మార్చి 31న పీఎం గుజరాత్ పర్యటన
March 30th, 11:05 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి 31, 2026న గుజరాత్‌లో పర్యటించనున్నారు. ఉదయం సుమారు 10 గంటలకు గాంధీనగర్‌లో సామ్రాట్ సంప్రతి మ్యూజియాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తారు. మధ్యాహ్నం సుమారు 12:45 గంటలకు అహ్మదాబాద్‌లోని సనంద్‌లో కేన్స్ సెమికాన్ ప్లాంట్‌ను ప్రారంభించి, అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడతారు. ఆ తర్వాత వావ్-థరాడ్‌లో సాయంత్రం సుమారు 4 గంటలకు రూ. 20,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసి, వాటిని జాతికి అంకితం చేస్తారు. అనంతరం అక్కడ కూడా ప్రధానమంత్రి ప్రసంగించనున్నారు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇండియా చిప్ లిమిటెడ్ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం
February 21st, 05:30 pm
అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే లక్ష్యంతో భారత్ అత్యంత వేగంగా పని చేస్తోంది. ఆగేందుకు లేదా విశ్రమించేందుకు భారతదేశానికి సమయం లేదని నేను ఎర్రకోట నుంచి చెప్పాను. 2026 ప్రారంభం నుంచి భారత్ తన వేగాన్ని మరింత పెంచింది. జనవరి 12న వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్‌లో లక్షలాది దేశ యువత పాల్గొన్నారు. దేశంలో అంకుర సంస్థల విప్లవానికి నూతన ఉత్సాహాన్ని జోడిస్తూ జనవరి 16న మనం జాతీయ అంకుర సంస్థల దినోత్సవం నిర్వహించుకున్నాం. ఇదే జనవరిలో నిర్వహించిన ఇండియా ఎనర్జీ సదస్సు ద్వారా తన సామర్థ్యంతో ప్రపంచం దృష్టిని భారత్ ఆకర్షించింది. ఆ తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్ వికసిత్ భారత్‌కు కొత్త వేగాన్ని అందించింది. ఈ వారం కూడా భారత్‌కు చరిత్రాత్మకమైనదే. ప్రపంచంలో అనేక దేశాల అధినేతలు, సాంకేతిక ప్రపంచంలో దిగ్గజాలు అందరూ ఢిల్లీలో జరిగిన గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొన్నారు. భారతదేశ ఏఐ సామర్థ్యాన్ని ఈ సదస్సు ద్వారా ప్రపంచం చూసింది. మన దార్శనికతను అర్థం చేసుకొని, ప్రశంసించింది.ఉత్తరప్రదేశ్‌లోని హెచ్‌సిఎల్-ఫాక్స్‌కాన్ సెమీకండక్టర్ యూనిట్ శంకుస్థాపన కార్యక్రమంలో వీడియో అనుసంధానం ద్వారా పాల్గొన్న ప్రధానమంత్రి
February 21st, 05:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉత్తరప్రదేశ్‌లోని హెచ్‌సిఎల్-ఫాక్స్‌కాన్ సెమీకండక్టర్ యూనిట్ శంకుస్థాపన కార్యక్రమంలో వీడియో అనుసంధానం ద్వారా పాల్గొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సదస్సు తర్వాత, ప్రపంచ సెమీకండక్టర్ కేంద్రంగా మారే దిశగా ముందుకు సాగుతున్న భారత్ ప్రయాణంలో ఈ కార్యక్రమం ఒక చరిత్రాత్మక విజయాన్ని సూచిస్తుంది.