ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై వరుసగా అత్యధిక కాలం సేవలందించిన
June 10th, 02:08 pm
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై వరుసగా అత్యధిక కాలంపాటు దేశానికి సేవలందించిన భారత ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన శ్రీ నరేంద్ర మోదీ.. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, ప్రభుత్వాధినేతల నుంచి అభినందన సందేశాలను అందుకుంటున్నారు.భారత -ఇటలీ దేశాల ఉమ్మడి ప్రకటన
May 20th, 10:28 pm
ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ఆహ్వానం మేరకు భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 మే 19-20 తేదీల్లో ఇటలీలో అధికారిక పర్యటన చేపట్టారు. 2024 జూన్‌లో జీ7 సదస్సు సందర్భంగా ఇటలీలో ప్రధాని మోదీ పర్యటన, 2023లో జీ20 సదస్సు సందర్భంగా భారతదేశంలో ప్రధాని మెలోనీ పర్యటనల అనంతరం జరిగిన ఈ పర్యటన ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు సరికొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది. ఈ నేపథ్యంలో భారత్-ఇటలీ సంబంధాలను 'ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి పెంచాలని ఇరువురు నేతలు నిర్ణయించారు.ఇటలీ అధ్యక్షుడితో భారత ప్రధానమంత్రి భేటీ
May 20th, 07:19 pm
రోమ్‌లోని అధ్యక్ష భవనం క్విరినాలేలో ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మట్టారెల్లాతో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు సమావేశమయ్యారు.