అహ్మదాబాద్‌లో ‘భారత్-జర్మనీ సీఈఓ ఫోరమ్‌’ సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

January 12th, 01:35 pm

భారత్‌-జర్మనీ ‘సీఈఓ’ల ఫోరం సమావేశంలో పాలుపంచుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. మన దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు నిండగా, ఉభయ పక్షాల వ్యూహాత్మక భాగస్వామ్యానికి 25 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో అటు వజ్రోత్సవం (ప్లాటినం జూబ్లీ), ఇటు రజతోత్సవం (సిల్వర్‌ జూబ్లీ) కూడా నిర్వహించుకుంటున్నాం. ఈ జంట విశేషాల కీలక సందర్భంలో ఏర్పాటైన ఈ సమావేశం ప్లాటినం మెరుపులకు వెండి అంచు తొడిగినట్టుగా ఉంది.

జర్మన్ ఛాన్సలర్‌తో సంయుక్త మీడియా సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం

January 12th, 12:49 pm

ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంలో ఛాన్సలర్ మెర్జ్‌ను స్వాగతించడం నాకు చాలా ఆనందంగా ఉంది. భారత్-జర్మనీ మధ్య తత్వం, జ్ఞానం, ఆధ్యాత్మికతల వారధిని స్వామి వివేకానంద స్వయంగా నిర్మించడం ఒక సంతోషకరమైన యాదృచ్చిక అంశం. ఈ రోజున ఛాన్సలర్ మెర్జ్ సందర్శన ఆ వారధికి కొత్త శక్తిని, కొత్త విశ్వాసాన్ని, పరిధినీ ఇస్తోంది.

జనవరి 12న అహ్మదాబాద్‌లో జర్మనీ చాన్స్‌లర్ శ్రీ మెర్జ్‌ను కలుసుకోనున్న ప్రధానమంత్రి భారత్-జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతిని సమీక్షించనున్న ఇద్దరు నేతలు

January 09th, 12:05 pm

జర్మనీ ఫెడరల్ చాన్స్‌లర్ శ్రీ ఫ్రైడ్‌రిచ్ మెర్జ్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనవరి 12న అహ్మదాబాద్‌లో భేటీ కానున్నారు.

జర్మనీ విదేశాంగ మంత్రితో భారత ప్రధాని భేటీ

September 03rd, 08:40 pm

భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జర్మనీ విదేశాంగ మంత్రి జోహన్ వాడెఫుల్‌తో భేటీ అయ్యారు. ‘‘భారత్, జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యానికి 25 ఏళ్లు పూర్తయ్యాయి. శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశాలుగా, చైతన్యవంతమైన ఆర్థిక వ్యవస్థలుగా.. వాణిజ్యం, సాంకేతికత, ఆవిష్కరణ, సుస్థిరత, తయారీ, రవాణా సహా ఉమ్మడి ప్రయోజనాలున్న అంశాల్లో సహకారాన్ని పెంపొందించుకునేందుకు విస్తృత అవకాశాలు స్పష్టంగా మన కళ్లముందున్నాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.

జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జర్మనీ ఛాన్సలర్‌తో భారత ప్రధాని భేటీ

June 17th, 11:58 pm

కెనడాలోని కననాస్కిస్‌లో జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా గౌరవ జర్మనీ ఛాన్సలర్ శ్రీ ఫ్రెడరిక్ మెర్జ్‌తో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు సమావేశమయ్యారు. ఈ ఏడాది మే నెలలో ఛాన్సలర్ గా మెర్జ్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం వారిద్దరూ భేటీ కావడం ఇదే మొదటిసారి. ఎన్నికలలో విజయం సాధించి, పదవీ బాధ్యతలు స్వీకరించిన జర్మనీ ఛాన్సలర్‌ను భారత ప్రధానమంత్రి అభినందించారు. గతవారం అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై జర్మనీ ప్రభుత్వం సానుభూతి వ్యక్తం చేసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.