కొరియా అధ్యక్షునితో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా ప్రధానమంత్రి ప్రకటన

April 20th, 01:05 pm

భారతదేశానికి తొలిసారి వచ్చిన అధ్యక్షుడు లీని స్వాగతించడం ఎంతో సంతోషంగా ఉంది. . ఆయన జీవితం పట్టుదల, సేవ, అంకితభావాలకు స్ఫూర్తిదాయక నిదర్శనం. ఆయన ఎదుర్కొన్న ప్రతి సవాలు ప్రజలకు సేవ చేయాలనే ఆయన సంకల్పాన్ని మరింత బలపరిచింది. ఇది ఆయన తొలి భారత పర్యటన అయినప్పటికీ, మా మొదటి సమావేశం లోనే దేశంపై ఆయనకున్న అభిమానం, ఆత్మీయత స్పష్టంగా కనిపించింది.

భారతదేశం-కొరియా వ్యాపార శిఖర సమ్మేళనంలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

February 27th, 11:00 am

మీ అందరినీ ఇక్కడ కలుసుకొంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. భారతదేశంలో భారీ సంఖ్యలో కొరియా కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తూ ఉండడం నిజంగా ఒక ప్రపంచ గాథ వంటిది. మీ అందరినీ ఆహ్వానించడానికి ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకుంటున్నాను.