సైప్రస్ అధ్యక్షుడితో ప్రధానమంత్రి భేటీ

June 16th, 03:15 pm

భారత్-సైప్రస్ సంబంధాలకు ఆధారమైన ఉమ్మడి విలువలను ఇరువురు నాయకులు పునరుద్ఘాటించారు. ఇరు దేశాలు వారి సార్వభౌమత్వాన్నీ, ప్రాదేశిక సమగ్రతనూ పరస్పరం గౌరవిస్తున్నట్లు తెలిపారు. 2025, ఏప్రిల్‌ నెలలో పహల్గామ్‌లో జరిగిన అనాగరిక ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించడంతో పాటు.. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు సంఘీభావం ప్రకటించిన సైప్రస్‌కు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఇరు దేశాల బలమైన నిబద్ధతను ఇది స్పష్టం చేస్తుంది. సైప్రస్ ఐక్యతకు.. యూఎన్ భద్రతా మండలి తీర్మానాలు, అంతర్జాతీయ చట్టాలు, ఈయూ అక్విస్ విషయంలో సైప్రస్ ఇబ్బందులను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు భారత్ మద్దతుగా నిలుస్తుందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.