మలేషియాలో అగ్రశ్రేణి వ్యాపారవేత్తలతో ప్రధాని భేటీ
February 08th, 02:50 pm
మలేషియాకు చెందిన నలుగురు అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు. పెట్రోనాస్ అధినేత, ఆ గ్రూప్ సీఈవో తాన్ శ్రీ తెంగ్కు మహమ్మద్ తౌఫిక్, బెర్జాయా కార్పొరేషన్ బెర్హాద్ వ్యవస్థాపకుడు తాన్ శ్రీ దాతో సేరి విన్సెంట్ తాన్ చీ యియున్, ఖజానా నేషనల్ బెర్హాద్ మేనేజింగ్ డైరెక్టర్ దాతో అమీరుల్ ఫైసల్ వాన్ జహీర్, ఫైసన్ ఎలక్ట్రానిక్స్ వ్యవస్థాపకుడు దాతో పువా ఖైన్ సెంగ్‌తో ఆయన భేటీ అయ్యారు.గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మలేషియాలోని కౌలాలంపూర్‌కు అధికారిక పర్యటన
February 04th, 04:17 pm
మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం ఆహ్వానం మేరకు, ప్రధానమంత్రి మోదీ 2026 ఫిబ్రవరి 7 నుండి 8 వరకు మలేషియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా, ప్రధానమంత్రి మలేషియా ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు జరిపి, ఇరు దేశాల మధ్య సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షిస్తారు. ఆయన భారతీయ సమాజ సభ్యులతో పాటు పరిశ్రమ మరియు వ్యాపార ప్రతినిధులతో కూడా సమావేశమవుతారు మరియు 10వ భారతదేశం-మలేషియా సీఈఓ ఫోరంలో పాల్గొంటారు.