ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానితో భేటీ అయిన ప్రధానమంత్రి

July 04th, 11:51 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని రెడ్ హౌస్‌లో ట్రినిడాడ్ టొబాగో రిపబ్లిక్ ప్రధానమంత్రి గౌరవ కమ్లా ప్రెసాద్ బిసెసాతో భేటీ అయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో ఘన విజయం సాధించి రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆమెకు అభినందనలు తెలిపారు. తనకు అపూర్వ స్వాగతం పలికినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ట్రినిడాడ్ అండ్ టొబాగో పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం

July 04th, 09:30 pm

గర్వించదగిన ప్రజాస్వామ్యానికీ, స్నేహపూర్వక దేశానికి ప్రతినిధులుగా ఎన్నికైన మీ ముందు నిలబడటం నాకు ఎంతో గౌరవంగా ఉంది.

ట్రినిడాడ్ అండ్ టొబాగో పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రసంగించిన ప్రధానమంత్రి

July 04th, 09:00 pm

ట్రినిడాడ్ అండ్ టొబాగో పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. సెనేట్ అధ్యక్షులు వాడే మార్క్, దిగువ సభ స్పీకర్ జగదేవ్ సింగ్ ఆహ్వానం మేరకు హాజరైన ఆయన.. ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించిన మొదటి ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించారు. భారతదేశం, ట్రినిడాడ్ అండ్ టొబాగో ద్వైపాక్షిక సంబంధాలలో ఇది ఒక కీలక కార్యక్రమంగా నిలిచిపోతుంది.