పారిస్‌లో ‘వివాటెక్-2026’ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
June 18th, 06:15 pm
ఇక ఇదే సంవత్సరంలో ‘ఇండియా-ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నొవేషన్’ ప్రారంభం కావడంతో రెండు దేశాలతోపాటు ఐరోపా సాంకేతికావరణ వ్యవస్థలను చేరువ చేసే కీలక వారధిగా ఇది రూపొందింది. కొన్ని రోజుల కిందట నైస్ నగరంలో నిర్వహించిన ‘భారత్ ఇన్నొవేట్స్’ నుంచి ఇవాళ పారిస్ నగరంలో నిర్వహిస్తున్న ‘వివాటెక్’ దాకా మన అంకుర సంస్థలు అనేక కొత్త భాగస్వామ్యాలను ఏర్పరుచుకుంటున్నాయి.వివాటెక్ 2026 సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి
June 18th, 06:00 pm
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో కలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పారిస్‌లో జరిగిన ఐరోపాలోనే అతిపెద్ద సాంకేతిక, అంకురాల కార్యక్రమం అయిన 'వివాటెక్ 2026'లో పాల్గొన్నారు.ఆవిష్కరణలపై భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక ప్రణాళిక-2030
June 15th, 05:42 am
భారత్-ఫ్రాన్స్ స్నేహ బంధాన్ని 2026 ఫిబ్రవరి 17న “ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం” స్థాయికి తీసుకెళ్లడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను కొత్త మలుపు తిప్పారు. అలాగే, ‘భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరం-2026’కు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కృత్రిమ మేధ (ఏఐ), ఆవిష్కరణలు, పరిశోధన, సాంకేతికత, డిజిటల్ రంగం, సైబర్ రంగం, ఆరోగ్యం, సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ, విద్యా సంబంధాలు, ప్రజల మధ్య సంబంధాలు వంటి వివిధ రంగాల్లో సహకారాన్ని మరింత విస్తృతం, వైవిధ్యభరితంగా రూపుదిద్దాలని వారిద్దరూ నిర్ణయించారు.ప్రధాని ఫ్రాన్స్ పర్యటన ఫలితాల జాబితా
June 14th, 09:32 pm
భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణల రోడ్‌మ్యాప్-2030 ఆమోదంముంబైలో భారత్-ఫ్రాన్స్ ఇన్నొవేషన్ ఫోరమ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
February 18th, 12:07 pm
ప్రపంచంలోని రెండు అద్భుత ఆవిష్కరణ కూడళ్ల సంగమం ఇవాళ ఇక్కడ ఆవిష్కృతమైంది. భారత్, ఫ్రాన్స్ దేశాల ప్రస్తావన వచ్చినపుడు మన బంధం ఆవిష్కరణలకు మాత్రమేగాక.. పరస్పర విశ్వాసం, ఉమ్మడి విలువలకు సంబంధించినదిగా ఉంటుంది. ఈ స్ఫూర్తితోనే 2026ను భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణల ఏడాదిగా నిర్వహించాలని అధ్యక్షుడు మాక్రాన్, నేను సంకల్పించాం. ఇదొక వేడుకకు కాదు... ఇది మా సంయుక్త కట్టుబాటు- ఆవిష్కరణలకు కర్తవ్య సహిత నాయకత్వ నిబద్ధత!Prime Minister Welcomes French President to India, Emphasises Strengthening Bilateral Ties
February 17th, 09:57 am
PM Modi extended a warm welcome to French President Emmanuel Macron, expressing confidence that the visit will elevate India–France relations to new heights. The PM noted that the engagements in Mumbai and later in Delhi will provide fresh momentum to the strategic partnership between the two nations, benefiting not only both countries but also the wider global community.