హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో పాల్గొనాలని ప్రజలకు ప్రధానమంత్రి పిలుపు

August 09th, 07:20 pm

హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొనాలనీ, వికసిత్ భారత్ నిర్మాణానికి తోడ్పడాలన్న ఉమ్మడి సంకల్పంతో ముందుకు రావాలనీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. భారతదేశ ప్రతిష్ఠకు త్రివర్ణ పతాకం చిహ్నమనీ, దేశం కోసం తమ వంతు కృషి చేయడానికి ప్రతి పౌరునికీ నిరంతరం స్ఫూర్తినిస్తుందనీ శ్రీ మోదీ అన్నారు.

'మన్ కీ బాత్'లో భారతదేశ రక్షణ సామర్థ్యం, ​​ఆవిష్కరణలు మరియు సమిష్టి కృషిని ప్రస్తావించిన ప్రధాని మోదీ

July 26th, 11:30 am

Prime Minister Narendra Modi addressed the nation through Mann Ki Baat. In his speech, he highlighted important topics such as Kargil Vijay Diwas, Catch the Rain campaign, India's space sector prowess, Science Olympiads, Environmental conservation, Khadi and more. He called upon the citizens to share their ideas and suggestions for Independence Day through MyGov.

ప్రధాని మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం కోసం మీ ఆలోచనలను పంచుకోండి

July 25th, 02:34 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం కోసం తమ ఆలోచనలు, సూచనలను పంచుకోవాలని పౌరులను ఆహ్వానించారు.

న్యూజిలాండ్‌లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగం

July 11th, 01:15 pm

‘మళ్లీ ఏ పుష్కరానికో...’ అంటుంటాం భారత్‌లో మనం. గత నలభై ఏళ్లలో భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ రావడం ఇదే మొదటిసారి. దీనిని నా అదృష్టంగా భావిస్తున్నాను. న్యూజిలాండ్ ప్రజలందరికీ, మీలో ప్రతి ఒక్కరికీ 140 కోట్ల మంది భారతీయులు అందించిన హృదయపూర్వక శుభాకాంక్షలను మోసుకొచ్చాను.

న్యూజిలాండ్‌లో ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి

July 11th, 12:35 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆక్లాండ్‌లో జరిగిన “కియా ఓరా మోదీ” కార్యక్రమంలో న్యూజిలాండ్‌లోని ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన భారీ సభనుద్దేశించి ప్రసంగించారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి గౌరవ క్రిస్టోఫర్ లక్సన్ ప్రత్యేక అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆత్మీయత, శక్తి, ఉత్సాహం నిండిన 10,000 మందికి పైగా ప్రవాస భారతీయులు ఈ సభలో పాల్గొన్నారు.

ఇండోనేషియా పార్లమెంటులో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం

July 07th, 03:15 pm

ఇండోనేషియా ప్రజలు – చిన్నారులు, యువత, మహిళలు - ఈ రోజును నా జీవితంలో మరచిపోలేని రోజుల్లో ఒకటిగా మార్చారు. ఈ ఉదయం ఇండోనేషియా ప్రజల నుంచి నాకు దక్కిన ఆత్మీయత, అనురాగం, సాదర స్వాగతాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఈ ఉదయం అధ్యక్షులు ప్రబోవో కాపీరైట్ గురించి మాట్లాడారు. ప్రేమ, ఆత్మీయత, స్నేహం, పరస్పర గౌరవంపై ఎవరూ కాపీరైట్‌ను క్లెయిము చేయలేరని చెప్పాను. అధ్యక్షులు ప్రబోవోతో నా స్నేహం కాపీరైట్‌కి సంబంధించిన అన్ని హద్దులను అధిగమించింది.

ఇండోనేషియా పార్లమెంటును ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం

July 07th, 03:00 pm

ఈ సందర్భంగా ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. సమావేశానికి విచ్చేసిన ఇండోనేషియా అధ్యక్షుడు శ్రీ ప్రభోవో సుబియాంటోకు ధన్యవాదాలు తెలిపారు. తనకు సాదర ఆహ్వానం పలకడమే కాకుండా భారత్-ఇండోనేషియా భాగస్వామ్యానికి ఎంతో కృషి చేస్తున్న పార్లమెంటు స్పీకర్ శ్రీమతి పువాన్ మహారాణికి కృతజ్ఞతలు తెలియజేశారు. 140 కోట్ల మంది భారత ప్రజల తరపున అక్కడి ఎంపీలకు శుభాకాంక్షలు అందజేశారు. ప్రజాస్వామ్యానికి పట్టునిల్లు అయినటువంటి భారత్‌.. ఇండోనేషియాతో ఉన్న ప్రజాస్వామ్య బంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఆకాంక్షిస్తోందని పేర్కొన్నారు. ఉభయ దేశాల మధ్య ఉన్న లోతైన చారిత్రక, నౌకా వాణిజ్య సంబంధాలను ఆయన ప్రస్తావించారు. రెండు వేల సంవత్సరాలకు పైగా పరస్పర భావాలు, వాణిజ్యం, సంస్కృతి, విశ్వాసాల ద్వారా భారత్, ఇండోనేషియాలను హిందూ మహాసముద్రం అనుసంధానిస్తోందని ప్రధానమంత్రి శ్రీ మోదీ తెలిపారు. భారత్‌కు చెందిన వసుధైక కుటుంబం, ఇండోనేషియాకు చెందిన భిన్నేక తుంగల్ ఇక (భిన్నత్వంలో ఏకత్వం) వంటి ఉమ్మడి ఆదర్శాలను ప్రధాని ప్రస్తావించారు. ఈ విలువలే రెండు దేశాల భాగస్వామ్యానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని చెప్పారు. ఉమ్మడి చారిత్రక నేపథ్యం, సవాళ్లు, ఇరు దేశాల ప్రజల ఆకాంక్షలు భారత్, ఇండోనేషియాలను సహజసిద్ధమైన, నమ్మకమైన భాగస్వాములుగా మార్చాయని పేర్కొన్నారు.

అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు ఆ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధాని

July 04th, 09:40 pm

అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకొని ఆ దేశ అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ ట్రంప్‌‌తో పాటు ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్-అమెరికా భాగస్వామ్యానికి ఉన్న శాశ్వతమైన బలాన్ని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య సంబంధాలు కేవలం వ్యూహాత్మక భాగస్వామ్యానికే పరిమితం కాకుండా ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన, ఇరు దేశ ప్రజల అపరిమిత సామర్థ్యాలపై గల నమ్మకం అనే ఉమ్మడి విలువల పునాదిపై ఈ బంధం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు.

సీషెల్స్ 50వ స్వాతంత్ర్య ఉత్సవాలకు హాజరయిన ప్రధానమంత్రి

June 29th, 08:00 am

సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మిని ఆహ్వానం మేరకు ఆ దేశ 50వ స్వాతంత్ర ఉత్సవాలకు గౌరవ అతిథిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హాజరయ్యారు. ఆ దేశ స్వాతంత్ర్య ఉత్సవాల్లో పాల్గొన్న తొలి భారత ప్రధాని ఆయనే.

వందేమాతరం 150 సంవత్సరాల ప్రత్యేక చర్చ సందర్భంగా లోక్ సభలో ప్రధానమంత్రి ప్రసంగం

December 08th, 12:30 pm

ఈ ప్రత్యేక సందర్భంలో సామూహికంగా చర్చించేందుకు ముందుకు వచ్చినందుకు మీకు, ఈ సభలోని గౌరవ సభ్యులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేశ స్వాతంత్ర్య ఉద్యమాన్ని శక్తి, త్యాగస్పూర్తి, నిరాడంబరతను నింపిన ఆ మంత్రాన్ని, ఆ స్పష్టమైన పిలుపును గౌరవంగా గుర్తుచేసుకుంటూ.. ఈ సభలో వందేమాతరాన్ని స్మరించుకోవడం మనందరికీ గొప్ప గౌరవం. వందేమాతరం 150 సంవత్సరాల చారిత్రక ఘట్టానికి మనం సాక్షులుగా నిలబడటం చాలా గర్వకారణం. ఈ కాలం చరిత్ర విస్తృతి నుంచి లెక్కలేనన్ని సంఘటనలను మన ముందుకు తీసుకువస్తుంది. ఈ చర్చ ఖచ్చితంగా సభ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. కానీ మనం ఈ క్షణాన్ని సమష్టిగా ఉపయోగించుకుంటే రాబోయే తరాలకు, ప్రతి తరానికి కూడా నేర్చుకునే మూలంగా ఉపయోగపడుతుంది.

జాతీయ గేయం వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్ సభ ప్రత్యేక చర్చలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

December 08th, 12:00 pm

జాతీయ గేయం వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ రోజు లోకసభలో నిర్వహించిన ప్రత్యేక చర్చలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ విశేష సందర్భంలో సమష్టి చర్చకు అంగీకరించిన గౌరవ సభ్యులందరికీ ప్రధానమంత్రి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యోద్యమానికి ఉత్తేజాన్నీ, ప్రేరణనూ అందించి.. త్యాగనిరతి - దృఢసంకల్పంతో కూడిన మార్గాన్ని నిర్దేశించిన ‘వందేమాతరం’ మంత్రాన్ని స్మరించుకుంటున్నామని, సభలో ఉన్న వారందరికీ ఇదో గొప్ప గౌరవమని ఆయన వ్యాఖ్యానించారు. వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తయిన ఈ చరిత్రాత్మక సందర్భం దేశానికి గర్వకారణమని శ్రీ మోదీ అన్నారు. ఈ వేళ అనేక చారిత్రక సంఘటనలు మన కళ్లెదుట కదలాడేలా నిలుపుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ చర్చ సభ అంకితభావాన్ని చాటడమే కాకుండా, భావి తరాలు అవగాహన పెంచుకునే జ్ఞానసంపదగా నిలుస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సభ్యులంతా ఈ చర్చను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సామాన్యులు, రైతులు, ఎంఎస్ ఎంఈలు, మధ్యతరగతి, మహిళలు, యువతకు ప్రయోజనం చేకూర్చే జీఎస్టీ రేట్ల తగ్గింపు, సంస్కరణలపై కేంద్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలను జీఎస్టీ కౌన్సిల్ ఏకాభిప్రాయంతో ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి

September 03rd, 11:00 pm

సామాన్యులు, రైతులు, ఎంఎస్ఎంఈలు, మధ్యతరగతి, మహిళలు, యువతకు ప్రయోజనం చేకూర్చే జీఎస్టీ రేట్ల తగ్గింపు, సంస్కరణలపై కేంద్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలను కేంద్ర, రాష్ట్రాలతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ ఏకాభిప్రాయంతో ఆమోదించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. విస్తృతమైన సంస్కరణలు మన ప్రజల జీవితాలను మెరుగుపరుస్తాయి. అందరికీ, ముఖ్యంగా చిన్న వ్యాపారులకు, వ్యాపారాలకు వ్యాపార సౌలభ్యాన్ని అందిస్తాయి” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

అహ్మదాబాద్‌లోని కన్యా ఛత్రాలయలో సర్దార్‌ధామ్ 2వ దశ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

August 24th, 10:39 pm

కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు, గుజరాత్ ప్రభుత్వ మంత్రులు.. హాజరైన నా తోటి పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, సర్దార్‌ధామ్‌ వ్యవహారాలు చూసుకుంటున్న సోదరుడు శ్రీ గగ్జీ భాయ్, ట్రస్టీ వి.కె. పటేల్, దిలీప్ భాయ్, ఇతర ప్రముఖులు.. నా ప్రియమైన సోదరీ సోదరులారా, ముఖ్యంగా నా ప్రియమైన కుమార్తెలారా..

అహ్మదాబాద్‌లోని కన్యా ఛత్రాలయలో సర్దార్‌ధామ్ ఫేజ్ - II శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

August 24th, 10:25 pm

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో కన్యా ఛత్రాలయలో సర్దార్‌ధామ్ ఫేజ్- II శంకుస్థాపన సందర్శంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో సందేశం ద్వారా ఈ రోజు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలికల సేవ, విద్యకు అంకితమైన ఈ వసతి గృహం స్థాపన గురించి వివరిస్తూ.. సర్దార్ ధామ్ పేరు లాగే అది చేసే కృషి కూడా పవిత్రమైనదని ప్రధానమంత్రి అన్నారు. ఈ హాస్టల్లో వసతి పొందే బాలికలు...అనేక ఆకాంక్షల్నీ, ఆశయాలనీ కలిగి ఉంటారని, వాటిని నెరవేర్చుకొనేందుకు అనేక అవకాశాలు లభిస్తాయని ఆయన వెల్లడించారు. ఈ అమ్మాయిలు స్వావలంబన, శక్తి సాధించినప్పుడు.. దేశ నిర్మాణంలో వారు సహజంగానే కీలకపాత్ర పోషిస్తారని, వారి కుటుంబాలు సాధికారత సాధిస్తాయని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఈ వసతి గృహంలో ఉండే అవకాశం లభించిన బాలికలకు, వారి కుటుంబాలకు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని ఆకాంక్షిస్తూ.. హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఎకనమిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంలో ప్రధానమంత్రి ప్రసంగం

August 23rd, 10:10 pm

వరల్డ్ లీడర్స్ ఫోరంకు హాజరైన అతిథులందరికీ స్వాగతం. ఈ సదస్సు నిర్వహిస్తున్న సమయం అత్యంత తగిన సమయం.. అందుకు నేను నిర్వాహకులను అభినందిస్తున్నాను. ఒక వారం కిందట నేను ఎర్రకోట నుంచి మాట్లాడుతూ తదుపరి తరం సంస్కరణలను ప్రస్తావించాను. ఇప్పుడు ఈ సదస్సు ఆ స్పూర్తిని మరింత బలోపేతం చేస్తుంది.

న్యూఢిల్లీలో జరిగిన ఎకనమిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

August 23rd, 05:43 pm

ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఎకనమిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన ప్రముఖ అతిథులందరినీ ఆయన స్వాగతించారు. ఈ ఫోరం జరుగుతున్న సమయం అత్యంత తగిన సమయంగా పేర్కొన్న శ్రీ నరేంద్ర మోదీ.. తగిన సమయంలో ఈ సదస్సును నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. గత వారం తాను ఎర్రకోట వేదికగా తదుపరి తరం సంస్కరణల గురించి మాట్లాడినట్లు గుర్తుచేసిన ప్రధానమంత్రి.. ఇప్పుడు ఆ స్ఫూర్తిని ఈ సదస్సు మరింత శక్తిమంతం చేస్తోందన్నారు.

శుభాన్షు శుక్లాతో ప్రధాని సంభాషణ

August 19th, 09:43 am

తప్పకుండా మీకో భిన్నమైన అనుభవమే కదా ఇది. మీ అనుభూతులను తెలుసుకోవాలనుకుంటున్నాను.

అంతరిక్ష యాత్రికుడు శ్రీ శుభాంశు శుక్లాతో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

August 19th, 09:42 am

రోదసీ యాత్రికుడు శ్రీ శుభాంశు శుక్లాతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్న న్యూ ఢిల్లీలో సమావేశమయ్యారు. అంతరిక్ష యానం అందించిన పరివర్తనాత్మక అనుభవాన్ని గురించి ప్రధాని ఈ సందర్భంగా మాట్లాడుతూ, అలాంటి ముఖ్య ప్రస్థానాన్ని చేపట్టి ముగించిన తరువాత ఎవరైనా మార్పును అనుభూతి చెందితీరుతారన్నారు. ఈ మార్పు తాలూకు అనుభవాన్ని వ్యోమగాములు ఎలా అర్థం చేసుకుంటారో తెలుసుకోవాలని ఉందని శ్రీ మోదీ అన్నారు. శ్రీ శుభాంశు శుక్లా జవాబిస్తూ, రోదసిలో స్థితి అచ్చంగా వేరేగా ఉంటుందని, భూమ్యాకర్షణ శక్తి లోపించడం దీనికి ఒక కీలక కారణమన్నారు.

ఢిల్లీ పరిధిలోని యూఈఆర్-II, ద్వారకా ఎక్స్‌ప్రెస్ రహదారి విభాగాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగం

August 17th, 12:45 pm

కేంద్ర కేబినెట్‌లో నా సహచరుడు నితిన్ గడ్కరీ గారు, హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ గారు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా గారు, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్త గారు, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు అజయ్ తమ్టా గారు, హర్ష మల్హోత్రా గారు, ఈ కార్యక్రమానికి హాజరైన ఢిల్లీ, హర్యానా ఎంపీలు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రియమైన సోదర సోదరీమణులారా...

రూ.11,000 కోట్ల విలువైన రెండు ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

August 17th, 12:39 pm

ఢిల్లీలోని రోహిణిలో దాదాపు రూ.11,000 కోట్ల విలువైన రెండు ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి ప్రసంగించారు. ఈ ఎక్స్‌ప్రెస్ రహదారి పేరు ‘ద్వారక’ అని, ఈ కార్యక్రమం ‘రోహిణి’లో జరుగుతోందని చెప్తూ స్థల ప్రాధాన్యాన్ని వివరించారు. జన్మాష్టమి వేళ పండుగ వాతావరణం వెల్లివిరుస్తోందన్న ఆయన.. తానూ ఆ ద్వారకాధీశుడి ప్రాంతానికే చెందినవాడినని గుర్తు చేసుకున్నారు. అక్కడి వాతావరణమంతా కృష్ణ భక్తితో నిండిపోయిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.