జపాన్ కొత్త ప్రధాని సానే తాకాయిచీకి అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 21st, 11:24 am
జపాన్ ప్రధానమంత్రి పదవికి సానే తాకాయిచీ ఎన్నికైన సందర్భంగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక అభినందనలను తెలియజేశారు. ‘ఎక్స్’లో ప్రధానమంత్రి శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ భారత్, జపాన్‌ల ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్నీ, ప్రపంచ స్థాయి భాగస్వామ్యాన్నీ మరింత బలపరుచుకోవాలన్న నిబద్ధతను పునరుద్ఘాటించారు.