భారత్-ఫ్రాన్స్ సంయుక్త ప్రకటన
February 18th, 08:10 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు గౌరవనీయ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ నెల 17 నుంచి 19 వరకు భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కృత్రిమ మేధ (ఏఐ)పై ‘ఇండియా ఇంపాక్ట్ సమ్మిట్-2026’ సహా ప్రధానమంత్రి మోదీతో ద్వైపాక్షిక చర్చల్లోనూ ఆయన పాల్గొన్నారు. అంతేగాక 17న ముంబైలో ‘భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణ వార్షికోత్సవం-2026’ను వారిద్దరూ సంయుక్తంగా ప్రారంభించారు. మాక్రాన్ ప్రస్తుతం నాలుగోసారి భారత్ పర్యటనకు రాగా, ప్రధానమంత్రి మోదీ 2025 ఫిబ్రవరిలో ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లివచ్చారు.ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటన: వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేయడం మరియు ఏఐ సహకారానికి మార్గదర్శకత్వం
February 13th, 03:06 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఫ్రాన్స్ మరియు యునైటెడ్ స్టేట్స్‌లో చేసిన దౌత్య పర్యటన భారతదేశ ప్రపంచ సంబంధాలను బలోపేతం చేయడంలో గణనీయమైన ప్రభావాన్ని చూపింది, కృత్రిమ మేధస్సు (ఏఐ), ఆర్థిక సంస్కరణలు మరియు చారిత్రక సంబంధాలను గౌరవించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధి, ఆర్థిక సహకారం మరియు వ్యూహాత్మక భాగస్వామ్యాలను మరింతగా పెంచడం పట్ల భారతదేశ నిబద్ధతను ఈ సమగ్ర పర్యటన ప్రదర్శించింది.పారిస్ లో భారత్-ఫ్రాన్స్ సీఈవో ఫోరంలో ప్రధాని ప్రసంగం
February 12th, 12:45 am
‘సృజన, సహకారం, అభ్యున్నతి’ని మంత్రప్రదంగా భావించి మీరు ముందుకు సాగుతుండడాన్ని నేను గమనించాను. మీరు కేవలం ఉన్నతాధికారుల మధ్య వారధులు మాత్రమే కాదు.. భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మీరు బలోపేతం చేస్తున్నారు.భారత్-ఫ్రాన్స్ సీఈఓస్ ఫోరమ్ పద్నాలుగో సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం
February 12th, 12:25 am
ఈ రోజు ప్యారిస్‌లో నిర్వహించిన భారత్-ఫ్రాన్స్ సీఈఓస్ ఫోరమ్ పద్నాలుగో సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమేన్యుయల్ మేక్రోన్...ప్రసంగించారు. ఈ ఫోరమ్ ఇరు పక్షాలకు చెందిన వివిధ కంపెనీల ముఖ్య కార్యనిర్వహణ అధికారుల (సీఈఓల)ను ఒక చోటుకు చేర్చింది. ఇది రక్షణ, ఏరోస్పేస్, కీలక టెక్నాలజీలు-కొత్తగా ఉనికిలోకి వస్తున్న టెక్నాలజీలు, మౌలిక సదుపాయాలు, అడ్వాన్స్‌డ్ మాన్యుఫాక్చరింగ్, కృత్రిమ మేధ, వైద్య ఆరోగ్య శాస్త్రాలు, జీవనశైలిలతోపాటు ఆహారం, ఆతిథ్య రంగాలపై దృష్టిని కేంద్రీకరించింది.