India-Indonesia Joint Statement on the State Visit by Prime Minister of India to Indonesia
July 07th, 05:15 pm
At the invitation of Indonesian President Prabowo Subianto, PM Modi is on a State Visit to Indonesia from 6-8 July 2026. PM Modi's visit reflects the shared commitment of the two leaders to achieve a substantial upward trajectory in the India-Indonesia Comprehensive Strategic Partnership. The two leaders held discussions at Istana Merdeka in Jakarta, covering the full spectrum of bilateral relations.ఇండోనేషియా పార్లమెంటులో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
July 07th, 03:15 pm
ఇండోనేషియా ప్రజలు – చిన్నారులు, యువత, మహిళలు - ఈ రోజును నా జీవితంలో మరచిపోలేని రోజుల్లో ఒకటిగా మార్చారు. ఈ ఉదయం ఇండోనేషియా ప్రజల నుంచి నాకు దక్కిన ఆత్మీయత, అనురాగం, సాదర స్వాగతాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఈ ఉదయం అధ్యక్షులు ప్రబోవో కాపీరైట్ గురించి మాట్లాడారు. ప్రేమ, ఆత్మీయత, స్నేహం, పరస్పర గౌరవంపై ఎవరూ కాపీరైట్‌ను క్లెయిము చేయలేరని చెప్పాను. అధ్యక్షులు ప్రబోవోతో నా స్నేహం కాపీరైట్‌కి సంబంధించిన అన్ని హద్దులను అధిగమించింది.ఇండోనేషియా పార్లమెంటును ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
July 07th, 03:00 pm
ఈ సందర్భంగా ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. సమావేశానికి విచ్చేసిన ఇండోనేషియా అధ్యక్షుడు శ్రీ ప్రభోవో సుబియాంటోకు ధన్యవాదాలు తెలిపారు. తనకు సాదర ఆహ్వానం పలకడమే కాకుండా భారత్-ఇండోనేషియా భాగస్వామ్యానికి ఎంతో కృషి చేస్తున్న పార్లమెంటు స్పీకర్ శ్రీమతి పువాన్ మహారాణికి కృతజ్ఞతలు తెలియజేశారు. 140 కోట్ల మంది భారత ప్రజల తరపున అక్కడి ఎంపీలకు శుభాకాంక్షలు అందజేశారు. ప్రజాస్వామ్యానికి పట్టునిల్లు అయినటువంటి భారత్.. ఇండోనేషియాతో ఉన్న ప్రజాస్వామ్య బంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఆకాంక్షిస్తోందని పేర్కొన్నారు. ఉభయ దేశాల మధ్య ఉన్న లోతైన చారిత్రక, నౌకా వాణిజ్య సంబంధాలను ఆయన ప్రస్తావించారు. రెండు వేల సంవత్సరాలకు పైగా పరస్పర భావాలు, వాణిజ్యం, సంస్కృతి, విశ్వాసాల ద్వారా భారత్, ఇండోనేషియాలను హిందూ మహాసముద్రం అనుసంధానిస్తోందని ప్రధానమంత్రి శ్రీ మోదీ తెలిపారు. భారత్‌కు చెందిన వసుధైక కుటుంబం, ఇండోనేషియాకు చెందిన భిన్నేక తుంగల్ ఇక (భిన్నత్వంలో ఏకత్వం) వంటి ఉమ్మడి ఆదర్శాలను ప్రధాని ప్రస్తావించారు. ఈ విలువలే రెండు దేశాల భాగస్వామ్యానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని చెప్పారు. ఉమ్మడి చారిత్రక నేపథ్యం, సవాళ్లు, ఇరు దేశాల ప్రజల ఆకాంక్షలు భారత్, ఇండోనేషియాలను సహజసిద్ధమైన, నమ్మకమైన భాగస్వాములుగా మార్చాయని పేర్కొన్నారు.ఇండోనేషియా అధ్యక్షుడితో కలిసి సంయుక్త ప్రకటన నేపథ్యంలో ప్రధానమంత్రి ప్రకటన
July 07th, 11:21 am
మన మధ్య 2018లో ఏర్పడిన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం నేడు నూతన శిఖరాలకు చేరుకుంటోంది. అభివృద్ధి, భద్రత, సాంకేతికత, సంస్కృతి, విద్యతో సహా ప్రతి సహకార రంగంలోనూ గణనీయమైన పురోగతిని సాధిస్తున్నాం.జకార్తా చేరుకున్న ప్రధాని మోదీ
July 06th, 05:03 pm
ప్రధాని మోదీ ఇండోనేషియాలోని జకార్తా చేరుకున్నారు. ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంటో విమానాశ్రయంలో ప్రధాని మోదీకి సాదర స్వాగతం పలికారు.ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ప్రధానమంత్రి పర్యటన
July 03rd, 08:42 pm
ఇండోనేషియా అధ్యక్షులు శ్రీ ప్రబోవో సుబియాంటో ఆహ్వానం మేరకు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 జూలై 6 నుంచి 8 వరకు ఇండోనేషియాలో పర్యటించనున్నారు. మే 2018లో భారత్-ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదిగిన తర్వాత, ప్రధానమంత్రి ఇండోనేషియాలో పర్యటించడం ఇది నాలుగోసారి కాగా... ఇది ఆయన తొలి ద్వైపాక్షిక పర్యటన. ఈ పర్యటన సందర్భంగా, ఇండేనేషియా అధ్యక్షులు శ్రీ ప్రబోవోతో ప్రధానమంత్రి ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. ఇరు దేశాల భాగస్వామ్యంలో సాధించిన పురోగతిని సమీక్షిస్తారు. జకార్తాలో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసే భారీ సభనుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. భారత్, ఇండోనేషియా దేశాల ప్రజల మధ్య చరిత్రాత్మక, ఆత్మీయ సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రత్యేక సంబంధాలకు అనుగుణంగా... ఇండోనేషియాలోని ప్రముఖ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన యోగ్యకార్తాలోని ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని ప్రధానమంత్రి సందర్శిస్తారు.