ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) కింద ప్రైవేట్ భాగస్వామికి దీర్ఘకాలిక లైసెన్స్ ద్వారా నాగ్‌పూర్ అంతర్జాతీయ విమానాశ్రయ ఉన్నతీకరణ-ఆధునికీకరణకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం
May 13th, 03:41 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ సమావేశమైన మంత్రిమండలి భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ)తోపాటు మిహాన్ ఇండియా లిమిటెడ్ (ఎంఐఎల్) సంస్థకు ఇచ్చిన భూమి లీజు కాలాన్ని 06.08.2039 తర్వాత కూడా పొడిగించేందుకు ఆమోదం తెలిపింది. తద్వారా నాగ్‌పూర్ విమానాశ్రయాన్ని వాణిజ్య కార్యకలాపాల ఆరంభ తేదీ (సీఓడీ) నుంచి 30 ఏళ్ల పాటు ఒప్పంద సంస్థ ‘జీఎంఆర్ నాగ్‌పూర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్’ (జీఎన్‌ఐఏఎల్)కు నిర్వహణ లైసెన్స్ కింద ‘ఎంఐఎల్’ అప్పగిస్తుంది.ఏ ఐ ఆవిష్కరణ ఆవరణాన్ని బలోపేతం చేయడానికి ప్రతిష్టాత్మకమైన ఇండియా ఏ ఐ మిషన్‌కు క్యాబినెట్ ఆమోదం
March 07th, 08:40 pm
మేకింగ్ ఏ ఐ ఇన్ ఇండియా మరియు మేకింగ్ ఏ ఐ వర్క్ ఫర్ ఇండియా అనే దార్శనికతకు అనుగుణంగా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్, రూ.10,371.92 కోట్ల బడ్జెట్ వ్యయంతో సమగ్ర జాతీయ స్థాయి ఇండియాఏఐ మిషన్‌కు ఆమోదం తెలిపింది.