అనువాదం: ‘యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ’ సమావేశంలో ప్రధానమంత్రి మీడియా ప్రకటన
May 17th, 11:43 pm
కొద్దిసేపటి క్రితమే స్వీడన్ దేశపు అత్యున్నత పురస్కారమైన 'రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్'తో నన్ను గౌరవించారు. ఈ గౌరవం కేవలం నాది మాత్రమే కాదు.. ఇది 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవం.. భారత్-స్వీడన్ సంబంధాలను మరింత సుసంపన్నం చేసి వాటికి బలమైన పునాదిని వేసిన స్వీడన్‌లోని మన మిత్రులందరికీ దక్కిన గౌరవంగా భావిస్తున్నాను.స్వీడన్ అత్యున్నత పురస్కారం - రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్, డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్ ను అందుకున్న ప్రధానమంత్రి
May 17th, 11:13 pm
స్వీడన్ లో18వ శతాబ్దంలో ఏర్పాటైన దేశ అత్యంత పురాతన, విశిష్ట పురస్కారాలలో ఒకటైన ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్, డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్’ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందుకున్నారు. గాథెన్‌బర్గ్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో, స్వీడన్ యువరాణి క్రౌన్ ప్రిన్సెస్ విక్టోరియా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. అసాధారణ ప్రజా సేవకు, స్వీడన్‌తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో అందించిన విశేష కృషికి గుర్తింపుగా విదేశీ ప్రభుత్వ అధినేతలకు స్వీడన్ ఈ అత్యున్నత పురస్కారాన్ని అందిస్తుంది.స్వీడన్‌కు చేరుకున్న ప్రధాని మోదీ
May 17th, 06:09 pm
ప్రధాని మోదీ తన ఐదు దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్‌లోని గోథెన్‌బర్గ్‌కు చేరుకున్నారు. అక్కడ ఆయనకు స్వయంగా స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్‌సన్ ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోదీకి రక్షణగా స్వీడన్ తన యుద్ధ విమానాలను కూడా పంపింది. ఈ పర్యటన భారత్-స్వీడన్ సంబంధాల లోతు పెరుగుతున్న తీరును, కీలక రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడానికి ఉన్న ఉమ్మడి నిబద్ధతను నొక్కి చెబుతోంది.