అస్సాంలోని సిల్చార్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
March 14th, 11:10 am
సంస్కృతి, ధైర్యం, ఉత్సాహం నిండిన బరాక్ లోయ కుటుంబాల మధ్యకు రావడం ఎప్పుడూ ప్రత్యేకమైన అనుభవాన్నిస్తుంది. బరాక్ లోయకు ముఖద్వారంగా సిల్చార్‌ను పిలుస్తారు. చరిత్ర, భాష, సంస్కృతి, వ్యాపారం అన్నీ కలసి ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువచ్చాయి. ఇక్కడ బెంగాలీ మాట్లాడతారు. అస్సామీ ప్రతిధ్వనిస్తుంది. ఇతర గిరిజన సంప్రదాయాలు విరాజిల్లుతున్నాయి. ఈ వైవిధ్యాన్ని బలంగా మార్చుకుంటూ, సోదరభావం, సామరస్యంతో ఈ ప్రాంతాన్నంతా మీరు అభివృద్ధి చేస్తున్నారు. ఇది బరాక్ వ్యాలీకున్న అసమానమైన సామర్థ్యం.అస్సాంలోని సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 14th, 10:45 am
అస్సాంలోని సిల్చార్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ.. సంస్కృతి, చైతన్యానికి నిలయమైన బరాక్ లోయను సందర్శించడం తనకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన అనుభూతినిస్తుందని పేర్కొన్నారు. సిల్చార్ నగరం ఈ లోయకు ఒక ప్రవేశ ద్వారం వంటిదని.. ఇక్కడ చరిత్ర, భాష ఒక ప్రత్యేకమైన ప్రాంతీయ గుర్తింపును తీసుకొచ్చాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. బెంగాలీ, అస్సామీ, గిరిజన సంప్రదాయాలు సామరస్యంతో వర్ధిల్లే ఈ ప్రాంత వైవిధ్యమే దీని అసలైన బలమని శ్రీ మోదీ తెలిపారు. ‘‘బరాక్ లోయ వైవిధ్యమే దాని గొప్ప ఆస్తి. ఇది పౌరుల మధ్య సోదరభావాన్ని పెంపొందిస్తుంది’’ అని శ్రీ మోదీ అన్నారు.గుజరాత్‌లో మైక్రాన్ సెమీకండక్టర్ టెక్నాలజీ ఇండియా కేంద్ర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగం
February 28th, 02:45 pm
గుజరాత్ ప్రజల ఆదరణ చూరగొన్న ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్ గారూ, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారూ, మైక్రాన్ టెక్నాలజీ సీఈవో శ్రీ సంజయ్ మెహ్రోత్రా గారూ, భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి గారూ, విశిష్ట అతిథులూ, సోదరీ సోదరులారా...గుజరాత్‌లోని సానంద్‌లో మైక్రాన్ టెక్నాలజీ సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ అండ్ ప్యాకేజింగ్ (ఏటీఎంపీ) కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
February 28th, 02:37 pm
గుజరాత్‌లోని సానంద్‌లో మైక్రాన్ అసెంబ్లీ, టెస్ట్, మార్కింగ్, ప్యాకేజింగ్ (ఏటీఎంపీ) కేంద్రాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభాన్ని సూచించే ఈ చారిత్రాత్మక ఘట్టం ప్రపంచ సాంకేతిక నాయకత్వం వైపు భారత్ భారత ప్రయాణంలో ఒక ముందడుగు.న్యూస్ 18 రైజింగ్ భారత్ సదస్సులో ప్రధాని ప్రసంగం
February 27th, 08:30 pm
‘రైజింగ్ ఇండియా’ గురించి మీరంతా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా అంతర్గత శక్తి గురించి ఎక్కువగా చెబుతున్నారు. సూటిగా చెప్పాలంటే.. స్వభావ సిద్ధమైన దేశ స్వీయ సామర్థ్యాల మీదే మీరు ప్రధానంగా దృష్టి సారించారు. ‘తత్వమసి’ అని మన గ్రంథాలు బోధిస్తున్నాయి. అంటే, మనం ఎక్కడో వెతుకులాడుతున్న దైవిక శక్తి మనలోనే ఉంది. అది మనమే. ఆ శక్తి మనలోనే ఉంది. దాన్ని మనం గుర్తించాలి. గత 11 ఏళ్లలో భారత్ తనలో ఉన్న ఈ అసలైన శక్తిని గుర్తించింది. నేడు ఆ శక్తి ప్రవర్ధమానమయ్యేలా దేశం నిరంతరం పురోగమిస్తోంది.నెట్‌వర్క్ 18 రైజింగ్ భారత్ సదస్సులో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
February 27th, 08:00 pm
రైజింగ్ భారత్ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రసంగించారు. ‘అంతర్గత శక్తి’ అంశంపై ఆయన ప్రసంగం సాగింది. గత 11 ఏళ్లలో దేశ ప్రయాణం, జాతీయ సామర్థ్యాన్ని తిరిగి పొందడం, ఆర్థిక స్వావలంబన, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం కోసం రూపొందించిన ప్రణాళిక గురించి సుదీర్ఘంగా ప్రసంగించారు.నెసెట్‌ను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
February 25th, 08:20 pm
ఈ విశిష్ట సభ ముందు నిలబడటం నాకు దక్కిన గౌరవం, అదృష్టం. భారత ప్రధానమంత్రిగా, ఒక ప్రాచీన నాగరికత ప్రతినిధిగా మరో నాగరికతను ఉద్దేశించి ప్రసంగిస్తున్నాను. నా వెంట 1.4 బిలియన్ల మంది భారతీయులు అందించిన శుభాకాంక్షలను, స్నేహ సందేశాన్ని, గౌరవాన్ని, భాగస్వామ్యాన్ని తీసుకువచ్చాను.ఇజ్రాయెల్ పార్లమెంట్ - నెసెట్ ను ఉద్దేశించి ప్రసంగించిన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
February 25th, 08:00 pm
భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బుధవారం నాడు జెరూసలేంలోని నెసెట్ (ఇజ్రాయెల్ పార్లమెంట్) ప్రత్యేక ప్లీనరీని ఉద్దేశించి ప్రసంగించారు. ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రసంగించిన తొలి భారత ప్రధానమంత్రిగా ఆయన గుర్తింపు పొందారు.ఏఐ పురోగతి నుండి టి20 ప్రపంచ కప్ వరకు, మన్ కీ బాత్‌లో భారతదేశ ఎదుగుదలను ప్రస్తావించిన ప్రధానమంత్రి మోదీ
February 22nd, 11:30 am
ఈ నెల మన్ కీ బాత్‌లో, ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ తన అనుభవాల గురించి మాట్లాడారు. భారత సంతతికి చెందిన క్రికెటర్లు, అవయవ దానం, నదీ ఉత్సవాలు, డిజిటల్ భద్రత, పరీక్ష పే చర్చా వంటి అనేక ముఖ్యమైన అంశాలను ఆయన ప్రస్తావించారు. ఫిబ్రవరి 23న రాష్ట్రపతి భవన్‌లో 'రాజాజీ ఉత్సవ్' జరుపుకుంటామని ఆయన హైలైట్ చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీకి నారీ శక్తితో ఉన్న లోతైన సంబంధాన్ని గుర్తుచేసుకుంటూ ప్రధాని ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు.ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా మారిషస్ ప్రధానమంత్రితో ప్రధానమంత్రి భేటీ
February 20th, 10:13 pm
న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్‌చంద్ర రాంగులాంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. 2025 సెప్టెంబర్ తర్వాత ప్రధానమంత్రి రాంగులాం పదవీ కాలంలో.. భారత్ పర్యటనకు రావటం ఇది రెండో సారి. 09 ఫిబ్రవరి 2026న వీరిద్దరి మధ్య ఫోన్ సంభాషణ తర్వాత ఈ భేటీ జరిగింది.ఓపెన్ ఏఐ సీఈవోతో ప్రధాని బేటీ
February 20th, 09:06 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో.. ఓపెన్ సీఈవో శ్రీ శాం ఆల్ట్‌మన్ ఈ రోజు సమావేశమయ్యారు.భారత్‌లో గౌరవ లిచ్టెన్‌స్టెయిన్ యువరాజు అలోయిస్ పర్యటన
February 20th, 03:53 pm
భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు.. గౌరవ లిచ్టెన్‌స్టెయిన్ యువరాజు అలోయిస్ భారత్‌లో పర్యటించి, న్యూఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ – 2026లో పాల్గొన్నారు.ఐఏ ఇంపాక్ట్ సమ్మిట్‌లో నిర్వహించిన సీఈఓ రౌండ్‌టేబుల్‌లో బాధ్యతాయుత కృత్రిమ మేధ పట్ల ప్రపంచ నిబద్ధతను స్పష్టం చేసిన ప్రధానమంత్రి
February 19th, 10:05 pm
ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో భాగంగా నిర్వహించిన సీఈఓ రౌండ్‌టేబుల్ ఫలితాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు. కృత్రిమ మేధ (ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్.. ఏఐ), సాంకేతికతలతో పాటు నవకల్పన రంగాలకు చెందిన అగ్రగామి ఆసక్తిదారులు ఈ రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.Visit of H.E. Mr. Dick Schoof, Prime Minister of the Netherlands, to India
February 19th, 08:47 pm
PM Modi held a bilateral meeting with H.E. Mr. Dick Schoof, Prime Minister of the Netherlands. Prime Minister Schoof underscored the importance of the Summit and expressed confidence that the Summit Declaration will steer future policy discussions. Reviewing the bilateral relationship, both leaders welcomed the steady progress in the India-Netherlands partnership.India’s direction and vision for AI are clear, AI is a shared resource for the welfare of humanity: PM Modi
February 19th, 01:00 pm
In his remarks at the Leaders’ Plenary Session during the India AI Impact Summit, PM Modi noted how India has seen technology serve humanity, citing the digital vaccination platform that helped vaccinate millions on time. Highlighting that for India technology is not a medium of power but of service, he underlined that AI too must follow this path to ensure the welfare of humanity. For the ethical use of AI, the PM offered three valuable suggestions.‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’లో ప్రపంచ నేతల సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
February 19th, 12:39 pm
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహిస్తున్న “ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’లో ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన వారిని మరోసారి స్వాగతిస్తూ- మానవాళి కేంద్రక, అవగాహన పూరిత ఏఐ ప్రపంచావరణ వ్యవస్థకు రూపకల్పనలో ఈ శిఖరాగ్ర సమావేశం కీలక పాత్ర పోషించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. అనేక అవరోధాలను అవకాశాలుగా మానవాళి మలచుకున్న తీరును చరిత్ర వివరిస్తున్నదని ఆయన గుర్తుచేశారు. అదే తరహాలో మానవాళి రూపాంతరీకరణకు నేడు మరో గొప్ప అవకాశాన్ని చేరువ చేసిందని వ్యాఖ్యానించారు.ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ప్రధానమంత్రి ప్రసంగం
February 19th, 10:00 am
ప్రపంచంలోనే అతిపెద్ద, చారిత్రాత్మక ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు మీ అందరికీ సాదర స్వాగతం. మానవాళిలో ఆరో వంతు జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత్‌లో ఈ సదస్సు జరుగుతోంది. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా, అపారమైన సాంకేతిక ప్రతిభ, విస్తృతమైన సాంకేతిక అనుసంధాన వ్యవస్థలకు భారత్ పుట్టినిల్లు. భారత్ కొత్త సాంకేతికతలను సృష్టించడమే కాకుండా, వాటిని మునుపెన్నడూ లేని వేగంతో స్వీకరిస్తుంది. ఆవిష్కరణలను అందిపుచ్చుకోవడానికి ఉత్సాహంగా ఉన్న 140 కోట్ల భారతీయుల తరపున ఇక్కడ ఉన్న వివిధ దేశాల ప్రభుత్వాధినేతలకు, ప్రపంచ ఏఐ వ్యవస్థ నాయకులకు, ఆవిష్కర్తలకు నేను సాదర స్వాగతం పలుకుతున్నాను. మీరు ఇక్కడకు విచ్చేసినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
February 19th, 09:40 am
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి శ్రీ మోదీ ప్రసంగించారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన, చరిత్రాత్మకమైన ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు ప్రపంచ జనాభాలో ఆరో వంతుకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత్ ఆతిథ్యమిస్తోందన్నారు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో యువ జనాభా కలిగిన, సాంకేతిక నిపుణులు అధిక సంఖ్యలో ఉన్న, సాంకేతిక ఆధారిత వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌ను వర్ణించారు. నూతన సాంకేతికతలను రూపొందించడం మాత్రమే కాకుండా.. వాటిని అపూర్వమైన వేగంతో భారత్ స్వీకరిస్తోందన్నారు. కొత్త సాంకేతికతలను అనుసరించడానికి 140 కోట్ల మంది భారతీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, వారి తరఫున ఈ సదస్సులో పాల్గొంటున్న ప్రభుత్వాధినేతలు, ప్రపంచ ఏఐ వ్యవస్థ నాయకులు, ఆవిష్కర్తలకు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నానని చెప్పారు. ఈ సదస్సుకు హాజరైన వారికి ధన్యావాదాలు తెలియజేస్తూ.. ఈ కార్యక్రమానికి ఆతిథ్యమివ్వడం భారత్‌కు మాత్రమే కాకుండా.. మొత్తం గ్లోబల్ సౌత్‌కే గర్వకారణమన్నారు.భూటాన్ ప్రధానమంత్రితో సమావేశమైన భారత ప్రధాని
February 18th, 07:40 pm
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026కు హాజరయ్యేందుకు భారత్‌కు విచ్చేసిన భూటాన్ ప్రధానమంత్రి శ్రీ షెరింగ్ తోబ్గేతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు.క్రొయేషియా ప్రధానమంత్రి ఆండ్రీ ప్లేంకోవిచ్ భారతదేశ పర్యటన
February 18th, 07:38 pm
‘ఏఐ ఇంపాక్ట్ సదస్సు’ సందర్భంగా ఈ రోజు క్రొయేషియా ప్రధానమంత్రి శ్రీ ఆండ్రీ ప్లేంకోవిచ్‌తో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.