భారత్ – మారిషస్ సంయుక్త ప్రకటన: ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ

September 11th, 01:53 pm

భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు గౌరవ మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రాం గూలం భారత్‌లో అధికారికంగా పర్యటించారు. విస్తృత శ్రేణి ద్వైపాక్షిక అంశాలపై ప్రధానమంత్రులిద్దరూ ఫలవంతంగా చర్చించారు. మారిషస్ ప్రభుత్వ అభ్యర్థనల ఆధారంగా.. భారత్, మారిషస్ సంయుక్తంగా కింది ప్రాజెక్టుల అమలుకు సూత్రప్రాయంగా అంగీకరించాయి.

మారిషస్ ప్రధానమంత్రితో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

June 24th, 09:54 pm

మారిషస్ ప్రధానమంత్రి గౌరవనీయ డాక్టర్ నవీన్‌చంద్ర రామ్‌గులామ్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం (ఈ నెల 24న) టెలిఫోన్‌లో మాట్లాడారు.

మారిషస్‌లో అటల్ బిహారీ వాజ్‌పేయీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ అండ్ ఇన్నొవేషన్‌ను కలిసి ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, మారిషస్ ప్రధాని శ్రీ నవీన్‌చంద్ర రాంగులామ్

March 12th, 03:13 pm

మారిషస్‌లోని రెడుయిట్‌లో అటల్ బిహారీ వాజ్‌పేయీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ అండ్ ఇన్నొవేషన్‌ను మారిషస్ ప్రధాని శ్రీ నవీన్‌చంద్ర రాంగులామ్‌తోపాటు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. భారత్-మారిషస్ అభివృద్ధి భాగస్వామ్యంలో ఓ భాగమైన ఈ ముఖ్య ప్రాజెక్టు మారిషస్‌లో సామర్థ్యాలను పెంచే కార్యక్రమాల పట్ల భారత్‌ ఎంత నిబద్ధతతో ఉందీ చెప్పకనే చెబుతోంది.

మారిషస్ జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ప్రదానం

March 12th, 03:12 pm

వేడుకల సందర్భంగా ప్రధాని మోదీని మారిషస్ అధ్యక్షుడు శ్రీ ధరంబీర్ గోఖుల్ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్’ (జీసీఎస్కే.)తో సత్కరించారు. శ్రీ మోదీ ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయ నేత కావడం విశేషం.

మారిషస్ అత్యున్నత పౌర పురస్కారం ‘గ్రాండ్ కమాండర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ (జీసీఎస్‌కే)ను అందుకొన్న సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

March 12th, 03:00 pm

మారిషస్‌ అత్యున్నత జాతీయ పురస్కారాన్ని ఇచ్చినందుకు నేను నా హృదయపూర్వక కృతజ్ఞ‌తను తెలియజేస్తున్నాను. ఇది నా ఒక్కరికి లభించిన గౌరవం ఎంతమాత్రం కాదు. ఇది నూటనలభై కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవం. ఇది భారత్, మారిషస్‌ల మధ్య వందల సంవత్సరాలుగా నెలకొన్న సాంస్కృతిక, చారిత్రక సంబంధాలకు లభించిన ఒక కానుక, ఒక ప్రశంస. ప్రాంతీయ శాంతి, ప్రగతి, భద్రత, నిరంతర అభివృద్ధి సాధనల పట్ల మన నిబద్ధతకు లభించిన గుర్తింపు. మరి, ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల సమష్టి ఆశలు, ఆకాంక్షల ప్రతీక అని కూడా చెప్పవచ్చు. నేను ఈ అవార్డును పూర్తి నమ్రతతో, కృతజ్ఞ‌తతో స్వీకరిస్తున్నాను. వందల ఏళ్ల కిందట భారత్ నుంచి మారిషస్‌కు వచ్చిన మీ పూర్వికులకు, వారి తదుపరి తరాల వారికి దీనిని అంకితం చేస్తున్నాను. వారు ఎంతో కష్టపడి మారిషస్ అభివృద్ధిలో ఓ సువర్ణాధ్యాయాన్ని లిఖించారు, ఈ దేశంలో చైతన్యభరిత వైవిధ్యానికి కూడా తోడ్పడ్డారు. ఈ పురస్కారాన్ని నేనొక బాధ్యతగా కూడా స్వీకరిస్తున్నాను. భారత్-మారిషస్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చడానికి అవసరమైన ప్రతి ఒక్క ప్రయత్నాన్ని చేస్తామన్న మా నిబద్ధతను నేను పునరుద్ఘాటిస్తున్నాను.

Our vision for the Global South will go beyond SAGAR-it will be MAHASAGAR: PM Modi

March 12th, 12:30 pm

During his visit to Mauritius, PM Modi emphasized the deep-rooted ties between the two nations, announcing an 'Enhanced Strategic Partnership' with PM Ramgoolam. India will assist in building a new Parliament, modernizing infrastructure, and strengthening security. With a focus on digital innovation, trade, and cultural ties, PM Modi reaffirmed India’s commitment to regional growth and cooperation.

మారిషస్ ప్రధానమంత్రి తన గౌరవార్థం ఏర్పాటు చేసిన విందులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

March 12th, 06:15 am

గౌరవనీయ మారిషస్ ప్రధానమంత్రి శ్రీ నవీన్ చంద్ర రాంగూలాం, శ్రీమతి వీణా రాంగూలాం, ఉప ప్రధానమంత్రి శ్రీ పాల్ బెరెంజే గార్లూ, గౌరవనీయ మంత్రులూ, సోదర సోదరీమణులు అందరికీ నమస్కారం, బాన్ జూర్!

మారిషస్‌లోని భారతీయులతో సమావేశంలోప్రధానమంత్రి ప్రసంగం

March 12th, 06:07 am

పదేళ్ల కిందట ఇదే తేదీన నేను మారిషస్‌ పర్యటనకు వచ్చేనాటికి ఓ వారం ముందే మేం హోలీ పండుగ చేసుకున్నాం. అప్పుడు భారత్‌ నుంచి హోలీ వేడుకల సంరంభాన్ని నాతో మోసుకొచ్చాను. అయితే, ఈసారి వర్ణరంజిత హోలీ సంరంభాన్ని మారిషస్‌ నుంచి మన దేశానికి తీసుకెళ్తాను. ఈ నెల 14వ తేదీన హోలీ కాబట్టి.. వేడుకలకు మరొక రోజు మాత్రమే ఉంది.

మారిషస్‌లో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

March 11th, 07:30 pm

మారిషస్ ప్రధాని శ్రీ నవీన్ చంద్ర రాంగులాంతో పాటు భారత్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మారిషస్‌లోని ట్రాయోన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటైన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ సముదాయాన్ని, ఇండియా మిత్రులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వృత్తినిపుణులు, సామాజిక సంస్థలు, సాంస్కృతిక సంస్థలు, వ్యాపార రంగ ప్రముఖులు సహా భారతీయ ప్రవాసులు చాలా మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే మారిషస్ మంత్రులు అనేక మందితోపాటు పార్లమెంట్ సభ్యులు, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

మారిషస్ అధ్యక్షుడితో భారత ప్రధాని భేటీ

March 11th, 04:01 pm

మారిషస్ అధ్యక్షుడు శ్రీ ధరమ్ బీర్ గోఖూల్ తో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్టేట్ హౌజ్ లో నేడు భేటీ అయ్యారు.

మారిషస్ అధ్యక్షుడు శ్రీ ధరంబీర్ గోకుల్ ఆతిథ్యానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గౌరవ పలుకులు

March 11th, 03:06 pm

మారిషస్ జాతీయ దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాలుపంచుకోవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను.

సర్ శివూసాగర్ రాం గులామ్, సర్ అనిరుద్ధ్ జగన్నాథ్‌ సమాధుల వద్ద ప్రధానమంత్రి పుష్పాంజలి

March 11th, 03:04 pm

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు పేంప్లేముసెస్‌లోని సర్ శివూసాగర్ రాంగులామ్ బొటానిక్ గార్డెన్స్‌లో సర్ శివూసాగర్ రాంగులామ్, సర్ అనిరుద్ధ్ జగన్నాథ్‌ల సమాధులను సందర్శించి శ్రద్ధాంజలి సమర్పించారు. పుష్పాంజలి కార్యక్రమంలో ప్రధానిని... మారిషస్ ప్రధానమంత్రి శ్రీ నవీన్‌చంద్ర రాంగులామ్ అనుసరించారు. మారిషస్ ప్రగతిలోనూ, భారత్-మారిషస్ సంబంధాలకు బలమైన పునాదిని వేయడంలోనూ ఈ ఇద్దరు నేతల సుదీర్ఘ వారసత్వాన్ని ప్రధాని శ్రీ మోదీ ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకొన్నారు.