ప్రధానమంత్రితో ఫ్రాన్స్ అధ్యక్షుని దౌత్య సలహాదారు భేటీ

January 13th, 10:52 pm

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీని ఫ్రాన్స్ అధ్యక్షుని దౌత్య సలహాదారు శ్రీ ఇమ్యాన్యుయెల్ బన్ ఈ రోజు న్యూఢిల్లీలో కలుసుకున్నారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో సంభాషించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్

August 21st, 06:30 pm

భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈరోజు ఫోన్‌లో సంభాషించారు.

జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షునితో ప్రధానమంత్రి భేటీ

June 18th, 02:57 pm

కెనడాలోని కననాస్కిస్‌లో ఈ నెల 17న జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. అనేక అంశాలపై నేతలు ఇద్దరూ తమ అభిప్రాయాలను పంచుకొన్నారు. మన భూమి హితాన్ని కోరుతూ భారత్, ఫ్రాన్స్ సన్నిహితంగా పనిచేస్తూనే ఉంటాయని వారు ఉద్ఘాటించారు.

మజాగే యుద్ధవీరుల స్మృతి కేంద్రాన్ని సందర్శించిన భారత ప్రధానమంత్రి, ఫ్రాన్స్ అధ్యక్షుడు

February 12th, 04:57 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ ఉదయం మాసే లోని మజాగే యుద్ధవీరుల స్మృతి కేంద్రాన్ని సందర్శించి మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో అసువులు బాసిన భారత వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. యుద్ధవీరుల త్యాగాలకు నివాళిగా ఇరువురు నేతలూ పుష్ప గుచ్ఛాలను ఉంచారు.

ఫ్రాన్స్ అధ్యక్షునితో ప్రధానమంత్రి భేటీ

November 19th, 05:26 am

2047 ప్రణాళిక, ఇతర ద్వైపాక్షిక ప్రకటనల్లో తెలిపినట్లుగా భారత్ - ఫ్రాన్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, ద్వైపాక్షిక సహకారాన్ని, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో తమ నిబద్ధతను ఇరువురు నేతలు ఈ భేటీలో పునరుద్ఘాటించారు. రక్షణ, అంతరిక్షం, పౌర అణువిద్యుత్ తదితర వ్యూహాత్మక విభాగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతిని ప్రశంసించారు. దీనిని వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి దిశగా నడిపించేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు. భారతదేశ జాతీయ మ్యూజియం ప్రాజెక్టులో సహకార పురోగతిని సైతం వారు సమీక్షించారు.