అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు ఆ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధాని
July 04th, 09:40 pm
అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకొని ఆ దేశ అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్-అమెరికా భాగస్వామ్యానికి ఉన్న శాశ్వతమైన బలాన్ని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య సంబంధాలు కేవలం వ్యూహాత్మక భాగస్వామ్యానికే పరిమితం కాకుండా ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన, ఇరు దేశ ప్రజల అపరిమిత సామర్థ్యాలపై గల నమ్మకం అనే ఉమ్మడి విలువల పునాదిపై ఈ బంధం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు.