2030 వైపు: ఉమ్మడి భారతదేశం-యూరోపియన్ యూనియన్ సమగ్ర వ్యూహాత్మక అజెండా
January 27th, 06:48 pm
2026 జనవరి 27న న్యూఢిల్లీలో జరిగిన 16వ ఇండియా-ఈయు శిఖరాగ్ర సమావేశంలో ఆమోదించబడిన ఉమ్మడి భారతదేశం-ఈయు సమగ్ర వ్యూహాత్మక అజెండా, భాగస్వాములిద్దరికీ మరియు విస్తృత ప్రపంచానికి పరస్పర ప్రయోజనకరమైన, కాంక్రీట్ మరియు పరివర్తనాత్మక ఫలితాలను అందించడానికి ఈయు-భారతదేశ సహకారాన్ని విస్తృతం చేయడం, లోతుగా చేయడం మరియు మెరుగైన సమన్వయం చేయడం ద్వారా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.భారతదేశం - యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు మరియు యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడి భారతదేశ అధికారిక పర్యటన మరియు 16వ ఇండియా-ఈయు శిఖరాగ్ర సమావేశంపై ఈయు సంయుక్త ప్రకటన
January 27th, 06:15 pm
ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా మరియు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ 77వ భారత గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథులుగా భారతదేశానికి రాష్ట్ర పర్యటనకు వచ్చారు. ఈ పర్యటన సందర్భంగా, మైలురాయి భారతదేశం-ఈయు ఎఫ్టిఏ పై చర్చలు విజయవంతంగా ముగిసినందుకు నాయకులు ప్రశంసించారు మరియు 2030 వైపు: భారతదేశం-ఈయు ఉమ్మడి సమగ్ర వ్యూహాత్మక అజెండాను ఆమోదించారు.న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఇండియా-ఈయూ బిజినెస్ ఫోరమ్‌లో ప్రధానమంతి ప్రసంగానికి తెలుగు అనువాదం
January 27th, 04:32 pm
ఇండియన్-యూరోపియన్ యూనియన్ బిజినెస్ ఫోరమ్‌లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. భారత్‌లో యూరోపియన్ యూనియన్ మండలి, కమిషన్ అధ్యక్షుల పర్యటన సాధారణ దౌత్య పర్యటన కాదు. ఇది భారత్-యూరోపియన్ యూనియన్ సంబంధాల్లో కొత్త శకానికి నాంది పలికింది. భారత గణతంత్ర దినోత్సవాల్లో యూరోపియన్ యూనియన్ నాయకులు ముఖ్య అతిధులుగా పాల్గొనడం ఇదే తొలిసారి. భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య కుదరిన ఒప్పందం దేశ చరిత్రలోనే అతి పెద్ద ఎఫ్‌టీఏ. ఈ రోజు ఇండియా-యూరోపియన్ యూనియన్ బిజినెస్ ఫోరమ్‌లో పెద్ద సంఖ్యలో సీఈవోలు పాల్గొన్నారు. ఈ విజయాలన్నీ ప్రపంచంలోనే రెండు అతి పెద్ద ప్రజాస్వామ్య శక్తుల మధ్య ఏర్పడిన అపూర్వమైన సమన్వయానికి చిహ్నాలుగా నిలుస్తున్నాయి.న్యూఢిల్లీలో జరిగిన ఇండియా-ఈయూ బిజినెస్ ఫోరంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
January 27th, 04:30 pm
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన భారత్-యూరోపియన్ యూనియన్ బిజినెస్ ఫోరంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఇండియా-యూరోపియన్ యూనియన్ (ఈయూ) బిజినెస్ ఫోరంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. భారత్‌లో యూరోపియన్ యూనియన్ కౌన్సిల్, కమిషన్ల అధ్యక్షుల పర్యటన సాధారణ దౌత్య సందర్శన కాదని, అది భారత్-ఈయూ సంబంధాల్లో నూతన శక ప్రారంభాన్ని సూచిస్తుందన్నారు. భారత గణతంత్ర దినోత్సవాల్లో ఈయూ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొనడం ఇదే తొలిసారని శ్రీ మోదీ వెల్లడించారు. దేశ చరిత్రలో అతి పెద్ద స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాన్ని భారత్, యూరోపియన్ యూనియన్ కుదుర్చుకున్నాయని తెలియజేశారు. అనేక మంది సీఈవోలతో పెద్ద స్థాయిలో భారత్-యూరోపియన్ యూనియన్ వ్యాపార వేదికను నిర్వహించామన్నారు. ఈ విజయాలన్నీ ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య శక్తుల మధ్య ఏర్పడిన అపూర్వమైన సమన్వయాన్ని సూచిస్తున్నాయని వివరించారు.