భారత సంతతికి చెందిన ప్రముఖులతో ప్రధాని సంభాషణ
February 08th, 02:48 pm
మలేషియాలోని పలువురు ఎంపిక చేసిన భారత సంతతి ప్రముఖులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు. వీరిలో మంత్రులు, సెనెటర్లు, పార్లమెంటు సభ్యులతోపాటు ఆజాద్ హింద్ ఫౌజ్ (భారత జాతీయ సేన - ఐఎన్ఏ)కు చెందిన వీర యోధులు కూడా ఉన్నారు. డిజిటల్ శాఖ మంత్రి తువాన్ గోబింద్ సింగ్ దేవ్, మానవ వనరుల శాఖ మంత్రి దాతో శ్రీ రమణన్ రామకృష్ణన్, ప్రధానమంత్రి విభాగంలో డిప్యూటీ మంత్రి తువాన్ ఎం. కులశేఖరన్, దేశ ఐక్యత డిప్యూటీ మంత్రి తువాన్ ఆర్. యునేశ్వరన్ తదితరులు భారత ప్రధానమంత్రితో భేటీ అయ్యారు.మలేషియా ప్రధానమంత్రితో భారత ప్రధానమంత్రి అధికారిక చర్చలు
February 08th, 11:19 am
ఈ రోజు పెర్దానా పుత్రా కాంప్లెక్స్‌లో మలేషియా ప్రధానమంత్రి గౌరవ దాతోసేరి అన్వర్ ఇబ్రహీం భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి సంప్రదాయ పూర్వక స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం అధికారిక నివాసం సెరి పెర్దానాలో ప్రతినిధి బృందం స్థాయిలో చర్చలు జరిపారు.ప్రధానమంత్రి మలేషియా పర్యటన సందర్భంగా ఒప్పందాలు, ప్రకటనలు
February 08th, 11:05 am
భారత్ - మలేషియా ప్రభుత్వాల మధ్య ఆడియో - విజువల్ సహనిర్మాణ ఒప్పందంమలేషియా ప్రధానితో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా భారత ప్రధాని ప్రకటన
February 08th, 08:35 am
ముందుగా నాకు ఆత్మీయంగా స్వాగతం పలికిన నా ఆప్తమిత్రుడు, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. గతేడాది ఆసియాన్ సదస్సు సందర్భంగా మలేషియాను సందర్శించలేకపోయాను. కానీ వీలైనంత తొందరలోనే మలేషియాకు వస్తానని నా ప్రియమిత్రుడికి అప్పట్లో మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారం.. 2026లో నా తొలి విదేశీ పర్యటనలో భాగంగా ఈ రోజు మలేషియాలో ఉన్నాను.మలేషియాలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధికారిక పర్యటన సందర్భంగా విడుదల చేసిన భారత్, మలేషియా ఉమ్మడి ప్రకటన
February 08th, 08:30 am
మలేషియా ప్రధానమంత్రి శ్రీ దాతో సెరీ అన్వర్ ఇబ్రహీం ఆహ్వానం మేరకు భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 ఫిబ్రవరి 7 నుంచి 8 వరకు మలేషియాలో అధికారిక పర్యటన చేపట్టారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య శతాబ్దాల నాటి నాగరికత సంబంధాలపై ఆధారపడిన ఉన్న లోతైన స్నేహం, సుదీర్ఘ ప్రజల మధ్య బంధాలను తెలియజేసింది. భారత్-మలేషియా 'సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని' మరింత పటిష్ఠం చేయటం, విస్తరించడానికి ఇరు దేశాల నాయకులకు ఉన్న ఉమ్మడి నిబద్ధతను ఈ పర్యటన పునరుద్ఘాటించింది.మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంతో ప్రతినిధి స్థాయి చర్చల సందర్భంలో ప్రధానమంత్రి ప్రసంగం
February 08th, 08:20 am
నా మిత్రులు... గౌరవనీయ ప్రధానమంత్రికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకూ, నా ప్రతినిధి బృందానికి లభించిన స్వాగతం... కేవలం కొన్ని గంటల్లోనే సంప్రదాయాలను మించిన మలేషియా ప్రజల జీవన విధానాన్ని మాకు పరిచయం చేసిన విధానం... ప్రతి కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడం నా జ్ఞాపకాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. దీనికి నేను మనస్ఫూర్తిగా నా ప్రశంసలు తెలియజేస్తున్నాను. స్నేహానికి నిజమైన అర్థాన్నీ, అలాగే దానిలోని గొప్పతనాన్నీ నేను నిజంగా అనుభూతి చెందాను. దాని కోసం మీకు నా కృతజ్ఞతలు.మలేషియాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని
February 07th, 03:59 pm
ముందుగా ఈ సామాజిక వేడుకలో పాల్గొన్న నా ప్రియ మిత్రుడు ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం గారికి నా ధన్యవాదాలు. ఇప్పుడే చేసిన ప్రసంగంలో భారత్-మలేషియా స్నేహానికి ఉన్న విస్తృతి, భవిష్యత్తు సామర్థ్యం గురించి ఆయన చెప్పిన మంచి మాటలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.ఆజాదీ కా అమృత్ మహోత్సవ్
February 07th, 03:15 pm
మలేషియాలోని కౌలాలంపూర్‌లో ఇవాళ జరిగిన సామాజిక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. సభకు హాజరైన వారిని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ.. అక్కడ లభించిన ఘన స్వాగతం మన ఉమ్మడి సంస్కృతిలోని అద్భుతమైన వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. ఈ వేడుకలో పాల్గొన్న తన ప్రియ మిత్రుడు, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం స్వయంగా విమానాశ్రయానికి వచ్చి తనకు స్వాగతం పలకడమే కాకుండా.. ఆయన కారులోనే ఈ కార్యక్రమానికి తీసుకువచ్చారని శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. ఈ ప్రత్యేక మర్యాదలు భారత్‌పై, ఇక్కడున్న ప్రజలపై ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంకు ఉన్న ప్రేమ, గౌరవాన్ని చాటుతున్నాయి’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.