దీపావళి శుభాకాంక్షలు చెప్పిన యూఎస్ అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు
October 22nd, 08:25 am
దీపావళికి స్వయంగా ఫోన్ చేసి హృదయపూర్వక శుభాకాంక్షలను చెప్పినందుకు అమెరికా అధ్యక్షుడు గౌరవ డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మనసారా కృతజ్ఞతలు తెలియజేశారు.ట్రంప్ భావాలు.. సానుకూల దృక్పథం అభినందనీయం: ప్రధానమంత్రి
September 06th, 10:27 am
భారత్-అమెరికా సంబంధాలపై అధ్యక్షుడు ట్రంప్ భావాలు, సానుకూల దృక్పథం అభినందనీయమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్-అమెరికా మంచి భవిష్యత్తును.. సమగ్రమైన, ప్రాపంచిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా భారత్-అమెరికా సంయుక్త ప్రకటన
February 14th, 09:07 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో ఆ దేశాధ్యక్షుడు గౌరవనీయ డొనాల్డ్ జె.ట్రంప్ 2025 ఫిబ్రవరి 13న వాషింగ్టన్, డి.సి.లో ఆయనకు సాదర ఆతిథ్యమిచ్చారు.భారత్ - అమెరికా సంయుక్త పత్రికా సమావేశంలో ప్రధానమంత్రి మోదీ ప్రకటనకు తెలుగు అనువాదం
February 14th, 04:57 am
ముందుగా నాకు ఆత్మీయ స్వాగతాన్ని, ఆతిథ్యాన్ని అందించిన నా ప్రియ మిత్రుడు, అధ్యక్షుడు ట్రంప్‌నకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అధ్యక్షుడు ట్రంప్ తన నాయకత్వ పటిమ ద్వారా భారత్-అమెరికా మధ్య సంబంధాలను పునరుజ్జీవింపచేశారు.భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీతో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు భేటీ
January 06th, 07:43 pm
అమెరికా జాతీయ భద్రతా సలహాదారు శ్రీ జేక్ సల్లివాన్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని సోమవారం కలిశారు.నా స్నేహితుడు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడాను: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
November 06th, 10:50 pm
అమెరికా అధ్యక్షునిగా మరోసారి ఎన్నికైన శ్రీ డొనాల్డ్ ట్రంప్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మాట్లాడారు. శ్రీ ట్రంప్ సాధించిన అద్భుత విజయానికి శ్రీ మోదీ అభినందనలు తెలిపారు. భారత్ - అమెరికా సంబంధాలు వివిధ రంగాల్లో మరింతగా బలపడేటట్లు శ్రీ ట్రంప్ తో మళ్లీ కలిసి పని చేయడం కోసం నేను ఎదురుచూస్తున్నట్లు శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.డెలావర్ లోని విల్మింటన్ లో అమెరికా అధ్యక్షునితో ప్రధానమంత్రి సమావేశం
September 22nd, 02:02 am
భారత్ అమెరికాల భాగస్వామ్యానికి ముందుకు తీసుకుపోవడంలో అధ్యక్షుడు శ్రీ బైడెన్ అసమానమైన సేవలను అందించారంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందలు తెలిపారు. అమెరికాలో 2023 జూన్ లో తాను పర్యటించడాన్ని, అదే సంవత్సరం సెప్టెంబరు నెలలో భారతదేశంలో జరిగిన జి-20 నేతల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి అధ్యక్షుడు శ్రీ బైడెన్ భారత్ కు రావడాన్ని శ్రీ మోదీ ఆప్యాయంగా గుర్తు చేశారు. ఈ పర్యటనలు భారత్- అమెరికా భాగస్వామ్యాన్ని ఉపయోగకరంగా మార్చాయనీ, తగిన వేగాన్నీ అందించాయనీ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.