కెన్యా మాజీ ప్రధానమంత్రి రైలా ఒడింగా మృతికి సంతాపం తెలిపిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 15th, 02:41 pm
కెన్యా మాజీ ప్రధానమంత్రి రైలా ఒడింగా మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ‘‘నా ప్రియ స్నేహితుడు, కెన్యా మాజీ ప్రధానమంత్రి శ్రీ రైలా ఒడింగా మరణ వార్త తెలిసి ఎంతో బాధ పడ్డాను. ఆయన ఓ సమున్నత రాజనీతిజ్ఞుడే కాక భారత్‌కు ఆప్త మిత్రుడు కూడా. గుజరాత్‌కు నేను ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నుంచీ ఆయన నాకు బాగా తెలుసు.. మా అనుబంధం ఏళ్ల తరబడి కొనసాగింది’’ అని శ్రీ మోదీ అన్నారు. భారత్ అన్నా, మన దేశ సంస్కృతి.. మన విలువలు.. మన దేశ ప్రాచీన జ్ఞానమన్నా శ్రీ రైలా ఒడింగాకు ఎంతో ప్రేమ. ఈ ప్రేమకు నిదర్శనం భారత్-కెన్యా సంబంధాలను బలపరచడానికి ఆయన నడుం బిగించి చేసిన కృషే‘‘ అని శ్రీ మోదీ అన్నారు.