పారిస్‌లో ‘వివాటెక్-2026’ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
June 18th, 06:15 pm
ఇక ఇదే సంవత్సరంలో ‘ఇండియా-ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నొవేషన్’ ప్రారంభం కావడంతో రెండు దేశాలతోపాటు ఐరోపా సాంకేతికావరణ వ్యవస్థలను చేరువ చేసే కీలక వారధిగా ఇది రూపొందింది. కొన్ని రోజుల కిందట నైస్ నగరంలో నిర్వహించిన ‘భారత్ ఇన్నొవేట్స్’ నుంచి ఇవాళ పారిస్ నగరంలో నిర్వహిస్తున్న ‘వివాటెక్’ దాకా మన అంకుర సంస్థలు అనేక కొత్త భాగస్వామ్యాలను ఏర్పరుచుకుంటున్నాయి.వివాటెక్ 2026 సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి
June 18th, 06:00 pm
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో కలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పారిస్‌లో జరిగిన ఐరోపాలోనే అతిపెద్ద సాంకేతిక, అంకురాల కార్యక్రమం అయిన 'వివాటెక్ 2026'లో పాల్గొన్నారు.జీ7 సదస్సు సందర్భంగా ఐరోపా కౌన్సిల్, ఐరోపా కమిషన్ అధ్యక్షులతో సమావేశమైన ప్రధాని
June 17th, 06:43 pm
ఎవియాన్‌లో జరుగుతున్న జీ7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఐరోపా కౌన్సిల్ అధ్యక్షులు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు శ్రీమతి ఉర్సులా వాన్ డెర్ లెయెన్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు.జి7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జర్మనీ చాన్సలర్‌తో ప్రధానమంత్రి సమావేశం
June 17th, 05:34 pm
ఈ సందర్భంగా భారత్-జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్య పునరుజ్జీవనంపై వారిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరిలో చాన్సలర్ భారత పర్యటనకు రాగా, భారత-ఐరోపా సమాఖ్య మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై సంతకాలు పూర్తయిన నేపథ్యంలో ప్రస్తుతం ద్వైపాక్షిక సంబంధాల ప్రగతిని సమీక్షించారు. ఈ ఏడాదిలోనే భారత్-జర్మనీ దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవం నిర్వహించనుండగా, వాణిజ్యం-పెట్టుబడులు, రక్షణ-భద్రత, కాలుష్య రహిత సుస్థిర అభివృద్ధి, సాంకేతికత, ఆవిష్కరణలు, విద్య, రవాణా తదితర రంగాల్లో సహకార బలోపేతంపై నిబద్ధతను వారిద్దరూ పునరుద్ఘాటించారు. రక్షణ పారిశ్రామిక సహకారంపై వ్యూహాత్మక భవిష్యత్ ప్రణాళికపై సంతకాలు పూర్తి కావడంపై వారు హర్షం ప్రకటించారు. జర్మనీ మీదుగా ప్రయాణించే భారత పౌరులకు ట్రాన్సిట్ వీసా మినహాయింపు విధానానికి శ్రీకారం చుట్టడాన్ని స్వాగతించారు.ఫ్రాన్స్ అధ్యక్షుడితో ప్రధానమంత్రి అధికారిక చర్చలు
June 14th, 08:37 pm
జూన్ 14, 2026న నీస్‌లోని విల్లా కెరిలోస్ వద్ద ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మాక్రాన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ ఏడాది ప్రారంభంలో భారత్-ఫ్రాన్స్ సంబంధాలను విశిష్టమైన అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చిన తర్వాత ఇరువురు నేతల మధ్య జరిగిన తొలి సమావేశమిది.ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు బయలుదేరే ముందు ప్రధానమంత్రి అధికారిక ప్రకటన
June 13th, 10:03 am
ఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్షులు శ్రీ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, స్లోవాక్ రిపబ్లిక్ ప్రధానమంత్రి శ్రీ రాబర్ట్ ఫికోల ఆహ్వానం మేరకు... నేను ఈ నెల 13 నుంచి 18 వరకు ఫ్రాన్స్, స్లోవాక్ రిపబ్లిక్ దేశాల్లో పర్యటించనున్నాను.సైప్రస్ దేశాధ్యక్షుడి అధికారిక పర్యటన సందర్భంగా ఇరుదేశాల ఉమ్మడి ప్రకటన
May 22nd, 09:31 pm
భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు సైప్రస్ దేశాధ్యక్షుడు శ్రీ నికోస్ క్రిస్టోడౌలిడెస్ 2026 మే 20 నుంచి 23 వరకు భారతదేశంలో అధికారిక పర్యటన చేపట్టారు. ఐరోపా సమాఖ్య కౌన్సిల్‌కు సైప్రస్ అధ్యక్షత వహిస్తున్న తరుణంలో ఈ పర్యటన జరగడంతో ఇది మరింత ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.సైప్రస్ అధ్యక్షుడితో సంయుక్త మీడియా ప్రకటన సందర్భంగా ప్రధానమంత్రి ప్రకటన
May 22nd, 01:00 pm
పర్యటన సందర్భంగా మీ ఆప్యాయత, స్నేహం, భారతదేశంతో మీకున్న బలమైన అనుబంధాన్ని మేం మనస్ఫూర్తిగా అనుభూతి చెందాం. నేడు మీ భారత పర్యటన.. మన ఉమ్మడి ప్రయాణంలో మరో కీలక ఘట్టాన్ని సూచిస్తుంది.భారత -ఇటలీ దేశాల ఉమ్మడి ప్రకటన
May 20th, 10:28 pm
ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ఆహ్వానం మేరకు భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 మే 19-20 తేదీల్లో ఇటలీలో అధికారిక పర్యటన చేపట్టారు. 2024 జూన్‌లో జీ7 సదస్సు సందర్భంగా ఇటలీలో ప్రధాని మోదీ పర్యటన, 2023లో జీ20 సదస్సు సందర్భంగా భారతదేశంలో ప్రధాని మెలోనీ పర్యటనల అనంతరం జరిగిన ఈ పర్యటన ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు సరికొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది. ఈ నేపథ్యంలో భారత్-ఇటలీ సంబంధాలను 'ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి పెంచాలని ఇరువురు నేతలు నిర్ణయించారు.ఇటలీ ప్రధానితో భేటీ అయిన ప్రధానమంత్రి
May 20th, 07:21 pm
అత్యున్నత స్థాయి సమావేశాలు వేగవంతం కావడాన్నీ, ద్వైపాక్షిక సహకారంలో సాధించిన వృద్ధినీ, వైవిధ్యాన్నీ ఇద్దరు ప్రధానమంత్రులు స్వాగతించారు. భారత్-ఇటలీ మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకు వెళ్లేందుకు వారు అంగీకరించారు. బహుపాక్షిక కార్యక్రమాల సందర్భంగా వార్షిక మంత్రిత్వ స్థాయి, సంస్థాగత స్థాయి సమావేశాలతో సహా నాయకుల వార్షిక సమావేశాలను కూడా నిర్వహించేందుకు వారు అంగీకరించారు.అనువాదం: ఇటలీ ప్రధానమంత్రితో కలిసి నిర్వహించిన సంయుక్త పత్రికా సమావేశంలో భారత ప్రధాని ప్రసంగం
May 20th, 05:00 pm
గడిచిన దాదాపు మూడున్నర సంవత్సరాల్లో నాకు ప్రధాన మంత్రి మెలోని గారితో పలుమార్లు సమావేశమయ్యే అవకాశాలు లభించాయి. ఇది భారత్, ఇటలీ దేశాల మధ్య ఉన్న సన్నిహిత సహకారానికి, పరస్పర అవగాహనకు నిదర్శనం. ఆమె నాయకత్వంలో మన ద్వైపాక్షిక సంబంధాలు సరికొత్త వేగాన్ని, నూతన దిశను, సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని సంతరించుకున్నాయి. మన బంధాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్తూ ఈ రోజు మనం ఒక 'ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని' ప్రకటిస్తుండటం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.మూడో ఇండియా-నార్డిక్ సదస్సు నేపథ్యంలో ఫిన్లాండ్ ప్రధానితో భేటీ అయిన ప్రధానమంత్రి
May 19th, 06:42 pm
ఓస్లోలో జరుగుతున్న మూడో ఇండియా-నార్డిక్ సదస్సు నేపథ్యంలో 2026 మే 19న ఫిన్లాండ్ ప్రధాని శ్రీ పెటెరి ఓర్పోతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.భారత్-నార్డిక్ 3వ సదస్సు సందర్భంగా సంయుక్త మీడియా ప్రకటనలో ప్రధానమంత్రి ప్రకటన
May 19th, 04:25 pm
ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన, బహుపక్షవాదం పట్ల ఉమ్మడి నిబద్ధతే మనల్ని సహజ భాగస్వాములుగా చేస్తోంది. సాంకేతికత, సుస్థిర రంగాల్లో మనకున్న ఉమ్మడి ప్రాధాన్యతలు.. ఇరుదేశాల సంబంధాల్లో అపారమైన అవకాశాలను కల్పిస్తున్నాయి. అందువల్లే నార్డిక్ దేశాలతో మన సంబంధాల్లో శక్తిని, వేగాన్ని పెంచేందుకు ఎనిమిదేళ్ల కిందట ఈ వేదికను ఏర్పాటు చేశాం.‘యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ’ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం
May 18th, 05:00 am
ముందుగా, ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి నన్ను ఆహ్వానించిన ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్‌సన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సమావేశం గోథెన్‌బర్గ్‌లో జరగడం నాకు సంతోషంగా ఉంది. ఈ నగరం ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందినది. ఈ నగరం యూరప్ తయారీ రంగ స్ఫూర్తికి చిహ్నంగానూ నిలుస్తుంది.అనువాదం: ‘యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ’ సమావేశంలో ప్రధానమంత్రి మీడియా ప్రకటన
May 17th, 11:43 pm
కొద్దిసేపటి క్రితమే స్వీడన్ దేశపు అత్యున్నత పురస్కారమైన 'రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్'తో నన్ను గౌరవించారు. ఈ గౌరవం కేవలం నాది మాత్రమే కాదు.. ఇది 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవం.. భారత్-స్వీడన్ సంబంధాలను మరింత సుసంపన్నం చేసి వాటికి బలమైన పునాదిని వేసిన స్వీడన్‌లోని మన మిత్రులందరికీ దక్కిన గౌరవంగా భావిస్తున్నాను.భారత ప్రధానమంత్రి నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా రెండు దేశాల సంయుక్త ప్రకటన
May 17th, 03:45 am
నెదర్లాండ్స్ ప్రధానమంత్రి గౌరవనీయ రాబ్ జెటెన్ ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 16-17 తేదీలలో ఆ దేశంలో పర్యటించారు. శ్రీ మోదీ నెదర్లాండ్స్‌లో పర్యటించడం ఇది రెండోసారి.నెదర్లాండ్స్ ప్రధానమంత్రి గౌరవనీయ రోబ్ ఎటెన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధికారిక చర్చలు
May 17th, 02:35 am
ఈ సమావేశంలో భారత్-నెదర్లాండ్స్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై వారిద్దరూ విస్తృతంగా చర్చించారు. రెండు దేశాల మధ్య ఉమ్మడి విలువలు, విశ్వాసంతోపాటు సమన్వయం, సహకారం ఇనుమడించడాన్ని ప్రతిబింబిస్తూ, ఈ స్నేహబంధాన్ని “వ్యూహాత్మక భాగస్వామ్యం” స్థాయికి విస్తరించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. వాణిజ్యం-పెట్టుబడులు, రక్షణ-భద్రత, అత్యాధునిక-కీలక సాంకేతికతలు, సముద్ర రంగం, పునరుత్పాదక ఇంధనం, విద్యా రంగాల్లో సహకార విస్తృతి దిశగా వ్యూహాత్మక భాగస్వామ్యంపై భవిష్యత్ ప్రణాళిక ఆమోదానికి నిశ్చయించారు. ఉభయ పక్షాల మధ్య వ్యాపారం, పెట్టుబడులు, సాంకేతికత-ఆవిష్కరణల భాగస్వామ్య విస్తరణ సహా భారత వృద్ధి ప్రస్థానం డచ్ కంపెనీలకు ఆశావహ వ్యాపార అవకాశాలను కల్పించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.‘యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ’ని (ఈఆర్‌టీ) ఉద్దేశించి మాట్లాడిన ప్రధానమంత్రి
May 17th, 12:12 am
గోథెన్‌బర్గ్‌లో 2026 మే 17న నిర్వహించిన 'యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ' (ఈఆర్‌టీ) సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు. వోల్వో గ్రూప్ నిర్వహించిన ఈ ఉన్నత స్థాయి చర్చా కార్యక్రమంలో స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టెర్సన్, ఐరోపా కమిషన్ అధ్యక్షులు శ్రీమతి ఉర్సులా వాన్ డెర్ లేయన్, ఐరోపాకు చెందిన సీనియర్ పారిశ్రామిక ప్రముఖులు, ప్రముఖ యూరోపియన్- భారతీయ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.నెదర్లాండ్స్ పీఎం రాబ్ జెట్టెన్‌తో ప్రతినిధుల స్థాయి సమావేశం సందర్భంగా పీఎం ప్రసంగం
May 16th, 11:58 pm
నాకు, నా ప్రతినిధి బృందానికి అందించిన ఆత్మీయ స్వాగతానికి హృదయపూర్వక ధన్యవాదాలు. దాదాపు దశాబ్ద కాలం తర్వాత నెదర్లాండ్స్‌ను సందర్శించటం నాకెంతో సంతోషంగా ఉంది. గత పదేళ్లలో భారత్-నెదర్లాండ్స్ భాగస్వామ్యం గణనీయంగా పురోగతిని సాధించింది.నెదర్లాండ్స్‌లో సీఈవోల రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా ప్రధాని ప్రసంగం
May 16th, 10:00 pm
ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరణలకు నిలయాలైన కొన్ని కంపెనీల అధినేతల నడుమ ఈ రోజు ఇక్కడుండడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు 300కు పైగా డచ్ కంపెనీలు భారత్ ప్రస్థానంలో భాగమయ్యాయి. భారత్ పట్ల మీకున్న సానుకూల దృక్పథం, విశ్వాసం వల్లే.. ఐరోపా నుంచి భారత్‌లో అతిపెద్ద పెట్టుబడిదారుగా, రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నెదర్లాండ్స్ నిలిచింది.