ రహదారుల రంగాల్లో ఈ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, జాతికి అంకితం, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ- “ఇవన్నీ తమిళనాడు యువతకు ఇంధన లభ్యత, బహుళ రవాణా అనుసంధానం సహా వేలాది ఉద్యోగాలను సృష్టిస్తాయి” అని పేర్కొన్నారు.మార్చి 11న కేరళ, తమిళనాడులో పర్యటించనున్న ప్రధానమంత్రి
March 09th, 09:54 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి 11న కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు కేరళలోని ఎర్నాకుళంలో సుమారు రూ. 10,800 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన, జాతికి అంకితం కార్యక్రమాలు చేస్తారు. ఈ సందర్భంగా ఆయన బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సాయంత్రం 5:45 గంటలకు తమిళనాడులోని తిరుచిరాపల్లిలో సుమారు రూ. 5,650 కోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభం, జాతికి అంకితం, శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తారు. అక్కడ కూడా ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.భారత్‌లో అబుదాబి యువరాజు హెచ్ హెచ్ షేక్ ఖలిద్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అధికారిక పర్యటనలో కుదిరిన ఒప్పందాలు.... జాబితా
September 09th, 07:03 pm
బరాకా అణు విద్యుత్ కేంద్రం కార్యకలాపాలు, నిర్వహణ రంగంలో ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కంపెనీ (ఈఎన్ఈసీ), న్యూక్లియర్ పవర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం9, 10 తేదీల్లో అబుధాబి యువరాజు షేక్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత పర్యటన
September 09th, 07:03 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు అబుధాబి యువరాజు షేక్ ఖాలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సెప్టెంబర్ 9, 10 తేదీల్లో భారత్ పర్యటనకు వచ్చారు. ఈ హోదాలో ఆయన భారత్ సందర్శనకు రావడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో సోమవారం న్యూఢిల్లీ చేరుకున్న ఆయనకు కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ స్వాగతం పలికారు. ఈ మేరకు ఆయనను గౌరవ వందనంతో ఘనంగా ఆహ్వానించారు. యువరాజు వెంట అబుధాబి మంత్రులు, ఉన్నతాధికారులతోపాటు పలువురు వాణిజ్యవేత్తలతో కూడిన బృందం కూడా ఉంది.