ఇథియోపియాలో ప్రధానమంత్రి పర్యటన: ముఖ్య నిర్ణయాలు
December 16th, 10:41 pm
ద్వైపాక్షిక సంబంధాలను ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి ఉన్నతీకరించుకోవడం..జోర్డాన్, ఇథియోపియా, ఒమన్‌లలో ప్రధాని పర్యటన
December 11th, 08:43 pm
మహారాజు అబ్దుల్లా II బిన్ అల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు.. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 డిసెంబరు 15 – 16 తేదీల్లో హషేమైట్ రాజ్యమైన జోర్డాన్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా గౌరవ మహారాజు అబ్దుల్లా II బిన్ అల్ హుస్సేన్‌తో భారత ప్రధానమంత్రి సమావేశమై.. భారత్, జోర్డాన్ మధ్య సంబంధాల పూర్తి పరిధిని సమీక్షించడంతోపాటు పలు ప్రాంతీయ అంశాలపైనా చర్చిస్తారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పర్యటన జరుగుతోంది. భారత్ - జోర్డాన్ ద్వైపాక్షిక సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి, పరస్పర వృద్ధి, సంక్షేమం కోసం సహకారానికి కొత్త మార్గాల అన్వేషణకు, అలాగే.. ప్రాంతీయ శాంతి, సమృద్ధి, భద్రత, స్థిరత్వాన్ని ప్రోత్సహించడంలో అంకితభావాన్ని పునరుద్ఘాటించేందుకు ఇదో మంచి అవకాశం.