స్వీడన్ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు చేపట్టిన ప్రధానమంత్రి
May 18th, 12:10 am
స్వీడన్‌లోని గోథెన్‌బర్గ్‌లో ఆ దేశ ప్రధానమంత్రి శ్రీ ఉల్ఫ్ క్రిస్టెర్సన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో స్వీడన్ యువరాణి విక్టోరియా కూడా పాల్గొన్నారు. స్వీడన్ రాజు కార్ల్ XVI గుస్టాఫ్, రాణి సిల్వియాల తరఫున ఆమె ప్రధానమంత్రి మోదీకి ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేశారు. రాజు కార్ల్ XVI గుస్టాఫ్ 80వ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి మోదీ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు.స్వీడన్ అత్యున్నత పురస్కారం - రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్, డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్ ను అందుకున్న ప్రధానమంత్రి
May 17th, 11:13 pm
స్వీడన్ లో18వ శతాబ్దంలో ఏర్పాటైన దేశ అత్యంత పురాతన, విశిష్ట పురస్కారాలలో ఒకటైన ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్, డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్’ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందుకున్నారు. గాథెన్‌బర్గ్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో, స్వీడన్ యువరాణి క్రౌన్ ప్రిన్సెస్ విక్టోరియా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. అసాధారణ ప్రజా సేవకు, స్వీడన్‌తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో అందించిన విశేష కృషికి గుర్తింపుగా విదేశీ ప్రభుత్వ అధినేతలకు స్వీడన్ ఈ అత్యున్నత పురస్కారాన్ని అందిస్తుంది.