భారత్-నార్డిక్ మూడో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఐస్‌లాండ్ ప్రధానితో సమావేశమైన ప్రధానమంత్రి
May 19th, 06:44 pm
భారత్-నార్డిక్ మూడో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఓస్లో వేదికగా ఐస్‌లాండ్ ప్రధానమంత్రి శ్రీమతి క్రిస్ట్రన్ ఫ్రోస్టాడోట్టిర్‌తో సమావేశమయ్యారు.మూడో ఇండియా-నార్డిక్ సదస్సు నేపథ్యంలో ఫిన్లాండ్ ప్రధానితో భేటీ అయిన ప్రధానమంత్రి
May 19th, 06:42 pm
ఓస్లోలో జరుగుతున్న మూడో ఇండియా-నార్డిక్ సదస్సు నేపథ్యంలో 2026 మే 19న ఫిన్లాండ్ ప్రధాని శ్రీ పెటెరి ఓర్పోతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.3వ ఇండియా-నార్డిక్ సదస్సు సందర్భంగా డెన్మార్క్ తాత్కాలిక ప్రధాన మంత్రితో సమావేశమైన భారత ప్రధాన మంత్రి
May 19th, 06:40 pm
ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించిన ఉభయ దేశాల నాయకులు, ఉమ్మడి కార్యాచరణలో సాధించిన పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. పర్యావరణం, వాతావరణ మార్పుల రంగాల్లో సహకారానికి ప్రాధాన్యతనిస్తూ రెండు దేశాల్లో హరిత పరివర్తనకు తోడ్పడేలా ఉమ్మడి ప్రయత్నాలను ఏకీకృతం చేసే 'భారత్-డెన్మార్క్ హరిత వ్యూహాత్మక భాగస్వామ్యం’ సాధించిన పురోగతిని ఇరు నేతలు స్వాగతించారు. 2020లో ఈ హరిత వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రారంభమైనప్పటి నుంచి ఇరు దేశాల మధ్య క్రమం తప్పకుండా జరుగుతున్న ఉన్నత స్థాయి పర్యటనలు, చర్చలను గుర్తుచేసిన ఇరు దేశాల నాయకులు.. సరికొత్త- వర్ధమాన సాంకేతికతలు, కమ్యూనికేషన్స్, అధునాతన పరిశోధనలు, అంకురాలు, విద్యాసంబంధ మార్పిడి రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. రక్షణ, కృత్రిమ మేధస్సు రంగాల్లో సహకారంపై కూడా వారు చర్చించారు. గుజరాత్‌లోని 'గిఫ్ట్ సిటీ'లో తమ కార్యకలాపాలను ప్రారంభించాల్సిందిగా డెన్మార్క్ కంపెనీలను ప్రధాన మంత్రి ఆహ్వానించారు.భారత్-నార్డిక్ 3వ సదస్సు సందర్భంగా సంయుక్త మీడియా ప్రకటనలో ప్రధానమంత్రి ప్రకటన
May 19th, 04:25 pm
ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన, బహుపక్షవాదం పట్ల ఉమ్మడి నిబద్ధతే మనల్ని సహజ భాగస్వాములుగా చేస్తోంది. సాంకేతికత, సుస్థిర రంగాల్లో మనకున్న ఉమ్మడి ప్రాధాన్యతలు.. ఇరుదేశాల సంబంధాల్లో అపారమైన అవకాశాలను కల్పిస్తున్నాయి. అందువల్లే నార్డిక్ దేశాలతో మన సంబంధాల్లో శక్తిని, వేగాన్ని పెంచేందుకు ఎనిమిదేళ్ల కిందట ఈ వేదికను ఏర్పాటు చేశాం.మోదీ నార్వేకు చేరుకున్న ప్రధానమంత్రి
May 18th, 01:00 pm
నాలుగు దశాబ్దాలకు పైగా కాలంలో భారతదేశం నుండి నార్వేలో పర్యటిస్తున్న మొట్టమొదటి చారిత్రాత్మక పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ నార్వేలోని ఓస్లోకు చేరుకున్నారు. ఆయనకు ప్రధానమంత్రి జోనాస్ గార్ స్టోర్ ఘన స్వాగతం పలికారు.యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే మరియు ఇటలీ పర్యటనకు బయలుదేరే ముందు ప్రధాని ప్రకటన
May 15th, 07:56 am
ప్రధాని మోదీ 2026 మే 15 నుండి 20 వరకు యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే మరియు ఇటలీ దేశాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన వివిధ దేశాధినేతలతో సమావేశమై, కీలక రంగాలలో భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేసేందుకు చర్చలు జరుపుతారు. స్వీడన్‌లో జరిగే 'యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ' మరియు ఓస్లోలో జరిగే '3వ ఇండియా-నార్డిక్ సమ్మిట్'లో ఆయన పాల్గొనడం ఈ పర్యటనలోని ముఖ్యాంశాలు.ప్రధానమంత్రి యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే మరియు ఇటలీ పర్యటన (మే 15 - 20, 2026)
May 11th, 09:00 pm
ప్రధానమంత్రి మోదీ మే 15 నుండి మే 20, 2026 వరకు యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే మరియు ఇటలీలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను కలిసి వివిధ అంశాలపై అభిప్రాయాలను పంచుకుంటారు. నెదర్లాండ్స్‌లో, ప్రధానమంత్రి మోదీ రాజు విల్లెం-అలెగ్జాండర్‌ను కలిసి, ప్రధానమంత్రి రాబ్ జెట్టెన్‌తో చర్చలు జరుపుతారు. స్వీడన్‌లో, ఆయన ప్రధానమంత్రి క్రిస్టర్‌సన్‌తో చర్చలు జరుపుతారు. నార్వేలో, ఆయన రాజు హెరాల్డ్ Vను కలిసి, ప్రధానమంత్రి జోనాస్ గార్ స్టోర్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అనంతరం, ఆయన ఇటలీని సందర్శించి ప్రధానమంత్రి జార్జియా మెలోనితో చర్చలు జరుపుతారు.ఫిన్లాండ్ అధ్యక్షుడి పర్యటన నేపథ్యంలో భారత్-ఫిన్లాండ్ సంయుక్త ప్రకటన
March 05th, 08:03 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఈ నెల 4వ తేదీన ఢిల్లీ చేరుకున్న ఫిన్లాండ్ అధ్యక్షుడు గౌరవనీయ డాక్టర్ అలెగ్జాండర్ స్టూబ్ 7వ తేదీవరకూ భారత్‌లో పర్యటిస్తారు. ప్రస్తుత హోదాలో తొలిసారి మన దేశానికి వచ్చిన ఆయన ప్రధానంగా న్యూఢిల్లీ, ముంబయి నగరాలను సందర్శిస్తారు. ఆయనతోపాటు ఫిన్లాండ్ వాతావరణ-పర్యావరణ శాఖ మంత్రి శ్రీమతి సారీ ముల్తాలా, ఉపాధి శాఖ మంత్రి శ్రీ మాటియస్ మార్టినెన్ సహా ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తలతో కూడిన ప్రతినిధి బృందం కూడా ఈ పర్యటనలో పాల్గొంటోంది. ఈ నేపథ్యంలో 5వ తేదీన న్యూఢిల్లీలో 11వ దఫా రైసినా చర్చలను ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు స్టూబ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రధానోపన్యాసం చేశారు. భారత్ గత నెల ఢిల్లీలో నిర్వహించిన ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో ఫిన్లాండ్ ప్రధానమంత్రి శ్రీ పెట్టేరి ఓర్పో పాల్గొన్న నేపథ్యంలో అధ్యక్షుడు స్టూబ్ ఇప్పుడు పర్యటిస్తున్నారు.డెన్మార్క్ ప్రధాన మంత్రి మెట్టె ఫ్రెడరిక్సేన్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
April 15th, 06:02 pm
డెన్మార్క్ ప్రధాన మంత్రి గౌరవ మెట్టె ఫ్రెడరిక్ సన్‌తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఫోన్‌లో మాట్లాడారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రపంచ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారు.ఫ్రాన్స్అధ్యక్షుని తో ప్రధాన మంత్రి సమావేశం తాలూకు పత్రికా ప్రకటన
May 04th, 10:43 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోపెన్ హేగన్ లో రెండో ఇండియా-నార్డిక్ సమిట్ ముగించి తిరుగుప్రయాణం లో 2022వ సంవత్సరం మే 4వ తేదీ న ఫ్రాన్స్ కు ఆధికారిక యాత్ర ను జరిపారు.‘భారత-నార్డిక్’ రెండో శిఖరాగ్ర సదస్సు
May 04th, 07:44 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘భారత-నార్డిక్’ రెండో శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఆయనతోపాటు డెన్మార్క్, ఐస్‌లాండ్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ దేశాల ప్రధానమంత్రులు- మెట్టీ ఫ్రెడరిక్సన్, కాట్రిన్ జాకబడోట్టిర్, జోనాస్ గార్‌స్టోర్, మగ్దలీనా ఆండర్సన్, సనామారిన్ కూడా ఇందులో పాలుపంచుకున్నారు.ఫిన్ లాండ్ ప్రధాని తో ప్రధాన మంత్రి సమావేశం అయ్యారు
May 04th, 04:33 pm
ఇండియా-నార్డిక్ సమిట్ రెండోసారి జరిగిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోపెన్ హేగన్ లో ఫిన్ లాండ్ ప్రధాని సనా మారిన్ గారి తో సమావేశమయ్యారు. నేతలు ఇరువురి మధ్య ముఖాముఖి సమావేశం చోటుచేసుకోవడం ఇది ఒకటోసారి.ఐస్ లాండ్ ప్రధాని తో ప్రధాన మంత్రి సమావేశమయ్యారు
May 04th, 03:04 pm
రెండో ఇండియా-నార్డిక్ సమిట్ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోపెన్ హేగన్ లో ఐస్ లాండ్ ప్రధాని శ్రీ కెట్ రీన్ జేకోబ్ స్దోతిర్ తో ఒక ద్వైపాక్షిక సమావేశం లో పాల్గొన్నారు.స్వీడన్ ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి
May 04th, 02:28 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రెండో ఇండియా-నార్డిక్ సమిట్ సందర్భం లో కోపెన్ హేగన్ లో స్వీడన్ ప్రధాని మేగ్డెలీనా ఎండర్ సన్ తో సమావేశమయ్యారు. ఇద్దరు నేతల మధ్య జరిగినటువంటి ఒకటో సమావేశం ఇది.నార్వే ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి
May 04th, 02:25 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రెండో ఇండియా- నార్డిక్ సమిట్ జరిగిన సందర్భం లో కోపెన్ హేగన్ లో నార్వే ప్రధాని శ్రీ జోనస్ గహర్ స్టోర్ తో సమావేశమయ్యారు. ప్రధాని శ్రీ స్టోర్ 2021వ సంవత్సరం లో అక్టోబరు లో పదవీబాధ్యతల ను స్వీకరించిన తరువాత ఇద్దరు నేతల మధ్య ఇదే ఒకటో సమావేశం.డెన్మార్క్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పత్రికా ప్రకటన తెలుగు అనువాదం
May 03rd, 07:11 pm
గౌరవనీయ డెన్మార్క్ ప్రధానమంత్రిగారూ... మీ దేశంలో నాకు, మా ప్రతినిధి బృందానికి అద్భుత రీతిలో స్వాగతమిచ్చినందుకు ముందుగా మీకు, మీ బృందానికి ధన్యవాదాలు. ఈ అందమైన దేశంలో నాకిదే తొలి పర్యటన. గత సంవత్సరం అక్టోబరులో మీకు భారతదేశంలో స్వాగతం పలికే అవకాశం నాకు లభించింది. ఈ రెండు పర్యటనల నేపథ్యంలో మన స్నేహ సంబంధాలను మరింత సన్నిహితం, గతిశీలం చేసే వీలు కలిగింది. మన రెండు దేశాలూ ప్రజాస్వామ్యం, భావ ప్రకటన స్వేచ్ఛ, నియమబద్ధ పాలన తదితర విలువలను మాత్రమేగాక అనేక పరస్పర సహాయక బలాలను పంచుకుంటున్నాం.డెన్మార్క్ ప్రధాని పర్యటన సందర్భంగా కుదిరిన ఎంఓయులు, ఒప్పందాల జాబితా
October 09th, 03:54 pm
డెన్మార్క్ ప్రధాని పర్యటన సందర్భంగా కుదిరిన ఎంఓయులు, ఒప్పందాల జాబితాడెన్మార్క్ప్రధానమంత్రిగౌరవనీయ మెట్టే ఫ్రెడెరిక్‌సెన్‌తో కలిసి నిర్వహించిన సంయుక్త పత్రికా ప్రతినిధుల సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రసంగానికి సంక్షిప్త తెలుగు అనువాదం
October 09th, 01:38 pm
కరోనా మహమ్మారికి ముందు ఈ హైదరాబాద్ హౌస్‌లో రెగ్యులర్‌గా వివిధ దేశాల అధిపతులు, వివిధ ప్రభుత్వాల అధిపతులకు స్వాగత కార్యక్రమాలు క్రమంతప్పకుండా ఉంటూ ఉండేవి. అయితే గత 18-20 నెలలుగా ఇది ఆగిపోయింది, డానిష్ ప్రధానమంత్రి పర్యటనతో మళ్లీ ఈరోజు కొత్త ఆరంభం జరిగింది.భారతదేశం మరియు నార్డిక్ దేశాల మధ్య శిఖర సమ్మేళనం సందర్భంగా సంయుక్త పత్రికా ప్రకటన
April 18th, 12:57 pm
ఈ రోజు స్టాక్ హోమ్ లో భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, డెన్మార్క్ ప్రధాని శ్రీ లార్స్ లోకే రస్ ముసెన్, ఫిన్ లాండ్ ప్రధాని శ్రీ జుహా శిపిల, ఐస్‌లాండ్ ప్రధాని శ్రీ కత్రిన్ జాకబ్స్ దాతిర్ మరియు నార్వే ప్రధాని శ్రీ ఎర్‌నా సోల్‌బర్గ్, స్వీడన్ ప్రధాని శ్రీ స్టీఫన్ లోఫ్‌వెన్ లు ఒక శిఖర సమ్మేళనంలో పాలుపంచుకొన్నారు. ఈ శిఖర సమ్మేళనానికి స్వీడిష్ ప్రధాని మరియు భారతదేశ ప్రధాన మంత్రి ఆతిథేయి లుగా వ్యవహరించారు.స్వీడన్ లో భారత ప్రధానమంత్రి పర్యటన (16-17 ఏప్రిల్ 2018)
April 17th, 11:12 pm
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా, 'ఇండియా-నార్డిక్ సమ్మిట్: షేర్డ్ వాల్యూస్, మ్యూచువల్ ప్రోస్పెరిటీ' అనే శీర్షికతో భారతదేశం మరియు స్వీడన్ ఇండియా-నార్డిక్ సదస్సును నిర్వహించాయి. డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్ మరియు నార్వే ప్రధానమంత్రులు ఈ సదస్సుకు హాజరయ్యారు. నార్డిక్ దేశాలతో భారతదేశం గణనీయమైన ఆర్థిక సంబంధాలను కలిగి ఉంది. వార్షిక ఇండియా-నోర్డిక్ ట్రేడ్ సుమారు 5.3 బిలియన్ డాలర్లుగా ఉంది. భారతదేశంలో సంచిత నార్డిక్ ఎఫ్డిఐకి 2.5 బిలియన్ డాలర్లు.