న్యూజిలాండ్‌లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగం
July 11th, 01:15 pm
‘మళ్లీ ఏ పుష్కరానికో...’ అంటుంటాం భారత్‌లో మనం. గత నలభై ఏళ్లలో భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ రావడం ఇదే మొదటిసారి. దీనిని నా అదృష్టంగా భావిస్తున్నాను. న్యూజిలాండ్ ప్రజలందరికీ, మీలో ప్రతి ఒక్కరికీ 140 కోట్ల మంది భారతీయులు అందించిన హృదయపూర్వక శుభాకాంక్షలను మోసుకొచ్చాను.న్యూజిలాండ్‌లో ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి
July 11th, 12:35 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆక్లాండ్‌లో జరిగిన “కియా ఓరా మోదీ” కార్యక్రమంలో న్యూజిలాండ్‌లోని ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన భారీ సభనుద్దేశించి ప్రసంగించారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి గౌరవ క్రిస్టోఫర్ లక్సన్ ప్రత్యేక అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆత్మీయత, శక్తి, ఉత్సాహం నిండిన 10,000 మందికి పైగా ప్రవాస భారతీయులు ఈ సభలో పాల్గొన్నారు.అధికారిక విందు కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
July 11th, 12:32 pm
గతేడాది భారత్‌లో ప్రధాని లక్సన్ చేపట్టిన పర్యటన.. మన ద్వైపాక్షిక సంబంధాల్లోని అన్ని అంశాల్లోనూ కొత్త శక్తిని నింపింది. ఆయన నాయకత్వమూ, స్పష్టమైన దార్శనికతా, దృఢమైన అంకితభావమూ.. భారత్, న్యూజిలాండ్ మధ్య ఉన్న స్నేహానికి కొత్త వేగాన్నీ, నూతన దిశనూ అందించాయి. గత నలభై ఏళ్లలో భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. నాకంటే ముందు వచ్చిన వారు నా కోసం ఎన్నో మంచి పనులను వదిలి వెళ్లారు. వాటిని పూర్తి చేసే భాగ్యం నాకు దక్కిందని నేను తరచూ చెబుతూ ఉంటాను. మిత్రులారా, ఇది మన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతోంది.''భారత్-న్యూజిలాండ్: ఒక విజయవంతమైన భాగస్వామ్యం'' ఇతివృత్తంతో న్యూజిలాండ్ ప్రధాని నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన ప్రధానమంత్రి
July 11th, 12:30 pm
భారత్-న్యూజిలాండ్: ఒక విజయవంతమైన భాగస్వామ్యం ఇతివృత్తంతో న్యూజిలాండ్ ప్రధానమంత్రి గౌరవ క్రిస్టోఫర్ నిర్వహించిన ప్రత్యేక విందు కార్యక్రమానికి ప్రధానమంత్రి శ్రీ మోదీ హాజరయ్యారు. రాజకీయ, వ్యాపార, పారిశ్రామిక, విద్యా, సాంకేతిక, క్రీడా, కళా రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.న్యూజిలాండ్ ప్రధానితో సమావేశమైన ప్రధానమంత్రి
July 11th, 08:09 am
ఆక్లాండ్‌లోని గవర్నమెంట్ హౌస్‌లో న్యూజిలాండ్ ప్రధానమంత్రి గౌరవ క్రిస్టోఫర్ లక్సన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ రోజు గవర్నమెంట్ హౌస్‌కు విచ్చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి సాంప్రదాయిక మావోరీ స్వాగతం లభించింది. ఈ వేడుకలో శాంతి, గౌరవం, స్వాగతానికి ప్రతీకగా నిలిచే సాంప్రదాయిక మావోరీ ఆచారాలను ప్రదర్శించారు. సాంప్రదాయిక స్వాగతం అనంతరం, ప్రధానమంత్రి ఆ దేశ సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు.భారత్-న్యూజిలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం: భవిష్యత్ ప్రణాళిక-2030
July 11th, 08:06 am
భారత్-న్యూజిలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై రెండు దేశాల ప్రధానమంత్రులు సంయుక్త ప్రకటన చేశారు. ఈ మేరకు న్యూజిలాండ్ రాజధాని ఆక్లాండ్‌లో ఇవాళ సమావేశమైన అనంతరం వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ భాగస్వామ్యాన్ని మరో నాలుగేళ్లలో మరింత బలోపేతం చేసే లక్ష్యంతో 2030 దాకా ఒక ఉమ్మడి ప్రణాళిక అమలుకు వారిద్దరూ ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగా ఆరు మూలస్తంభాల ప్రాతిపదికన వివిధ రంగాలలో అనేక కార్యక్రమాలను అమలు చేస్తారు.భారత్-న్యూజిలాండ్ సంయుక్త ప్రకటన
July 11th, 07:59 am
న్యూజిలాండ్ ప్రధానమంత్రి గౌరవనీయ క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 జులై 10, 11 తేదీల్లో న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో అధికారికంగా పర్యటిస్తున్నారు. గత 40 ఏళ్లలో భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ చరిత్రాత్మక ఘట్టం రెండు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహం, సహకారంలో ఒక కొత్త దిశకు మార్గనిర్దేశం చేస్తోంది.అనువాదం: భారత - న్యూజిలాండ్ ప్రతినిధుల స్థాయి చర్చల ప్రారంభ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
July 11th, 07:00 am
రాత్రంతా మీ మంత్రి గారు నాతోనే ఉన్నందుకు ధన్యవాదాలు. దాదాపు 40 సంవత్సరాల తర్వాత ఒక భారత ప్రధాని న్యూజిలాండ్‌ను సందర్శించడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. మీ ఆర్థిక రాజధానిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా భారత్-న్యూజిలాండ్ సంబంధాలకు సరికొత్త ఉత్తేజాన్ని ఇచ్చే అవకాశాన్ని మీరు కల్పించారు. దీనికి నేను మీకు మనఃపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.