రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడి భారత పర్యటన సందర‌్భంగా తీర్మానాలు
December 05th, 05:53 pm
ఒక దేశ పౌరులు మరొక దేశ భూభాగానికి తాత్కాలిక కార్మిక కార్యకలాపాలకు సంబంధించి భారత ప్రభుత్వం, రష్యా ఫెడరేషన్భారత్ - రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సదస్సు అనంతర సంయుక్త ప్రకటన
December 05th, 05:43 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు, రష్యా అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్ పుతిన్ 23వ భారత-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు 2025 డిసెంబర్ నాలుగు, ఐదు తేదీలలో భారత్ లో పర్యటించారు.న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరిగిన భారత్ – రష్యా బిజినెస్ ఫోరంలో ప్రధాని ప్రసంగం
December 05th, 03:45 pm
భారత్ - రష్యా బిజినెస్ ఫోరంలో, ఇంతపెద్ద ప్రతినిధి బృందంతో నేడు ఈ కార్యక్రమంలో పాల్గొని.. రష్యా అధ్యక్షుడు పుతిన్ చూపిన చొరవ అత్యంత కీలకమైనదిగా నేను భావిస్తున్నాను. మీ అందరికీ హృదయ పూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. నేడు మీ అందరి మధ్య ఉండడం చాలా సంతోషాన్నిస్తోంది. ఈ ఫోరంలో పాల్గొని తన విలువైన అభిప్రాయాలను పంచుకున్న నా మిత్రుడు, రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు. వ్యాపారం కోసం సరళీకృత సానుకూల యంత్రాంగాలను ఏర్పాటు చేస్తున్నాం. భారత్, యురేషియన్ ఎకనామిక్ యూనియన్ మధ్య ఎఫ్‌టీఏపై చర్చలు మొదలయ్యాయి.రష్యా అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్ పుతిన్‌తో కలసి భారత్-రష్యా బిజినెస్ ఫోరంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
December 05th, 03:30 pm
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ రోజు జరిగిన భారత్-రష్యా బిజినెస్ ఫోరంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రష్యా అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్ పుతిన్ కూడా పాల్గొన్నారు. తన ప్రసంగంలో అధ్యక్షుడు పుతిన్‌కు, దేశవిదేశాలకు చెందిన నాయకులకు, విశిష్ట అతిథులకు ప్రధాని నమస్కరించారు. అతి పెద్ద ప్రతినిధి బృందంతో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అధ్యక్షుడు పుతిన్ చూపిన చొరవను ఈ బిజినెస్ ఫోరం ప్రతిబింబిస్తుందని ప్రధాని అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ స్వాగతం పలుకుతూ.. వారి మధ్య ఉండటం తనకు ఆనందాన్నిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొని, విలువైన సూచనలను అందించిన తన స్నేహితుడు పుతిన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. వాణిజ్యానికి సరళమైన, విశ్వసనీయమైన వ్యవస్థలు ఏర్పాటవుతున్నాయని స్పష్టం చేశారు. అలాగే, భారత్, యురేషియన్ ఆర్థిక సంఘంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభమయ్యాయని తెలియజేశారు.రష్యా అధ్యక్షుడికి స్వాగతం పలికిన ప్రధానమంత్రి
December 05th, 10:30 am
‘‘ఈ రోజు సాయంత్రం, రేపూ మన మధ్య జరుగనున్న చర్చల కోసం నేను ఎదురుచూస్తున్నాను. భారత్, రష్యా మైత్రి కాల ప్రభావానికి తట్టుకొని నిలిచింది. ఈ మైత్రితో మన ప్రజలకు ఎంతో మేలు కలిగింది’’ అని శ్రీ మోదీ అన్నారు.