ఇండోనేషియా పార్లమెంటులో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
July 07th, 03:15 pm
ఇండోనేషియా ప్రజలు – చిన్నారులు, యువత, మహిళలు - ఈ రోజును నా జీవితంలో మరచిపోలేని రోజుల్లో ఒకటిగా మార్చారు. ఈ ఉదయం ఇండోనేషియా ప్రజల నుంచి నాకు దక్కిన ఆత్మీయత, అనురాగం, సాదర స్వాగతాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఈ ఉదయం అధ్యక్షులు ప్రబోవో కాపీరైట్ గురించి మాట్లాడారు. ప్రేమ, ఆత్మీయత, స్నేహం, పరస్పర గౌరవంపై ఎవరూ కాపీరైట్‌ను క్లెయిము చేయలేరని చెప్పాను. అధ్యక్షులు ప్రబోవోతో నా స్నేహం కాపీరైట్‌కి సంబంధించిన అన్ని హద్దులను అధిగమించింది.ఇండోనేషియా పార్లమెంటును ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
July 07th, 03:00 pm
ఈ సందర్భంగా ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. సమావేశానికి విచ్చేసిన ఇండోనేషియా అధ్యక్షుడు శ్రీ ప్రభోవో సుబియాంటోకు ధన్యవాదాలు తెలిపారు. తనకు సాదర ఆహ్వానం పలకడమే కాకుండా భారత్-ఇండోనేషియా భాగస్వామ్యానికి ఎంతో కృషి చేస్తున్న పార్లమెంటు స్పీకర్ శ్రీమతి పువాన్ మహారాణికి కృతజ్ఞతలు తెలియజేశారు. 140 కోట్ల మంది భారత ప్రజల తరపున అక్కడి ఎంపీలకు శుభాకాంక్షలు అందజేశారు. ప్రజాస్వామ్యానికి పట్టునిల్లు అయినటువంటి భారత్.. ఇండోనేషియాతో ఉన్న ప్రజాస్వామ్య బంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఆకాంక్షిస్తోందని పేర్కొన్నారు. ఉభయ దేశాల మధ్య ఉన్న లోతైన చారిత్రక, నౌకా వాణిజ్య సంబంధాలను ఆయన ప్రస్తావించారు. రెండు వేల సంవత్సరాలకు పైగా పరస్పర భావాలు, వాణిజ్యం, సంస్కృతి, విశ్వాసాల ద్వారా భారత్, ఇండోనేషియాలను హిందూ మహాసముద్రం అనుసంధానిస్తోందని ప్రధానమంత్రి శ్రీ మోదీ తెలిపారు. భారత్‌కు చెందిన వసుధైక కుటుంబం, ఇండోనేషియాకు చెందిన భిన్నేక తుంగల్ ఇక (భిన్నత్వంలో ఏకత్వం) వంటి ఉమ్మడి ఆదర్శాలను ప్రధాని ప్రస్తావించారు. ఈ విలువలే రెండు దేశాల భాగస్వామ్యానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని చెప్పారు. ఉమ్మడి చారిత్రక నేపథ్యం, సవాళ్లు, ఇరు దేశాల ప్రజల ఆకాంక్షలు భారత్, ఇండోనేషియాలను సహజసిద్ధమైన, నమ్మకమైన భాగస్వాములుగా మార్చాయని పేర్కొన్నారు.సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
June 28th, 05:00 pm
ఈ రోజే కొంచెం ముందు నాకు ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్’ పురస్కారాన్ని అందించి నన్ను గౌరవించినందుకు అధ్యక్షుడు ఎర్మినీ గారికి, సీషెల్స్ ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇది పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతర కృషి చేస్తున్న వారందరికీ ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నేను ఇక్కడికి భారత్‌లోని 140 కోట్ల ప్రజల తరపున ఆత్మీయ శుభాకాంక్షలను, శుభాశీస్సులను తీసుకువచ్చాను.భారత్-కెనడా సంయుక్త ప్రకటన
March 02nd, 05:05 pm
భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు కెనడా ప్రధానమంత్రి మాననీయ మార్క్ కార్నీ ఫిబ్రవరి 27 నుంచి ఈ నెల 2వ తేదీ వరకూ భారతదేశంలో పర్యటించారు. ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించాక కార్నీ తొలిసారి భారత్‌లో పర్యటించగా, 2018 తర్వాత కెనడా ప్రధానమంత్రి ఒకరు ద్వైపాక్షిక పర్యటన కోసం మన దేశానికి రావడం ఇదే మొదటిసారి. కెనడా ప్రభుత్వంలోని సీనియర్ మంత్రులు, రాష్ట్రాల అధినేతలు, అగ్రగామి పరిశ్రమల ‘సీఈవో’లతో కూడిన ఉన్నత స్థాయి బృందం కూడా ఆయన వెంట వచ్చింది.కెనడా ప్రధానమంత్రి భారత్ పర్యటన.. కీలక నిర్ణయాలు
March 02nd, 05:04 pm
కెనడా ప్రధానమంత్రి భారత్ పర్యటన.. కీలక నిర్ణయాలునెసెట్ను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
February 25th, 08:20 pm
ఈ విశిష్ట సభ ముందు నిలబడటం నాకు దక్కిన గౌరవం, అదృష్టం. భారత ప్రధానమంత్రిగా, ఒక ప్రాచీన నాగరికత ప్రతినిధిగా మరో నాగరికతను ఉద్దేశించి ప్రసంగిస్తున్నాను. నా వెంట 1.4 బిలియన్ల మంది భారతీయులు అందించిన శుభాకాంక్షలను, స్నేహ సందేశాన్ని, గౌరవాన్ని, భాగస్వామ్యాన్ని తీసుకువచ్చాను.ఇజ్రాయెల్ పార్లమెంట్ - నెసెట్ ను ఉద్దేశించి ప్రసంగించిన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
February 25th, 08:00 pm
భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బుధవారం నాడు జెరూసలేంలోని నెసెట్ (ఇజ్రాయెల్ పార్లమెంట్) ప్రత్యేక ప్లీనరీని ఉద్దేశించి ప్రసంగించారు. ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రసంగించిన తొలి భారత ప్రధానమంత్రిగా ఆయన గుర్తింపు పొందారు.దేశ ప్రజలకీ, మానవ జాతికీ సేవ చేయడంలో పూర్తి అంకితభావం అవసరమని చెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
February 11th, 10:31 am
దేశ ప్రజలకీ, మానవ జాతికీ సేవ చేయడంలో పూర్తి అంకితభావం అవసరమని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.మెరుగైన సంబంధాల ద్వారా సుస్థిరత, ఆర్థిక వృద్ధి, భద్రత కోసం భారత్ – సీషెల్స్ ఉమ్మడి దార్శనికత
February 09th, 03:28 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు 2026 ఫిబ్రవరి 5 నుంచి 10 వరకు సీషెల్స్ దేశాధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మిని భారతదేశంలో పర్యటిస్తున్నారు.సీషెల్స్ అధ్యక్షునితో కలిసి సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా ప్రధాన మంత్రి పత్రికా ప్రకటన పాఠం
February 09th, 01:00 pm
అధ్యక్షుడు శ్రీ హెర్మినీకీ, ఆయన ప్రతినిధి వర్గానికీ భారత్‌లోకి స్వాగతం పలకడం నాకెంతో సంతోషాన్నిస్తోంది.అనువాదం: ఐఎన్ఎస్ విక్రాంత్‌లో సాయుధ దళాల మధ్య దీపావళి వేడుకలు చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
October 20th, 10:30 am
ఈ రోజు అద్భుతమైనది… ఈ క్షణం మరపురానిది.. ఈ దృశ్యం అసాధారణమైనది. నాకు ఒకవైపు విశాలమైన అనంత సముద్రం ఉంది.. మరొక వైపు భారత మాత ధీర సైనికుల అపారమైన సామర్థ్యం ఉంది. నాకు ఒక దిక్కు అనంతమైన విశ్వం, అంతులేని ఆకాశం ఉన్నాయి.. మరో దిక్కు అనంతమైన శక్తిని కలిగి ఉన్న అద్భుత ఐఎన్ఎస్ విక్రాంత్ ఉంది. సముద్రపు నీటిపై పడ్డ సూర్యకాంతి మెరుపు.. ఒక విధంగా మన వీర సైనికులు వెలిగించే దీపావళి దీపాల మాదిరిగా ఉంది. మన దివ్యమైన వెలుగుల మాలికలు ఇవి. ఈసారి నేను మన నావికాదళ యోధుల మధ్య దీపావళి పండుగను చేసుకోవటం నాకు కలిగిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను.ఐఎన్ఎస్ విక్రాంత్ కేవలం యుద్ధనౌక కాదు... 21వ శతాబ్దంలో భారత కృషి, ప్రతిభ, ప్రభావం, నిబద్ధతలకు ఇది నిదర్శనం
October 20th, 10:00 am
ఈ రోజు ఐఎన్ఎస్ విక్రాంత్‌లో దీపావళి వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాయుధ దళాల సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ రోజు ఒక అద్భుతమైన రోజు... ఒక అద్భుతమైన క్షణం... ఇది ఒక అద్భుతమైన దృశ్యం అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఒక వైపు విశాలమైన సముద్రం... మరోవైపు ధైర్యవంతులైన భరతమాత సైనికుల అపారమైన బలం ఇక్కడ ఉందన్నారు. ఒక దిశ అనంతమైన ఆలోచనా పరిధిని... హద్దులులేని ఆకాశాన్ని ప్రదర్శిస్తుండగా, మరొక దిశలో అనంతమైన శక్తి గల ఐఎన్ఎస్ విక్రాంత్ అపార శక్తి ప్రదర్శితమవుతోందని ఆయన పేర్కొన్నారు. సముద్రంపై నుంచి కనిపిస్తున్న సూర్యకాంతి మెరుపులు ధైర్యవంతులైన మన సైనికులు వెలిగించిన దీపాల మాదిరిగా ప్రకాశిస్తూ.. దివ్య దీప మాలను తలపిస్తున్నాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ధైర్యసాహసాలకు మారుపేరైన భారత నావికాదళ సిబ్బందితో కలిసి ఈ దీపావళిని జరుపుకోవడం తనకు దక్కిన గౌరవమని ఆయన ఉద్ఘాటించారు.సీషెల్స్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డాక్టర్ పాట్రిక్ హెర్మినీకి అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి
October 12th, 09:13 am
సీషెల్స్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డాక్టర్ పాట్రిక్ హెర్మినీకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.న్యూఢిల్లీలో నిర్వహించిన జ్ఞాన భారతం అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం
September 12th, 04:54 pm
కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ గారు, విద్యావేత్తలు, సోదరీసోదరులారా!‘జ్ఞాన భారతం’ పోర్టల్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీకారం
September 12th, 04:45 pm
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ రోజు నిర్వహించిన ‘జ్ఞాన భారతం’ అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారత స్వర్ణయుగ పునరుజ్జీవనానికి విజ్ఞాన్ భవన్ సాక్ష్యంగా నిలుస్తోందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని రోజుల కిందటే జ్ఞాన భారతం కార్యక్రమం గురించి తాను ప్రకటించగా, స్వల్ప వ్యవధిలోనే ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తుండటం విశేషమని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంతో ముడిపడిన పోర్టల్‌ను కూడా ప్రారంభించామని శ్రీ మోదీ వెల్లడించారు. ఇది ప్రభుత్వం లేదా విద్యా వ్యవస్థ సంబంధిత కార్యక్రమం కాదని, భారతీయ సంస్కృతి-సాహిత్యం, చైతన్య గళంగా జ్ఞాన భారతం ఆవిర్భవిస్తుందని ప్రధానమంత్రి ప్రకటించారు. వేల తరాల సాలోచనా వారసత్వాన్ని ప్రస్తావిస్తూ- మహనీయులైన రుషులు, ఆచార్యులు, పండితుల జ్ఞానం, పరిశోధనలను ఆయన గుర్తుచేశారు. భారతీయ జ్ఞానం, సంప్రదాయాలు, శాస్త్రీయ వారసత్వానికి ఇది నిదర్శనమని స్పష్టం చేశారు. మనకు సంక్రమించిన ఈ సుసంపన్న వారసత్వాన్ని జ్ఞాన భారతం కార్యక్రమం ద్వారా డిజిటలీకరిస్తామని శ్రీ మోదీ వెల్లడించారు. దీనిపై ప్రజలకు అభినందించడంతోపాటు ఈ మిషన్ నిర్వహణ బృందం సభ్యులకు, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.భారత్‌లో మారిషస్ ప్రధాని అధికారిక పర్యటన... ఈ సందర్భంగా కుదిరిన ఒప్పందాలు
September 11th, 02:10 pm
శాస్త్ర విజ్ఞానం, సాంకేతిక విజ్ఞాన రంగంలో సహకార అంశంలో భారత ప్రభుత్వంలోని సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికీ, మారిషస్ లో టెర్షియరీ ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ రీసెర్చి మంత్రిత్వశాఖ మధ్య అవగాహన ఒప్పందం.Mauritius is an important pillar of India’s ‘Neighbourhood First’ policy and Vision ‘Mahasagar’: PM Modi
September 11th, 12:30 pm
In his remarks at the joint press meet in Varanasi, PM Modi said that just like the uninterrupted flow of the Ganga in Kashi, the continuous stream of Indian culture has enriched Mauritius. He congratulated PM Ramgoolam and the people of Mauritius on the successful conclusion of the Chagos Agreement. The PM also announced a Special Economic Package for Mauritius to strengthen infrastructure, create jobs, and improve healthcare.ఫిజీ ప్రధానితో సంయుక్త పత్రికా ప్రకటన: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇంగ్లిషు పత్రికా ప్రకటనకు తెలుగు అనువాదం
August 25th, 12:30 pm
ఆ కాలంలో, మనం ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ కోఆపరేషన్‌ను (ఎఫ్ఐపీఐసీ) ప్రారంభించాం. ఈ కార్యక్రమం భారత్-ఫిజీ సంబంధాల్ని పటిష్ఠపరచడం ఒక్కటే కాకుండా, పూర్తి పసిఫిక్ రంగంతో మన బంధాలకు ఒక కొత్త శక్తిని కూడా అందించింది. ఈ రోజున, ప్రధాని శ్రీ రాబుకా పర్యటనతో మన సంబంధాలకు ఒక నూతన అధ్యాయాన్ని జత చేస్తున్నాం.భారత ప్రధానమంత్రి, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి సంయుక్త ప్రకటన సందర్భంగా ప్రధానమంత్రి చేసిన ప్రకటనకు తెలుగు అనువాదం
August 05th, 11:06 am
భారతదేశానికి వచ్చిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు, ఆయన బృందానికి మొదట హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నా. ఈ ఏడాది భారత్, ఫిలిప్పీన్స్ 75 ఏళ్ల దౌత్య సంబంధాల వేడుకలను జరుపుకొంటున్నాయి. ఈ నేపథ్యంలో వీరి పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. మన దౌత్య సంబంధాలు ఈమధ్యే ప్రారంభమైనవైనప్పటికీ, మన నాగరికతల బంధం చాలా పురాతనమైనది. ఫిలిప్పీన్స్ రామాయణ రూపం అయిన మహారదియా లవానా మన సాంస్కృతిక సంబంధాల ప్రత్యేకతను తెలియజెబుతుంది. ఇరుదేశాల జాతీయ పుష్పాలతో విడుదల చేసిన తపాలా స్టాంపులు మన స్నేహ పరిమళాన్ని ప్రతిబింబిస్తున్నాయి.భారత్, మాల్దీవుల దౌత్య సంబంధాల 60వ వార్షికోత్సవం సందర్భంగా స్మారక స్టాంపుల విడుదల
July 25th, 09:08 pm
భారత్, మాల్దీవుల దౌత్య సంబంధాలకు 60 ఏళ్లు నిండిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, మాల్దీవులు అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ ముయిజు స్మారక స్టాంపులను విడుదల చేశారు.