సోమనాథ్‌లో ఐఏఎఫ్‌కు చెందిన సూర్యకిరణ్ బృందం విస్తుగొలిపే విన్యాసాలను వీక్షించిన ప్రధానమంత్రి

May 11th, 04:13 pm

పవిత్రమైన సోమనాథ్ అమృత్ మహోత్సవం సందర్భంగా భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ బృందం ప్రదర్శించిన అద్భుతమైన విన్యాసాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తిలకించారు.

మెరుగైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై భారత్, వియత్నాం దేశాల సంయుక్త ప్రకటన

May 06th, 05:24 pm

భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి, వియత్నాం దేశాధ్యక్షుడు శ్రీ తో లామ్ 2026 మే 05 నుంచి మే 07 వరకు భారతదేశంలో అధికారిక పర్యటన చేశారు. ఈయనతో పాటు ఒక ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం వచ్చింది. వీరితో పాటు వ్యాపార ప్రతినిధుల బృందం కూడా పర్యటనలో పాల్గొంది.

మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ, డిజిటల్ సెన్సస్ 2027లో పాల్గొని దానిని విజయవంతం చేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

April 26th, 11:30 am

ఈ నెల మన్ కీ బాత్ ఎపిసోడ్‌లో, అణు, పవన విద్యుత్ రంగాలలో భారతదేశం సాధించిన ప్రగతిని ప్రధాని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. భగవాన్ బుద్ధుని బోధనలు, బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం, ప్రకృతి పరిరక్షణ, వెదురు రంగం, ప్రాచీన గ్రంథాలు, గణిత ఒలింపియాడ్ కార్యక్రమం వంటి పలు ముఖ్యమైన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. కొనసాగుతున్న డిజిటల్ సెన్సస్ ప్రచారం గురించి కూడా ప్రధాని మాట్లాడుతూ, ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Cabinet approves major expansion of Civil Enclave at Srinagar International Airport

February 24th, 04:21 pm

The Cabinet Committee on Economic Affairs, chaired by PM Modi, has approved the development of the Civil Enclave at Srinagar International Airport at an estimated cost of Rs. 1,677 crore. The state-of-the-art new terminal will reflect a harmonious blend of modern design and the rich cultural heritage of Kashmir. The project is expected to significantly boost tourism and economic growth in the region.

Prime Minister shares glimpses from Beating Retreat 2026

January 29th, 04:46 pm

PM Modi shared glimpses from the Beating Retreat 2026 today, saying that the performances by various performers were memorable. In a series of posts on X, the PM praised the performers for their discipline, harmony and the patriotic spirit they brought to the historic ceremony.

చిత్రాలలో: న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో 77వ గణతంత్ర దినోత్సవం

January 26th, 08:12 am

కర్తవ్య పథ్‌లో జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు భారతదేశ ఐక్యత, బలం మరియు వారసత్వాన్ని ప్రదర్శించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రీయ సమర స్మారకం వద్ద అమరవీరులకు నివాళులర్పించి ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు మరియు దేశం తన వీర సైనికుల పట్ల చూపించే కృతజ్ఞతను పునరుద్ఘాటించారు.

ఐఎన్ఎస్ విక్రాంత్‌లో దీపావళి వేడుకలను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

October 21st, 09:30 am

ఐఎన్ఎస్ విక్రాంత్‌లో భారతీయ నౌకాసేనతో కలిసి దీపావళి వేడుకలను నిర్వహించినప్పటి చిత్రాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు. ఈ రోజు ఒక అద్భుతమైన రోజు... అద్భుతమైన క్షణం.. అంతేకాకుండా అద్భుత సన్నివేశమని అన్నారు. ఒక వైపు విశాల మహాసముద్రం ఉంటే, మరో వైపు భరత మాత వీర సైనికుల అపార శక్తి కొలువుదీరిందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఒక వైపు దిగంతం, ఆనంతాకాశం ఉంటే, మరో వైపు ఐఎన్ఎస్ విక్రాంత్ బ్రహ్మాండ శక్తి ఉందనీ, ఇది అనంత శక్తికి ప్రతీక అనీ ఆయన చెప్పారు. సముద్రంపై ప్రసరిస్తున్న సూర్యకాంతి మెరుపులు దీపావళి వేళ వీర సైనికులు వెలిగించిన దీపాలా అన్నట్లుగా ఓ అపురూప దివ్య కాంతి మాలిక కనిపిస్తోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ సారి దీపావళిని భారతీయ నావికా దళ యోధుల నడుమ నిర్వహించుకోవడం తనకు లభించిన సౌభాగ్యమని ఆయన అన్నారు

అనువాదం: ఐఎన్ఎస్ విక్రాంత్‌‌లో సాయుధ దళాల మధ్య దీపావళి వేడుకలు చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

October 20th, 10:30 am

ఈ రోజు అద్భుతమైనది… ఈ క్షణం మరపురానిది.. ఈ దృశ్యం అసాధారణమైనది. నాకు ఒకవైపు విశాలమైన అనంత సముద్రం ఉంది.. మరొక వైపు భారత మాత ధీర సైనికుల అపారమైన సామర్థ్యం ఉంది. నాకు ఒక దిక్కు అనంతమైన విశ్వం, అంతులేని ఆకాశం ఉన్నాయి.. మరో దిక్కు అనంతమైన శక్తిని కలిగి ఉన్న అద్భుత ఐఎన్ఎస్ విక్రాంత్ ఉంది. సముద్రపు నీటిపై పడ్డ సూర్యకాంతి మెరుపు.. ఒక విధంగా మన వీర సైనికులు వెలిగించే దీపావళి దీపాల మాదిరిగా ఉంది. మన దివ్యమైన వెలుగుల మాలికలు ఇవి. ఈసారి నేను మన నావికాదళ యోధుల మధ్య దీపావళి పండుగను చేసుకోవటం నాకు కలిగిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను.

ఐఎన్ఎస్ విక్రాంత్ కేవలం యుద్ధనౌక కాదు... 21వ శతాబ్దంలో భారత కృషి, ప్రతిభ, ప్రభావం, నిబద్ధతలకు ఇది నిదర్శనం

October 20th, 10:00 am

ఈ రోజు ఐఎన్ఎస్ విక్రాంత్‌లో దీపావళి వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాయుధ దళాల సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ రోజు ఒక అద్భుతమైన రోజు... ఒక అద్భుతమైన క్షణం... ఇది ఒక అద్భుతమైన దృశ్యం అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఒక వైపు విశాలమైన సముద్రం... మరోవైపు ధైర్యవంతులైన భరతమాత సైనికుల అపారమైన బలం ఇక్కడ ఉందన్నారు. ఒక దిశ అనంతమైన ఆలోచనా పరిధిని... హద్దులులేని ఆకాశాన్ని ప్రదర్శిస్తుండగా, మరొక దిశలో అనంతమైన శక్తి గల ఐఎన్ఎస్ విక్రాంత్ అపార శక్తి ప్రదర్శితమవుతోందని ఆయన పేర్కొన్నారు. సముద్రంపై నుంచి కనిపిస్తున్న సూర్యకాంతి మెరుపులు ధైర్యవంతులైన మన సైనికులు వెలిగించిన దీపాల మాదిరిగా ప్రకాశిస్తూ.. దివ్య దీప మాలను తలపిస్తున్నాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ధైర్యసాహసాలకు మారుపేరైన భారత నావికాదళ సిబ్బందితో కలిసి ఈ దీపావళిని జరుపుకోవడం తనకు దక్కిన గౌరవమని ఆయన ఉద్ఘాటించారు.

వాయు సేన దినోత్సవం: వైమానిక దళాలు, వారి కుటుంబాలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

October 08th, 09:58 am

వాయు సేన దినోత్సవం సందర్భంగా వైమానికదళ యోధులతోపాటు వారి కుటుంబాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

శుభాన్షు శుక్లాతో ప్రధాని సంభాషణ

August 19th, 09:43 am

తప్పకుండా మీకో భిన్నమైన అనుభవమే కదా ఇది. మీ అనుభూతులను తెలుసుకోవాలనుకుంటున్నాను.

అంతరిక్ష యాత్రికుడు శ్రీ శుభాంశు శుక్లాతో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

August 19th, 09:42 am

రోదసీ యాత్రికుడు శ్రీ శుభాంశు శుక్లాతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్న న్యూ ఢిల్లీలో సమావేశమయ్యారు. అంతరిక్ష యానం అందించిన పరివర్తనాత్మక అనుభవాన్ని గురించి ప్రధాని ఈ సందర్భంగా మాట్లాడుతూ, అలాంటి ముఖ్య ప్రస్థానాన్ని చేపట్టి ముగించిన తరువాత ఎవరైనా మార్పును అనుభూతి చెందితీరుతారన్నారు. ఈ మార్పు తాలూకు అనుభవాన్ని వ్యోమగాములు ఎలా అర్థం చేసుకుంటారో తెలుసుకోవాలని ఉందని శ్రీ మోదీ అన్నారు. శ్రీ శుభాంశు శుక్లా జవాబిస్తూ, రోదసిలో స్థితి అచ్చంగా వేరేగా ఉంటుందని, భూమ్యాకర్షణ శక్తి లోపించడం దీనికి ఒక కీలక కారణమన్నారు.

భారత్‌లో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి అధికారిక పర్యటన: ఒప్పందాలు/ఎంవోయూలు

August 05th, 04:31 pm

భారత్, ఫిలిప్పీన్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య ఏర్పాటుపై ప్రకటన

ఆదంపూర్ వైమానిక స్థావరం వద్ద ధైర్యవంతులైన వైమానిక యోధులు, సైనికులతో ప్రధాన మంత్రి సంభాషణ తెలుగు అనువాదం

May 13th, 03:45 pm

ఈ నినాదం ఎంత శక్తిమంతమైనదో ఇప్పుడు ప్రపంచమంతటికీ తెలిసింది. భారత్ మాతా కీ జై! అన్నది కేవలం ఒక నినాదం మాత్రమే కాదు, భరతమాత గౌరవ ప్రతిష్ఠలను నిలబెట్టడం కోసం ప్రాణం పణంగా పెట్టే ప్రతి సైనికుడూ చేసే శపథం. ఈ నినాదం దేశం కోసం జీవించి అర్థవంతమైన సేవలందించాలనుకునే ప్రతీ పౌరుడి గొంతుక. యుద్ధభూమిలోను, కీలకమైన పోరాటంలోనూ ‘భారత్ మాతా కీ జై’ ప్రతిధ్వనిస్తుంది. భారత సైనికులు ‘భారత్ మాతా కీ జై’ అని నినదిస్తే శత్రువుల వెన్నులో వణుకు పుడుతుంది. భారత డ్రోన్లు శత్రు కోటలను కూల్చేసినప్పుడు, క్షిపణులు కచ్చితత్వంతో దాడి చేసినప్పుడు శత్రువుకు వినిపించే ఒకే నినాదం ‘భారత్ మాతా కీ జై’ . భారత్ అజేయ స్ఫూర్తిని శత్రువుకు చూపేలా- అత్యంత చీకటి రాత్రుల్లోనూ ఆకాశాన్ని దేదీప్యం చేసినప్పుడు శత్రువుకు కనిపించింది ఒక్కటే... అదే ‘భారత్ మాతా కీ జై! అణ్వస్త్ర బెదిరింపుల ముప్పులన్నింటినీ భారత బలగాలు నిర్మూలించిన వేళ భూమ్యాకాశాలంతటా ప్రతిధ్వనించే సందేశం – ‘భారత్ మాతాకీ జై’.

ధీరులైన వైమానిక యోధులు, సైనికులతో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సంభాషణ

May 13th, 03:30 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అదంపూర్‌లోని వైమానిక దళ కేంద్రాన్ని సందర్శించి ధీరులైన వైమానిక యోధులు, సైనికులతో సంభాషించారు. వారితో మాట్లాడుతూ.. ‘భారత్ మాతా కీ జై’ నినాదం ఎంత శక్తిమంతమైనదో ఇప్పుడు ప్రపంచమంతటికీ తెలిసిందన్నారు. ఇది కేవలం ఒక నినాదం మాత్రమే కాదని, భరతమాత గౌరవ ప్రతిష్ఠలను నిలబెట్టడం కోసం ప్రాణం పణంగా పెట్టే ప్రతి సైనికుడూ చేసే శపథమని వ్యాఖ్యానించారు. ఈ నినాదం దేశం కోసం జీవించి అర్థవంతమైన సేవలందించాలనుకునే ప్రతీ పౌరుడి గొంతుక అని స్పష్టం చేశారు. యుద్ధభూమిలోను, కీలకమైన పోరాటంలోనూ ‘భారత్ మాతా కీ జై’ ప్రతిధ్వనిస్తుందన్నారు. భారత సైనికులు ‘భారత్ మాతా కీ జై’ అని నినదిస్తే శత్రువుల వెన్నులో వణుకు పుడుతుందన్నారు. భారత డ్రోన్లు శత్రు కోటలను కూల్చేసినప్పుడు, క్షిపణులు కచ్చితత్వంతో దాడి చేసినప్పుడు శత్రువుకు వినిపించే ఒకే నినాదం ‘భారత్ మాతా కీ జై’ అంటూ భారత సైనిక పాటవాన్ని కొనియాడారు. భారత్ అజేయ స్ఫూర్తిని శత్రువుకు చూపేలా- అత్యంత చీకటి రాత్రుల్లోనూ ఆకాశాన్ని దేదీప్యం చేయగల సమర్థత మన దేశానికి ఉన్నదని ప్రధానమంత్రి శ్రీ మోదీ స్పష్టం చేశారు. అణ్వస్త్ర బెదిరింపుల ముప్పులన్నింటినీ భారత బలగాలు నిర్మూలించిన వేళ భూమ్యాకాశాలంతటా ప్రతిధ్వనించే సందేశం – ‘భారత్ మాతాకీ జై’ అని ఆయన ప్రకటించారు.

దేశ ప్ర‌జ‌లనుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్ర‌సంగం

May 12th, 08:48 pm

మొదటగా..భారత దేశ పరాక్రమ సేనకు, సరిహద్దు బలగాలకు, నిఘా సంస్థలకు, శాస్త్రవేత్తలకు, ప్రతి ఒక్క భారతీయుడి తరఫున సెల్యూట్ చేస్తున్నాను.

దేశ ప్ర‌జ‌లనుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్ర‌సంగం

May 12th, 08:00 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. భారత్‌ సంయమనాన్నే కాకుండా దాని సామర్థ్యం ఎంత బలీయమైనదో కూడా జాతి యావత్తూ నేడు ప్రత్యక్షంగా చూసిందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు శక్తిసామర్థ్యాలు వెల్లువెత్తే భారత సాయుధ దళాలతోపాటు నిఘా సంస్థలకు, శాస్త్రవేత్తలకు ప్రతి భారతీయుడి తరఫున ఆయన అభివందనం చేశారు. ఆపరేషన్ సిందూర్‌ లక్ష్య సాధనలో మన వీర సైనికులు ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలను ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. వారి పరాక్రమం, ప్రతికూలతలను అధిగమించగల సామర్థ్యం, మొక్కవోని దీక్షను కొనియాడారు. దేశంలోని ప్రతి తల్లి, సోదరి, కుమార్తెకు ఈ అసమాన ధైర్యసాహసాలు అంకితమని ఆయన ప్రకటించారు.

బీటింగ్ రీట్రీట్ వేడుకలో ప్రత్యేక క్షణాలివి.. మన స్వాతంత్య్ర సమరయోధులకు సాయుధ దళాల అద్వితీయ నివాళి ఇది: ప్రధాని

January 30th, 07:00 pm

బీటింగ్ రీట్రీట్ వేడుకలోని ముఖ్యమైన క్షణాలను కూర్చి రూపొందించిన వీడియోను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పోస్టు చేశారు. ఈ కార్యక్రమంలో సాయుధ దళాలు విశిష్ట రీతిలో స్వాతంత్య్ర సమరయోధులకు నివాళి అర్పించాయి.

బీటింగ్ రిట్రీట్ కార్యక్రమానికి హాజరైన ప్రధానమంత్రి

January 29th, 10:35 pm

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు బీటింగ్ రిట్రీట్ (ముగింపు వేడుక) కార్యక్రమానికి హాజరయ్యారు.

గుజరాత్ అమ్రేలీలో అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

October 28th, 04:00 pm

వేదికపైనున్న గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్ వ్రత్ గారూ, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, నా మంత్రివర్గ సహచరుడు శ్రీ సీ ఆర్ పాటిల్ గారూ, గుజరాత్ అక్కాచెల్లెళ్ళూ, అన్నదమ్ములూ, ముఖ్యంగా అమ్రేలీ సోదర సోదరీమణులారా..